Almonds Benefits: ప్రస్తుత రోజుల్లో ఆరోగ్యానికి చాలా ప్రాధాన్యం ఇస్తున్నారు. అందరు ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఫలితంగా రోగాలు లేకుండా చూసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే కాయ ధాన్యాలు వాడుతున్నారు. వీటిని రాత్రిపూట నానబెట్టి ఉదయం తీసుకుంటూ అందులోని పోషకాలు అందుకునేందుకు చొరవ తీసుకుంటున్నారు. దీని వల్ల ఆరోగ్య సమస్యలు రాకుండా చూసుకోవాలని భావిస్తున్నారు.
అవిసె గింజలు, బాదం పలుకులు మన ఆరోగ్యానికి రక్షణగా నిలుస్తాయి. నీటిలో నానబెట్టిన వాటిలో టానిస్ సమ్మేళనం ఉండటం వల్ల నానబెట్టిన వాటిని తినడం వల్ల ఇందులో ఉండే పీచు మనకు మేలు చేస్తుంది. ప్రొటీన్లు కడుపులో వేడిని కలిగించి మనకు ఉపయోగకరంగా ఉంటాయి. శనగలు, వేరుశనగలు కూడా రాత్రి నానబెట్టి ఉదయం తింటే మనకు ఎన్నో లాభాలుంటాయి.
మెంతులు రాత్రి నానబెట్టి ఉదయం తీసుకుంటే షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. మెంతులు మధుమేహానికి రక్షణగా నిలుస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ మనకు ఎంతో లాభం చేకూరుస్తుంది. మెంతులు నీటిలో నానబెట్టి తినడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. ఈ క్రమంలో వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ప్రయోజనాలు అందిస్తాయి.
మామిడి పండ్లను వేసవిలో ఎక్కువగా తింటాం. దీని వల్ల కొందరికి వేడి చేస్తుందని అంటారు. అలా జరగకుండా ఉండాలంటే వాటిని నీళ్లలో నానబెట్టి తినడం వల్ల మనక వేడి చేయకుండా రక్షణ కలుగుతుంది. అందుకే వీటిని నీటిలో నానబెట్టి తినడం శ్రేయస్కరం. ఇలా చేయడం వల్ల కూడా మనకు ఇతర సమస్యలు రాకుండా ఉంటాయి.