https://oktelugu.com/

Health issues: నిద్రలో కండరాలు పట్టేస్తున్నాయా? అయితే ఇలా చేయండి

నిద్రలో కాలులో కండరాలు ఒక్కసారిగా బిగుసుకుపోతే.. చీలమండలం దగ్గర ఎక్కువగా నొప్పి వస్తుంది. ఈ నొప్పిని తట్టుకోవడం కష్టం. కాలు తిమ్మిరి పడితే కొంత సమయానికి పోతుంది. కానీ కాలు కండరాలు పట్టేస్తే మాత్రం నొప్పి తగ్గడం కష్టం. అసలు నిద్రలో కండరాలు ఎందుకు పట్టేస్తాయి? దీనికి చికిత్స ఏంటి? అనే పూర్తి వివరాలు తెలియాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 8, 2024 / 05:39 AM IST

    health

    Follow us on

    Health issues: నిద్రపోయేటప్పుడు మనకి తెలియకుండా కాళ్లు, మెడ, చేతులు కండరాలు వంటివి పట్టేస్తుంటాయి. కొందరికి ఎక్కువగా మెడ పడుతుంది. మరికొందరికి తెలియకుండానే కండరాలు పట్టేసినట్లు ఉంటాయి. నరాలు లాగుతున్నట్లు, బాగా నొప్పిగా కూడా అనిపిస్తుంది. సాధారణంగా ఈ సమస్య చలికాలంలో వయస్సులో పెద్దగా ఉన్నవారికి వస్తుంది. కానీ ఈ రోజుల్లో చాలా మంది ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. నిద్రలో కాలులో కండరాలు ఒక్కసారిగా బిగుసుకుపోతే.. చీలమండలం దగ్గర ఎక్కువగా నొప్పి వస్తుంది. ఈ నొప్పిని తట్టుకోవడం కష్టం. కాలు తిమ్మిరి పడితే కొంత సమయానికి పోతుంది. కానీ కాలు కండరాలు పట్టేస్తే మాత్రం నొప్పి తగ్గడం కష్టం. అసలు నిద్రలో కండరాలు ఎందుకు పట్టేస్తాయి? దీనికి చికిత్స ఏంటి? అనే పూర్తి వివరాలు తెలియాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.

    నిద్ర మత్తులో కండరాలు పట్టేయడానికి ఖచ్చితమైన కారణాలు చెప్పలేం. సాధారణంగా అయితే బాడీ బాగా డీహైడ్రేషన్‌కు గురైతే కాళ్లలో కండరాలు తొందరగా పట్టేస్తాయి. కొందరు శరీరానికి కావాల్సినంత నీరు పూర్తిగా తాగరు. దీనివల్ల కండరాలు సరిగ్గా పనిచేయవు. దీంతో నిద్ర సమయంలో కండరాలు గట్టి పట్టేస్తాయి. అందుకే డాక్టర్లు ఎక్కువగా నీరు తాగమని చెబుతుంటారు. అలాగే శరీరంలో ఎలక్ట్రోలైట్ అసమతుల్యత వల్ల కూడా కండరాలు పట్టేస్తాయి. శరీరానికి కావాల్సిన పోషకాల లేనప్పుడు తప్పకుండా ఈ సమస్య వస్తుంది. పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, సోడియం వంటి ఎలక్ట్రోలైట్ల అసమతుల్యత అనేది కండరాలపై ప్రభావం చూపుతుంది. కాబట్టి పోషకాలు ఉండే ఆహారాన్ని తప్పకుండా తినండి. వీటితో పాటు అధిక రక్తపోటు వంటి సమస్యల వల్ల కూడా కండరాలు పట్టేయడం సమస్య వస్తుంది.

    ఈ కండరాలు పట్టే సమస్య నుంచి విముక్తి చెందాలంటే మసాజ్ చేయాలి. అలాగే కాలిని ముందుకు, వెనక్కి కదిలించాలి. దీంతో పాటు వేడి నీరు బాటిల్ లేదా హీటింగ్ ప్యాడ్‌తో మసాజ్ చేయాలి. అలాగే వేడి నీటితో మాత్రమే స్నానం చేయాలి. పూర్తిగా వ్యాయామం వంటివి చేయకుండా ఉండటం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. కాబట్టి అప్పుడప్పుడు అయిన వ్యాయామం చేయడం అలవాటు చేసుకోండి. పోషకాలు ఉండే ఫుడ్ తీసుకోండి. పొటాషియం, మెగ్నీషియం వంటివి తినే ఫుడ్‌లో ఉండగలిగేలా చూసుకోవాలి. అప్పుడే ఈ సమస్య నుంచి విముక్తి చెందుతారు. లేకపోతే నొప్పితో ఏ పని చేయలేరు. కనీసం లేచి నడవలేరు కూడా. కాబట్టి జాగ్రత్తలు అనేవి తప్పనిసరి. చాలా మంది నిద్రపోయేటప్పుడు కూడా తినకుండా ఉంటారు. తప్పనిసరిగా రాత్రిపూట తినే నిద్రపోవాలి. లేకపోతే ఇలాంటి సమస్యలన్నింటిని కూడా ఎదుర్కోవలసి వస్తుంది.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.