https://oktelugu.com/

Health Benefits: వెజిటేరియన్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ బాడీకి అందాలంటే? ఈ పదార్థాలు తీసుకోండి

చేపలు తినకపోవడం వల్ల ఇందులోని పోషకాలు శరీరానికి అందవు. అయితే శాకాహారులకు కూడా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అందాలంటే డైట్‌లో కొన్ని రకాల ఆహార పదార్థాలను చేర్చుకోవాలి. అప్పుడే ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు శరీరానికి అందుతాయి.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 13, 2024 / 02:49 AM IST

    fish

    Follow us on

    Health Benefits: చేపలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. ఇందులో ఉండే పోషకాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి బాగా ఉపయోగపడతాయి. అయితే చేపల్లో ఎక్కువగా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి బాగా సాయపడతాయి. ఇవి సాల్మన్, ట్యునా, సార్డినెస్ వంటి చేపల్లోనే ఎక్కువగా ఉంటాయి. అయితే ఆరోగ్య దృష్ట్యా కొందరు నాన్ వెజిటేరియన్ నుంచి వెజిటేరియన్‌గా మారిపోతారు. పూర్తిగా చేపలు తినకపోవడం వల్ల ఇందులోని పోషకాలు శరీరానికి అందవు. అయితే శాకాహారులకు కూడా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అందాలంటే డైట్‌లో కొన్ని రకాల ఆహార పదార్థాలను చేర్చుకోవాలి. అప్పుడే ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు శరీరానికి అందుతాయి. చేపల్లో ఉండే ఇవి ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలను చేకూరుస్తాయి. ఇందులోని పోషకాల వల్ల మెదడు జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. పిల్లలకు తప్పకుండా చేపలను వారానికి ఒకసారి పెట్టాలి. మరి చేపలను తినని వారు అయితే ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాల కోసం ఈ పదార్థాలను తీసుకోవాలి. అవేంటో మరి ఈ ఆర్టికల్‌లో చూద్దాం.

    చియా సీడ్స్
    ఎన్నో పోషకాలు ఉన్న చియా సీడ్స్‌లో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. చేపలు తినని వారు ఈ సీడ్స్ ద్వారా శరీరానికి ప్రయోజనాలను తీసుకోవచ్చు. చియా సీడ్స్‌ వాటర్ లేదా పుడ్డింగ్ చేసుకుని తినడం వల్ల మెదడు ఆరోగ్యానికి బాగా పనిచేస్తుంది. అలాగే గుండె జబ్బులు రాకుండా చేయడంలో సాయపడుతుంది. ఇందులోని ఫైబర్ జీర్ణ సమస్యల నుంచి కూడా విముక్తి కలిగిస్తుంది. శాకాహారులు వారానికి ఒకసారి అయిన తప్పకుండా చియా సీడ్స్‌ను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.

    సోయాబీన్స్
    ప్రొటీన్లు ఎక్కువగా ఉండే సోయాబీన్స్‌ను డైలీ డైట్‌లో చేర్చుకోవడం వల్ల శరీరానికి అన్ని ప్రయోజనాలు అందుతాయి. చేపల్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఇందులో కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు శరీరంలో ఉండే కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. అలాగే ఎముకలు బలంగా, ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.

    వాల్‌నట్స్‌
    డ్రైఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటిని తినడం వల్ల సగం అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. అయితే డ్రైఫ్రూట్స్‌లోని వాల్‌నట్స్‌లో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కేవలం శారీరక ఆరోగ్యమే కాకుండా మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. వాల్‌నట్స్ రోజూ తినడం వల్ల రక్తపోటు సమస్య కూడా తగ్గుతుంది. గుండె సమస్యలతో బాధపడేవారు రోజుకి కొన్ని వాల్‌నట్స్ తినడం వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారు.

    అవిస గింజలు
    పూర్వకాలంలో ఎక్కువగా అవిస గింజలను వాడేవారు. కానీ ఈ రోజుల్లో చాలా తక్కువ మంది వీటిని తింటున్నారు. అవిస గింజల్లో పుష్కలంగా ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. ఇవి జీవక్రియను మెరుగుపరుస్తాయి. ఇందులో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణ సమస్యలను తగ్గించడంలో బాగా ఉపయోగపడతాయి. అలాగే జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి బాగా ఉపయోగపడతాయి.

     

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.