Bay Leaf: మారిన జీవనశైలి, ఆహార అలవాట్ల వల్ల చాలామంది శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి తొందరగా పెరుగుతుంది. సాధారణంగా యూరిక్ యాసిడ్ రక్తంలో కరిగిపోవడం, లేదా మూత్రాపిండాల నుంచి బయటకు వస్తుంది. అయితే ఈ యూరిక్ యాసిడ్‌ను బయటకు తొలగించలేకపోతే కిడ్నీలో రాళ్లు, కీళ్ల నొప్పులతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సమస్యలను తగ్గించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసిన కూడా కీళ్ల సమస్యలు తగ్గడం లేదంటే కొన్ని సహజ చిట్కాలు పాటించాలి. వంటింట్లో దొరికే పదార్థాలతో కీళ్ల నొప్పులు, కిడ్నీలో రాళ్ల సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఈ యూరిక్ యాసిడ్‌ను నియంత్రించాలంటే పాటించాల్సిన ఈ సహజ చిట్కాలేంటో మరి ఈ స్టోరీలో తెలుసుకుందాం.
అన్ని సమస్యల నుంచి విముక్తి..
యూరిక్ యాసిడ్‌ను నియంత్రించడం వల్ల కీళ్ల సమస్యలు, కిడ్నీ సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. ఈ యాసిడ్ అధికమవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు, గుండె సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ సమస్యలేవి రాకుండా యూరిక్ యాసిడ్‌ను తగ్గించుకోవాలంటే బిర్యానీ ఆకు బాగా ఉపయోగపడుతుంది. రోజూ ఈ టీను తాగడం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయి తగ్గుతుంది. ఈ ఆకులతో ఆస్తమా, గుండె సమస్యలు, ఇన్‌ఫ్లుఎంజా, మూత్రపిండాలు, కీళ్ల సమస్యలు, కిడ్నీ సమస్యల నుంచి తొందరగా విముక్తి చెందవచ్చు. ఇందులో ఎక్కువగా విటమిన్ ఎ, విటమిన్ బి6, విటమిన్ సి వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా బాగా ఉపయోగపడతాయి. క్రమం తప్పకుండా బిర్యానీ ఆకులను తీసుకోవడం వల్ల ఎన్నో సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. వీటిని వంటల్లో కూడా ఎక్కువగా వాడతారు. ఏదో విధంగా ఈ బిర్యానీ ఆకు బాడీలోకి వెళ్తే ఆరోగ్యానికి చాలామంచిది.
బిర్యానీ ఆకు టీ ఎలా చేయాలంటే?
ఈ ఆకు టీ చేయాలంటే ముందుగా పది కంటే ఎక్కువ ఆకులను శుభ్రం చేసుకోవాలి. వీటిని ఒక పాన్‌లో వేసి, మూడు నుంచి నాలుగు గ్లాసుల నీరు వేయాలి. నీరు బాగా మరిగిన తర్వాత గ్లాసు నీరు మాత్రమే మిగిలేలా చూసుకోవాలి. ఈ టీను రోజుకి రెండు సార్లు తాగితే అన్ని సమస్యల నుంచి విముక్తి కల్పిస్తుంది. బిర్యానీ ఆకు తాజాగా ఉన్నవి వాడవచ్చు. అవి లేకపోతే ఎండిన బిర్యానీ ఆకులతో అయిన టీ చేసుకుని తాగితే ఆరోగ్యంగా ఉంటారు. డైలీ డైట్‌లో ఈ ఆకులను చేర్చుకోవడం వల్ల నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. అలాగే ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శరీరంలో ఉండే నొప్పులు, వాపులను కూడా తగ్గించడంలో ముఖ్యపాత్ర వహిస్తుంది. వీటితో పాటు జలుబు, గొంతు నొప్పి, దగ్గు, శ్వాసకోశ వంటి సమస్యలను కూడా తగ్గించడంలో బిర్యానీ ఆకు బాగా ఉపయోగపడుతుంది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించేముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.