Health issues: కొందరు ఏదైనా తింటే వెంటనే వారికి ఎక్కిళ్లు, పుల్లని తేన్పులు వస్తుంటాయి. అయితే ఏదో ఒకసారి వస్తే తిన్న ఆహారం జీర్ణం కాలేదని, తిన్న వెంటనే కూర్చోవడం వంటి కారణాల వల్ల వస్తుందని అనుకుంటాం. కానీ కొందరికి ఎక్కువగా ఈ పుల్లని తేన్పులు వస్తాయి. ఏదైనా చిన్న పదార్థం తిన్న తర్వాత కూడా వస్తుంటుంది. అసలు ఇలా తేన్పులు ఎందుకు వస్తాయి? ఇవి ఎక్కువగా రావడం వల్ల ఏదైనా అనారోగ్య సమస్యలకు దారితీస్తుందా? అనే విషయాలు మనలో చాలామందికి తెలియదు. కొందరు పూర్తిగా ఆహారం తీసుకోరు. అలాంటి వారికి కడుపులో గ్యాస్ ఏర్పడుతుంది. దీంతో ఆమ్లతత్వం వల్ల పుల్లని తేన్పులు వస్తాయి. దీనివల్ల కొందరికి కడుపు నొప్పి రావడంతో పాటు ఏ పదార్థాన్ని కూడా సరిగ్గా తినలేరు. మరి ఈ సమస్య తగ్గాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. అవేంటో మరి ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఆహారం తిన్న తర్వాత తేన్పులు రాకుండా ఉండాలంటే బాడీని హైడ్రేట్‌గా ఉంచుకోవాలి. అప్పుడు ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు రావు. డైలీ నిమ్మకాయ నీరును తాగడం వల్ల పుల్లటి తేన్పులు తగ్గుతాయి. డైలీ నిమ్మకాయ నీరు తాగడం వల్ల జీర్ణక్రియ కూడా సక్రమంగా పనిచేస్తుంది. అలాగే శరీరంలోని విషపదార్థాలను కూడా బయటకు పంపిస్తుంది. అలాగే ఆహార పదార్థాల్లో ఫైబర్ ఉండే ఆకు కూరలు, తృణధాన్యాలు, తాజా పండ్లు చేర్చుకోవాలి. వీటితో ప్రోబయోటిక్స్, ప్రీబయోటిక్స్ ఉండే వాటిని తీసుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది. వీటితో పాటు అరటిపండ్లు, తృణధాన్యాలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, సోయాబీన్స్ వంటి వాటిని కూడా చేర్చుకోవాలి.
కొందరు తిన్న వెంటనే కూర్చోవడం, పడుకోవడం వంటివి చేస్తారు. దీనివల్ల ఎక్కువగా తేన్పులు వస్తాయి. కాబట్టి తిన్న వెంటనే కూర్చోవడం, పడుకోవడం వంటివి చేయకుండా ఒక పది నిమిషాలు అయిన వాకింగ్ చేయాలి. దీనివల్ల తిన్న ఆహారం వెంటనే జీర్ణం అవుతుంది. దీంతో పుల్లని తేన్పులు తగ్గుతాయి. అలాగే కడుపు సమస్యలను తగ్గించే యోగా వంటివి చేయాలి. వీటితో తిన్నప్పుడు కొందరు ఎక్కువగా నీరు తాగుతారు. తినేటప్పుడు నీరు తాగకుండా తిన్న తర్వాత నీరు తాగాలి. వైద్యులు ఎక్కువగా తిన్న రెండు నుంచి మూడు గంటల తర్వాత నీరు తాగాలని అంటుంటారు. ఇలా తాగడం వల్ల ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుందని చెబుతుంటారు. కానీ కొందరు తినేటప్పుడు నీరు ఎక్కువగా తాగుతారు. కాస్త కారం అనిపించిన కూడా నీరు తాగుతుంటారు. దీనివల్ల ఆహారం తక్కువగా తీసుకుంటారు. కాబట్టి తినేటప్పుడు నీరు తక్కువగా తీసుకోండి. ఈ చిట్కాలు పాటిస్తుంటే తేన్పులు వచ్చే సమస్య తగ్గుతుంది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.