https://oktelugu.com/

Health Policey:సాధారణ పెట్టుబడుల లాభాల కంటే హెల్త్ పాలసీ తీసుకోకపోవడం వల్ల ఎంత నష్టమో తెలుసా?

నేటి కాలంలో ఏ సమయంలో ఎలాంటి వ్యాధి వస్తుందో చెప్పని పరిస్థితి. ఆర్థికంగా లేని వారు సైతం క్యాన్సర్, కిడ్నీ తదిదర దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడుతున్నారు. ఇక అనుకోని యాక్సిడెంట్ల వల్ల తీవ్ర నష్టం జరుగుతుంది. ఒక వ్యక్తి ఒక సంవత్సరం పాటు పెట్టిన పెట్టుబడుల కంటే ఆ వ్యక్తి ఆసుపత్రిలో జాయిన్ అయినప్పుడు అయ్యే ఖర్చు ఎక్కువగా ఉంటుంది.

Written By:
  • Srinivas
  • , Updated On : May 2, 2024 / 11:40 AM IST

    Health Insurance

    Follow us on

    Health Policey:ప్రతి ఒక్కరూ తమ జీవితం బాగుండాలని కోరుకుంటారు. ఇదే సమయంలో ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటారు. ఆనందంగా ఉండడానికి అనేక మార్గాలు ఉన్నాయి. కానీ ఆరోగ్యం అనేది నేటి కాలంలో మన చేతుల్లో లేదని కొందరి అభిప్రాయం. ఎందుకంటే వాతావరణ కాలుష్యంతో పాటు కలుషితమైన ఆహారం తీసుకోవడం వల్ల ఎప్పుుడు ఎలాంటి జబ్బు వస్తుందో తెలియని పరిస్థితి. ఒక వ్యక్తి అనారోగ్యానికి గురైనప్పుడు ఆ వ్యక్తిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతారు. అందుకు కారణం ఏదైనా అనారోగ్యానికి గురైనప్పుడు డబ్బు బాగా ఖర్చవుతుందని భయపడుతుంటారు. అయితే హెల్త్ పాలసీ తీసుకోవడం వల్ల మానసికంగా కొంచెం ప్రెషర్ తగ్గుతుంది. కానీ హెల్త్ పాలసీని చాలా మంది విస్మరిస్తున్నారు. సాధారణ పెట్టుబడుల కంటే హెల్త్ పాలసీ తసుకోకపోవడం వల్ల ఎంత నష్టమో తెలుసా?

    నేటి కాలంలో చాలా మంది యువత ఉద్యోగ, వ్యాపార రంగంలో రాణిస్తున్నారు. కొందరు యువ పారిశ్రామిక వేత్తలు అనతి కాలంలోనే అత్యధికంగా డబ్బు సంపాదిస్తున్నారు. కానీ ఇదే సమయంలో ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఆరోగ్యంగా ఉండేందుకు వ్యాయామాలు, ఇతర వర్కౌట్లు చేస్తున్నా.. ఫలితం ఉండడం లేదు. ఏదైనా అనారోగ్యానికి గురైనప్పుడు శారీరక బాధతో పాటు మానసికంగా ఆందోళన చెందుతున్నారు. అదే హెల్త్ పాలసీ చేతిలో ఉంటే ఇలాంటి సమయంలో ఎలాంటి మానసిక ఒత్తిడికి గురికావాల్సిన అవసరం లేదు.

    చాలా మంది హైల్త్ పాలసీ అనగానే రాబడి లేని పెట్టుబడి అని భావిస్తారు. అంతేకాకుండా తాత్కాలికంగా లాభాలు వచ్చేన పెట్టుబడులపై ఆసక్తి చూపుతారు. కానీ హెల్త్ పాలసీ పై ఎలాంటి రాబడి లేకపోవడం వల్ల దీనిని పట్టించుకోరు. అయితే ఏదైనా అనారోగ్యం సంభవించినప్పుడు హెల్త్ పాలసీ ఇచ్చే ప్రయోజనాలు అధికంగా ఉంటాయి. ఆసుపత్రిలో చేరినప్పుడు హెల్త్ పాలసీ వల్ల ఇతర పెట్టుబడుల కంటే ఎక్కువ లాభాలు పొందవచ్చు.

    నేటి కాలంలో ఏ సమయంలో ఎలాంటి వ్యాధి వస్తుందో చెప్పని పరిస్థితి. ఆర్థికంగా లేని వారు సైతం క్యాన్సర్, కిడ్నీ తదిదర దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడుతున్నారు. ఇక అనుకోని యాక్సిడెంట్ల వల్ల తీవ్ర నష్టం జరుగుతుంది. ఒక వ్యక్తి ఒక సంవత్సరం పాటు పెట్టిన పెట్టుబడుల కంటే ఆ వ్యక్తి ఆసుపత్రిలో జాయిన్ అయినప్పుడు అయ్యే ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అదే ఆరోగ్య బీమా తీసుకోవడం వల్ల ఆసుపత్రి ఖర్చుల నుంచి మినహాయించుకోవచ్చు. అప్పటి వరు ఎన్నో పెట్టుబుడు పెట్టినా అత్యవసరం సమయంలో ఇవి ఉపయోగపడే ఆస్కారం లేదు. ఇలాంటి సమయంలో అందుబాటులో ఉండేది ఆరోగ్య బీమా మాత్రమే అందువల్ల మిగతా వాటి కంటే ఆరోగ్యబీమా అత్యున్నతమైనదని కొందరు అభిప్రాయపడుతున్నారు.