https://oktelugu.com/

Health issues: ఓవర్ ఈటింగ్ డిజార్డర్‌తో ఇబ్బంది పడుతున్నారా.. బయట పడటం ఎలాగంటే?

సమయం సందర్భం లేకుండా అధిక మొత్తంలో ఫుడ్ తీసుకుంటారు. ఏదైనా మితంగానే తినాలి. కానీ ఎక్కువగా తింటారు. ఇలాంటి వారు ఓవర్ ఈటింగ్ డిజార్డర్‌తో ఇబ్బంది పడుతుంటారు. ఈ డిజార్డర్ ఉందని తెలియక కొందరు ఎక్కువగా తిని బరువు పెరుగుతుంటారు.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 8, 2024 / 04:29 AM IST

    Over eating disorder

    Follow us on

    Health issues: మారుతున్న జీవనశైలి వల్ల చాలా మంది ఇటీవల అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అయితే కొందరికి కొన్ని డిజార్డర్లు ఉంటాయి. కనీసం ఉన్నాయనే విషయం కూడా కొందరకు తెలియవు. వారికి తెలియకుండానే ఇబ్బంది పడతారు. అయితే కొందరికి ఎన్ని రోజులు తిన్నా కూడా ఆకలి వేయదు. మరికొందరికి ఎంత తిన్నా కూడా తినాలనిపిస్తుంది. వారికి తెలియకుండానే ఎక్కువగా ఫుడ్ తీసుకుంటారు. సమయం సందర్భం లేకుండా అధిక మొత్తంలో ఫుడ్ తీసుకుంటారు. ఏదైనా మితంగానే తినాలి. కానీ ఎక్కువగా తింటారు. ఇలాంటి వారు ఓవర్ ఈటింగ్ డిజార్డర్‌తో ఇబ్బంది పడుతుంటారు. ఈ డిజార్డర్ ఉందని తెలియక కొందరు ఎక్కువగా తిని బరువు పెరుగుతుంటారు. అయితే ఈ డిజార్డర్ వల్ల ఎక్కువగా ఫుడ్ తింటే బరువు పెరగడం వంటి సమస్యలు అన్ని వస్తాయి. మరి ఈ సమస్య నుంచి బయట పడటం ఎలాగో ఈ స్టోరీలో చూద్దాం.

    చిన్న ప్లేట్‌లో తినడం అలవాటు చేసుకోండి
    ఈ ఓవర్ ఈటింగ్ డిజార్డర్‌ సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు ఫుడ్‌ను అసలు కంట్రోల్ చేసుకోలేరు. ఎక్కువగా ఫుడ్ తింటారు. కాబట్టి ఈ ఫుడ్ తినడం కాస్త తగ్గించాలంటే చిన్న ప్లేట్‌లో వేసుకుని తినాలి. కొందరు పెద్ద ప్లేట్‌లో వేసుకుని తినడం వల్ల ఎక్కువగా తింటారు. అదే చిన్న ప్లేట్‌లో వేసుకుంటే తక్కువగా తినాలని గుర్తు వచ్చి తింటారు. అలాగే ఏ పదార్థాన్ని అయిన కూడా ఒక్కసారి మాత్రమే తక్కువగా తినాలి. ఎక్కువగా తినకూడదని మీ మనస్సుకు చెప్పుకోండి. దీనివల్ల కాస్త తినడం తగ్గిస్తారు. అప్పుడు మీ సమస్య తగ్గుతుంది. లేకపోతే సమస్య తీవ్రత పెరుగుతుంది. మీరు రోజురోజుకి ఇంకా ఫుడ్ ఎక్కువగా తింటారు.

    నెమ్మదిగా తినండి
    కొందరు ఫుడ్ మీద ఇష్టంతో ఫాస్ట్‌గా తింటారు. ఇలా కాకుండా నెమ్మదిగా తినడం అలవాటు చేసుకోవాలి. ఈ ఓవర్ ఈటింగ్ డిజార్డర్ ఉన్నవారు నెమ్మదిగా తింటే తక్కువగా తింటారు. అదే ఫాస్ట్‌గా తింటే ఎక్కువగా తింటారు. కాబట్టి నెమ్మదిగా నీరు తాగుతూ.. భోజనం చేయడం బెటర్‌ అని నిపుణులు చెబుతున్నారు. లేదా ఫుడ్ నములుతూ అయిన తినండి. ఇలా తినడం వల్ల ఓవర్ ఈటింగ్ డిజార్డర్ సమస్య నుంచి బయట పడతారు.

    మొబైల్ చూస్తూ తినవద్దు
    కొందరు టీవీ, మొబైల్ వంటివి చూస్తూ తింటారు. దీనివల్ల మీకు తెలియకుండానే ఎక్కువ తినేస్తారు. కాబట్టి మీ సమస్య పెరుగుతూనే ఉంటుంది. కానీ తగ్గదు. కాబట్టి తినేటప్పుడు ఎలాంటి స్క్రీన్‌లు చూడకుండా ఫుడ్ మీద ఇంట్రెస్ట్ పెట్టండి. తక్కువగా తినాలనే ఉద్దేశంతో మాత్రమే తినండి. అతిగా తినడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడతారు. ముఖ్యంగా ఊబకాయం వంటి సమస్యలు వెంటాడుతాయి. ఇవే కాకుండా దీర్ఘకాలిక సమస్యల బారిన కూడా పడాల్సి వస్తుంది. కాబట్టి ఈ చిట్కాలు పాటిస్తూ ఓవర్ ఈటింగ్ డిజార్డర్ సమస్య నుంచి బయటపడండి.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.