https://oktelugu.com/

Health: ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఈ సమస్యలు ఉన్నవారు తినడం ప్రమాదమే!

బచ్చలికూరలో ఐరన్, పొటాషియం, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో బాగా ఉపయోగపడతాయి. అయితే ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఈ బచ్చలికూరను తినకూడదో మరి ఈ స్టోరీలో చూద్దాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 31, 2024 / 10:03 PM IST

    bachali kura

    Follow us on

    Health: ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇందులోని పోషకాలు సగం అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా జీవించాలంటే తప్పకుండా ఆకుకూరలు తినాలని డాక్టర్లు చెబుతుంటారు. అయితే అన్ని రకాల ఆకుకూరలు కూడా ఒకేసారి దొరకవు. కొన్ని సీజన్ బట్టి మార్కెట్లో దొరుకుతాయి. వీటిని డైలీ తినడం కూడా ఆరోగ్యానికి మంచిదే. అయితే వీటిలోని పోషకాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో బాగా ఉపయోగపడతాయి. కానీ అన్ని రకాల ఆకు కూరలు అందరి ఆరోగ్యానికి సెట్ కావు. కొన్ని కూరగాయలు కొందరి ఆరోగ్యానికి మేలు చేస్తే.. మరికొందరికి మాత్రం అనారోగ్య సమస్యలను తెస్తుంది. ఈ విషయం తెలియక అందరూ తినేస్తుంటారు. అలాంటి వాటిలో బచ్చలికూర ఒకటి. ఇందులో విటమిన్లు, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ప్రయోజనాలు చేకూర్చిన కూడా కొందరికి అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది. ఎక్కువగా ఈ ఆకు శీతాకాలంలో దొరుకుతుంది. ఇందులో ఐరన్, పొటాషియం, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో బాగా ఉపయోగపడతాయి. అయితే ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఈ బచ్చలికూరను తినకూడదో మరి ఈ స్టోరీలో చూద్దాం.

     

    బచ్చలి కూరలోని పోషకాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అయితే అందరి ఆరోగ్యానికి ఈ బచ్చలి కూర మంచిది కాదు. ముఖ్యంగా కిడ్నీలో రాళ్ల సమస్యలు ఉన్నవారు ఈ ఆకును అసలు తినకూడదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే ఫుడ్ అలర్జీ, జీర్ణ సమస్యలు ఉన్నవారు ఈ బచ్చలి కూర తినడం వల్ల తీవ్రంగా అనారోగ్య బారిన పడతారు. పొరపాటున కూడా ఈ సమస్యలు ఉన్నవారు బచ్చలికూరను తినకూడదు. ఇందులో ఉండే అనే పదార్థం యూరిక్ యాసిడ్ స్థాయిలను శరీరంలో పెంచుతుంది. దీనివల్ల కీళ్ల సమస్యలు ఎక్కువ అవుతాయి. యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారు అసలు ఈ ఆకు జోలికి పోకూడదు. కొందరు ఎనీమియా సమస్యతో బాధపడుతుంటారు. వీటికి మందులు వాడుతున్నట్లయితే బచ్చలికూర తినకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ బచ్చలి కూర వల్ల కొందరికి నోటి మీద పూతలు, బొబ్బర్లు కూడా వచ్చే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అనారోగ్య సమస్యలు ఉన్నవారు వీటి జోలికి పోవద్దు.

     

    బచ్చలికూర ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ కాలేయం వంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు కూడా తినకూడదు. ఎందుకంటే ఇందులో కాల్షియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది కాలేయ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి ఈ అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో కూడా బచ్చలి కూరను తీసుకోకపోవడం మంచిది. బచ్చలి కూరను డైలీ తినడం వల్ల కళ్లు ఆరోగ్యంగా పనిచేస్తాయి. ఇందులో విటమిన్లు, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్ వంటి పోషకాలు జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తాయి. ఇవి రక్త ప్రవాహాన్ని మెరుగుపరిచి రక్తపోటును నియంత్రిస్తాయి. ఇందులోని సెలీనియం, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు నరాల ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. ఇందులో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. ఇది మలబద్ధకం వంటి సమస్యలను కూడా తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది.

     

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.