Health Benefits: రావి చెట్టును అందరూ కూడా భక్తితో పూజిస్తారు. ప్రతీ గ్రామంలో ఈ చెట్టు తప్పనిసరిగా ఉంటుంది. ఏ సీజన్‌లో అయిన కూడా ఈ చెట్టును పూజిస్తారు. ముఖ్యంగా కార్తీక మాసంలో అయితే ప్రతీ ఒక్కరూ కూడా వేకువ జామున దీపారాధన చేస్తారు. అయితే ఈ రావి చెట్టు కేవలం పూజ కోసం మాత్రమే కాదు.. ఈ చెట్టు కింద కూర్చోని యోగా, ధ్యానం వంటివి చేయడం వల్ల శాంతి, జ్ఞానం లభిస్తాయని పండితులు చెబుతున్నారు. అయితే ఈ రావి చెట్టు ఆకుల్లో ఎన్నో ఆయుర్వేద గుణాలు ఉన్నాయి. వీటిని ఎక్కువగా ఔషధాల్లో ఉపయోగిస్తారు. ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలిగించడంలో ఈ రావి చెట్టు ఆకులు బాగా ఉపయోగపడతాయి. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు ఇన్ఫెక్షన్ నుంచి విముక్తి కలిగిస్తాయి. అలాగే వాపు, నొప్పి, శ్వాసకోశ సమస్యలు, దగ్గు, ఆస్తమా వంటి సమస్యల నుంచి రక్షిస్తుంది. ఇవే కాకుండా ఇంకా ఈ రావి చెట్టు ఆకులతో సర్వ రోగాలను నివారించుకోవచ్చు. అవేంటో మరి ఈ స్టోరీలో చూద్దాం.
రావి చెట్టు ఆకుల్లో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు గ్యాస్, ఎసిడిటీ, అజీర్ణం, డయేరియా వంటి సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది. ఈ చెట్టు ఆకులు చర్మానికి ఔషధంలా కూడా పనిచేస్తాయి. రావి చెట్టు ఆకుల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల జీర్ణశక్తి మెరుగవుతుంది. అలాగే మలబద్ధకం నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పేగుల్లోని మంటను నివారిస్తాయి. రోజూ రావి చెట్టు ఆకులను తీసుకోవడం వల్ల డయేరియా వంటి సమస్యలను తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. పేగుల్లో ఉండిపోయిన టాక్సిన్స్‌ను బయటకు పంపడంలో రావిచెట్టు ఆకులు బాగా సహాయపడతాయి. దీంతో రక్తసంబంధ రుగ్మతలు కూడా తొలగిపోతాయి. రావి చెట్టు ఆకులను కొందరు రసాన్ని కూడా తీసుకుంటారు. ఈ రసం తాగడం వల్ల పేగు ఇన్ఫెక్షన్ పూర్తిగా నయం అవుతుంది. ఉదయం పూట ఈ రసాన్ని తాగడం వల్ల రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. నీరసంగా ఉన్నవారికి వెంటనే శక్తి లభిస్తుంది. రావి చెట్టు ఆకులను తీసుకోవడం వల్ల శరీరంలో బలహీనత, అలసట తగ్గుతాయి. ఈ ఆకులను ఎండబెట్టి పొడి చేసుకుని కూడా తాగవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.