Pumpkin Seeds: సాధారణంగా మనం గుమ్మడి కాయలను స్వీట్ చెయ్యడానికి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము..అంతే కాకుండా ఏదైనా శుభ కార్యాలను ప్రారంభించడం కోసం మనం దిష్టి తియ్యడానికి కూడా కామన్ గా ఉపయోగించే పదార్థం ఇదే..వీటి ఉపయోగాలు మనకి ఇంతే తెలుసు..కానీ గుమ్మడి కాయలు చేసే మేలు కొన్ని విలువైన టాబ్లెట్స్ కూడా చెయ్యలేవు అంటే ఏ మాత్రం అతిశయోక్తి కాదు ..ముఖ్యంగా ఇందులో ఉండే గింజలు తినడం వల్ల డాక్టర్లు కూడా పరిష్కరించలేని ఎన్నో సమస్యలు పరిష్కరించబడుతాయి..ఇంతకీ ఈ గింజలు వల్ల అంత ఉపయోగాలు ఏమిటో ఇప్పుడు మనం చూడబోతున్నాము.

నేటి తరం పురుషులలో చాలా మందిని వేధించే సమస్య వీర్య కణాల సంఖ్య తక్కువ ఉండడం..వీర్య కణాలు తక్కువ ఉండడం వల్ల ఒక్క సంతానం ని ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉండదు..ఈ సమస్య తో బాధపడుతూ ఎంతో మంది కుర్రోళ్ళు డాక్టర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు..ఎన్ని మందులు వాడిన కొంతమందికి సమస్య పరిష్కారం కానీ పరిస్థితి కూడా ఉన్నది..అలాంటి వారి కోసం ఇప్పుడు లేటెస్ట్ గా డాక్టర్లు ఇచ్చిన ఒక్క చిట్కా కాస్త ఊరట కలిగించేలా ఉన్నది..అసలు విషయానికి వస్తే గుమ్మడి కాయ గింజలు తినడం వల్ల పురుషుడిలో వీర్య కణాల సంఖ్య బాగా పెరుగుతుంది అట.
సాధారణంగా వీర్య కణాల ఉత్పత్తి కోసం డాక్టర్లు వైయాగ్రా లాంటి వాటిని వాడమని సలహా ఇస్తూ ఉంటారు..కానీ ఇవి ఎక్కువగా వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా బాగా ఉంటాయి..వాటికంటే గుమ్మడి కాయ గింజలు తినడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకపోగా..ఆరోగ్య పరంగా కూడా ఎన్నో అదనపు లాభాలు కూడా ఎన్నో ఉన్నాయి అని డాక్టర్లు చెప్తున్నారు.

గుమ్మడి కాయ గింజలు తినడం వల్ల మన శరీరం లో రక్త ప్రవాహం బాగా జరుగుతుంది అట..అంతే కాకుండా కంటి చూపు మరియు ఇమ్యూనిటీ పవర్ కూడా ఒక్క రేంజ్ లో పెరుగుతుంది అట..ఈ గింజలలో పొటాషియమ్ శాతం అధికంగా ఉండడం వల్ల హై బీపీ కూడా బాగా కంట్రోల్ అవుతుంది అని తెలుస్తుంది..వయస్సు మీదకి పడిపోతూ ఉండడం తో కొంతమందికి తీవ్రమైన వత్తిడిల కారణంగా గుండె జబ్బులు భవిష్యత్తులో వచ్చే అవకాశాలు బాగా కనిపిస్తాయి..ఈ సమస్య కూడా ఈ గింజలు తినడం వల్ల పరిష్కారం అవుతుంది అట..అంతే కాకుండా మన రక్తం లో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడం మాత్రమే కాదు..కొలెస్ట్రాల్ కూడా పెరగకుండా చూసుకుంటుంది..మధు మేహ వ్యాధి గ్రస్తులు కూడా ఈ గింజలను తప్పక తినాలి..ఇవి మాత్రమే కాకుండా ఈ గింజలు లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ , యాంటీ ఇంల్ఫామేటరీ, యాంటీ మేక్రోబైల్ వంటి లక్షణాలు కాన్సర్ రాకుండా కూడా నివారిస్తుంది అట..ఇవి అన్ని పక్కన పెడితే మన సౌందర్యం ని కూడా ఈ గింజలు బాగా పెంచుతాయి అని తెలుస్తుంది..గుమ్మడి కాయ గింజలు వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి అని తెలిసి కూడా ఇంకా ఎవ్వడు ఆగకండి..టాబ్లెట్స్ తో కూడా పరిష్కారం కానీ ఎన్నో సమస్యలకు గుమ్మడి కాయ గింజలు సంజీవని లాగ పని చేస్తుంది.
Recommended Videos


