Health Issue: కొంతమంది పురుషులు మూత్రాశయం సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. అయితే పురుషులు లేదా మహిళలు కొందరు తరచుగా మూత్రం వెళ్తుంటారు. దీన్ని ఓవర్ యాక్టివ్ బ్లాడర్ సమస్య అంటారు. అయితే ఈ సమస్య ఎక్కువగా పురుషుల్లోనే కనిపిస్తుంది. ఏ వయస్సు వారికైనా సరే ఈ సమస్య వస్తుంది. పురుషుల జీవనశైలి, వారి ఆహారపు అలవాట్ల వల్ల ఈ సమస్య ఎక్కువగా వస్తుంది. ఎన్నిసార్లు మూత్రం వెళ్లిన కూడా తరచుగా వెళ్లాలనే కోరిక వస్తుంది. ఎక్కువగా రాత్రిపూట వస్తుంది. దీంతో రాత్రంతా నిద్ర ఉండదు. అకస్మాత్తుగా ఒక్కోసారి మూత్ర విసర్జన చేస్తుంటారు. కొన్నిసార్లు మూత్రం కూడా లీకేజీ అవుతుంది. దీనికి ముఖ్య కారణం ప్రోస్టేట్ గ్రంధి మూత్రాశయంపై ఒత్తిడిని కలిగిస్తుంది. దీనివల్ల ఎక్కువగా మూత్ర విసర్జన చేయాలని అనుకుంటారు. ఈ సమస్య చాలా తీవ్రమైనది. దీనివల్ల కొన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఈ సమస్య వచ్చిన వెంటనే వైద్యుని సంప్రదించి చికిత్స తీసుకోవాలి. ఈ ఓవర్ యాక్టివ్ బ్లాడర్ కొన్ని వ్యాధుల వల్ల వస్తుంది. మరి అవేంటో చూద్దాం.
మధుమేహం
మధుమేహం ఉన్నవారు కూడా తరచుగా మూత్రానికి వెళ్తుంటారు. వీరికి కూడా ఈ సమస్య వచ్చే ప్రమాదం ఉంది. కండరాలు బలహీనంగా అవుతాయి. అలాగే నాడీ వ్యవస్థ కూడా దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. షుగర్ ఉండేవారు ఎక్కువగా మూత్రానికి వెళ్తుంటారు. దీనివల్ల మూత్రాశయం దగ్గర ఉండే నరాలు దెబ్బతిని వీక్ అయిపోతాయి. దీంతో నీరసం, అలసట వస్తాయి. ఎక్కువ సార్లు మూత్రం వెళ్లడం వల్ల శరీరంలోని నీరు అంతా బయటకు వెళ్లిపోతుంది. దీంతో శరీరానికి ఎలాంటి శక్తి ఉండదు. కాబట్టి ఎక్కువగా మూత్రం వస్తుంటే మాత్రం వెంటనే చికిత్స తీసుకోవడం ఉత్తమం.
కండరాలలో మార్పులు
ఈ సమస్యకు వెంటనే చికిత్స తీసుకోకపోతే పెరిగే కొలది పురుషుల మూత్రాశయ కండరాలు బలహీన పడతాయి. దీంతో మూత్రాశయం సామర్థ్యం తగ్గుతుంది. అలాగే మూత్రాశయ కండరాల సున్నితత్వం కూడా పెరుగుతుంది. మరికొందరు నరాల సమస్యలతో కూడా ఇబ్బంది పడతారు. పార్కిన్సన్స్ వ్యాధి, మల్టిపుల్ స్క్లెరోసిస్, స్ట్రోక్ వంటి నరాల సమస్యలు కూడా మూత్రాశయాన్ని దెబ్బతీస్తాయి. దీనివల్ల కూడా ఎక్కువ సార్లు మూత్రం వెళ్లాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
చికిత్స ఎలా?
పురుషుల్లో ఈ సమస్యను తగ్గించాలంటే ముఖ్యంగా జీవనశైలిలో మార్పులు చేయాలి. ఆల్కహాల్ తీసుకోకూడదు. వ్యాయామాలు ఎక్కువగా చేయాలి. ఈ సమస్య వస్తే లైట్ తీసుకోకుండా వైద్యుని సంప్రదించి చికిత్స తీసుకోవాలి. దీనికి వైద్యులు మందులు ఇస్తారు. ఈ సమస్యను వెంటనే తగ్గించుకోవాలి. లేకపోతే ప్రొస్టేట్ క్యాన్సర్‌కు దారితీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ పురుషుల్లో ఎక్కువగా వస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైనది. కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ సమస్య వస్తే ఆలస్యం చేయకుండా వైద్యుని సంప్రదించండి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.