https://oktelugu.com/

Health Tips: రాత్రి భోజనం తర్వాత ఇలా చేస్తే.. జీర్ణ సమస్యలన్నీ పరార్

ప్రస్తుతం రోజుల్లో చాలా మంది బద్దకంగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఎక్కువగా విశ్రాంతి తీసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దీంతో భోజనం తర్వాత కనీసం వాకింగ్ చేయకుండా నిద్రపోతున్నారు. దీనివల్ల చాలా మంది అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. రాత్రిపూట హాయిగా నిద్రపట్టాలన్న కూడా తిన్న తర్వాత కాస్త వాకింగ్ చేయాలి.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 4, 2025 / 10:25 PM IST

    food

    Follow us on

    Health Tips: ప్రస్తుతం రోజుల్లో చాలా మంది బద్దకంగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఎక్కువగా విశ్రాంతి తీసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దీంతో భోజనం తర్వాత కనీసం వాకింగ్ చేయకుండా నిద్రపోతున్నారు. దీనివల్ల చాలా మంది అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. రాత్రిపూట హాయిగా నిద్రపట్టాలన్న కూడా తిన్న తర్వాత కాస్త వాకింగ్ చేయాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు. కానీ ప్రస్తుతం రోజుల్లో చాలా మంది బద్దకంగా ఫీల్ అయ్యి తిన్న వెంటనే నిద్రపోతున్నారు. ఇలా చేయడం అసలు ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తిన్న వెంటనే వాకింగ్ చేయకపోవడం వల్ల ఫుడ్ జీర్ణం కాదు. దీంతో గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, జీర్ణ సమస్యలు అన్ని కూడా వస్తాయని నిపుణులు అంటున్నారు. దీనికి తోడు నిద్రపోయే ముందు తింటున్నారు. రెండు గంటల ముందు తినడం వల్ల ఫుడ్ జీర్ణం అవుతుంది. కానీ తిని అలా నిద్రపోవడం వల్ల తిన్న ఫుడ్ జీర్ణం కాదు. దీంతో జీర్ణ సమస్యలు అన్ని కూడా వస్తాయి. మరి జీర్ణ సమస్యలన్నీ కూడా క్లియర్ కావాలంటే తిన్న తర్వాత ఎలాంటి చిట్కాలు పాటించాలో చూద్దాం.

    రాత్రి సమయాల్లో భోజనం ఆలస్యంగా చేయకూడదు. నిద్రపోవడానికి కనీసం రెండు గంటల ముందు అయిన భోజనం చేయాలి. ఇలా చేయడం వల్ల తిన్న ఫుడ్ అంతా జీర్ణం అవుతుంది. అలాగే రాత్రి భోజనం తర్వాత ప్రో బయోటిక్స్ వంటి పదార్థాలు తీసుకోవాలి. పాలు, మజ్జిగ, సోంపు, పెరుగు వంటివి తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. తిన్న వెంటనే కూర్చోవడం, నిద్రపోవడం వంటివి చేయకుండా పది నిమిషాల పాటు అయిన కూడా వాకింగ్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల తిన్న ఫుడ్ అంతా కూడా జీర్ణం అవుతుంది. అలాగే భోజనం చేసిన తర్వాత వజ్రాసనం వేస్తే గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఉండవని నిపుణులు అంటున్నారు. రోజూ రాత్రి భోజనం తర్వాత ఇలా చేయడం వల్ల వెంటనే జీర్ణ సమస్యలు అన్ని కూడా క్లియర్ అవుతాయి. ఇక ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు.

    తొందరగా భోజనం చేసి వాకింగ్ చేయడం వల్ల హాయిగా నిద్ర కూడా పడుతుంది. నిద్ర సమస్య వస్తే మాత్రం తప్పకుండా అనారోగ్య సమస్యల బారిన పడతారు. ఆలస్యంగా తిని వెంటనే నిద్రపోతే ఫుడ్ జీర్ణం కాక.. సరిగ్గా నిద్రపట్టదు. అదే తొందరగా తినడం వల్ల ఫుడ్ జీర్ణం అవుతుంది. దీంతో మీ నిద్రకు ఎలాంటి భంగం కూడా కలగదు. మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా దరిచేరవు. అదే నిద్ర తక్కువైతే మాత్రం మళ్లీ నీరసం, అలసట అన్ని వస్తాయి. అయితే ఏ పని మీద కూడా ఇంట్రెస్ట్ చూపించలేరు. నిద్ర తక్కువైతే మానసిక సమస్యలు కూడా వస్తాయి. ఒత్తిడి, ఆందోళన పెరుగుతుంది. అలాగే మానసికంగా చాలా డిస్టర్బ్‌గా ఉంటారు. ఏ పనిని కూడా సక్రమంగా నిర్వహించలేరు. కాబట్టి తొందరగా తినడం అలవాటు చేసుకోవడం ఉత్తమం.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.