https://oktelugu.com/

Health Benefits: కొత్త ఏడాదిలో రిజల్యూషన్‌లు.. ఆరోగ్య విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే?

అన్నింటి కంటే ఆరోగ్యం ముఖ్యం. ఆరోగ్యం సరిగ్గా ఉంటేనే జీవితంలో ఎలాంటి లక్ష్యాలను అయిన సాధించగలరు. అయితే న్యూ ఇయర్‌లో ఆరోగ్య విషయంలో తీసుకోవాల్సిన రిజల్యూషన్లు ఏంటో చూద్దాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 1, 2025 / 11:19 PM IST

    Health

    Follow us on

    Health Benefits: కొత్త సంవత్సరం వచ్చేసింది. ఈ ఏడాదిలో అయిన కెరీర్‌లో అభివృద్ధి సాధించాలని, ఎలాంటి సమస్యలు లేకుండా గొప్పగా బతకాలని కొందరు న్యూ ఇయర్ రిజల్యూషన్‌లు పెట్టుకుంటారు. అయితే కొత్త సంవత్సరంలో ఇవే కాకుండా ఆరోగ్య విషయంలో కూడా రిజల్యూషన్లు పెట్టుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అన్నింటి కంటే ఆరోగ్యం ముఖ్యం. ఆరోగ్యం సరిగ్గా ఉంటేనే జీవితంలో ఎలాంటి లక్ష్యాలను అయిన సాధించగలరు. అయితే న్యూ ఇయర్‌లో ఆరోగ్య విషయంలో తీసుకోవాల్సిన రిజల్యూషన్లు ఏంటో చూద్దాం.

    సమతులమైన ఆహారం తీసుకోవాలి
    ఈ ఏడాదిలో పోషకాలు ఉండే ఆహారాన్ని తీసుకోవడం అలవాటు చేసుకోండి. ప్రాసెస్ చేసిన ఫుడ్ తీసుకోవడం పూర్తిగా తగ్గించుకోవాలి. ప్రొటీన్లు ఉండే ఆహారాలు, పండ్లు, కూరగాయలు అన్ని తీసుకోవాలి. డైలీ సరైన సమయానికి ఫుడ్ తినడం అలవాటు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

    వ్యాయామం చేయాలి
    రోజూ కూడా వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. ప్రతీ రోజూ 30 నిమిషాల పాటు నడక, యోగా, మెడిటేషన్ ఇలా ఏదో ఒకటి చేయాలని నిపుణులు అంటున్నారు. రోజూ వ్యాయామం చేయడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి పొందవచ్చు. ముఖ్యంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

    మానసిక ఆరోగ్యానికి ఇంపార్టెంట్ ఇవ్వండి
    శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. కాబట్టి ధ్యానం, యోగా వంటివి చేయాలి. ఇలా చేయడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. ఎలాంటి టెన్షన్లు లేకుండా సంతోషంగా జీవిస్తారు.

    హైడ్రేటెడ్‌గా ఉండండి
    రోజుకి కనీసం 8 నుంచి10 గ్లాసుల నీరు త్రాగాలి. దీనివల్ల బాడీ హైడ్రేట్‌గా ఉంటుంది. ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు. చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

    హాయిగా నిద్రపోవాలి
    ఈ రోజుల్లో కొందరు సోషల్ మీడియాకు బానిస అయ్యి ఎక్కువగా నిద్రపోరు. దీంతో లేని పోని అనారోగ్య సమస్యలను తెచ్చుకుంటారు. ఈ ఏడాదిలో అయిన డైలీ 7 నుంచి 8 గంటలు నిద్రపోయేలా ప్లాన్ చేసుకోండి. హాయిగా నిద్రపోవడం వల్ల ఎలాంటి సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు.

    హెల్త్ చెకప్‌లు చేయండి
    ఆరోగ్యంపై కాస్త జాగ్రత్త తీసుకోండి. అప్పుడప్పుడు హెల్త్ చెకప్‌లు చేయించుకోండి. దీనివల్ల మీకు ఏవైనా సమస్యలు ఉంటే ముందుగానే తెలుస్తుంది. దీంతో చికిత్స చేసుకుంటే సమస్యలు తొందరగా తగ్గుతాయి.

    స్క్రీన్ సమయాన్ని తగ్గించండి
    ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు వంటి వాడకం తగ్గించండి. పుస్తకాలు చదవడం, ఆటలు ఆడటం వంటివి చేయడం అలవాటు చేసుకోండి. ఎక్కువగా స్క్రీన్ చూడటం వల్ల కళ్ల సమస్యలు వస్తాయి. మానసిక ఒత్తిడి, ఆందోళన వంటివి పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.

    చర్మ ఆరోగ్యం
    చర్మ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి. ప్రతిరోజు చర్మానికి మాయిశ్చరైజింగ్ రాయడం, ప్యాక్‌లు వంటివి చేయాలి. ఇలా చేస్తే చర్మంపై మొటిమలు, మచ్చలు రాకుండా ఉంటాయి.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది.