https://oktelugu.com/

Health Benefits: కిస్‌మిస్‌ను నీళ్లలో కాదు.. ఇందులో నానబెట్టి తింటే.. అనారోగ్య సమస్యలన్నీ పరార్

ఎండు ద్రాక్షను నీటిలో కాకుండా పాలలో నానబెట్టి తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. పాలు, కిస్‌మిస్ లోని పోషకాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి బాగా సాయపడతాయి. మరి పాలలో నానబెట్టి తినడం వల్ల కలిగే ఆ ప్రయోజనాలేంటో ఈ స్టోరీలో చూద్దాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 14, 2025 / 06:57 AM IST

    kismis

    Follow us on

    Health Benefits:  ఆరోగ్యంగా ఉండాలంటే డ్రై ఫ్రూట్స్‌ను (Dry fruits) తప్పకుండా తీసుకోవాలి. చూడటానికి చిన్నగా ఉన్నా.. వీటి రేట్లు అయితే ఆకాశాన్ని తాకుతాయి. డైలీ లైఫ్‌లో డ్రై ఫూట్స్‌ను (Dry Fruits) యాడ్ చేసుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు (Health Benefits) ఉన్నాయి. రోజూ తినడం వల్ల కండరాలు బలంగా తయారవుతాయి. శరీరంలో నీరసం, అలసట పోయి యాక్టివ్‌గా (Active) మారుతారు. అయితే ఈ డ్రైఫూట్స్‌‌ను (Dry Fruits) చాలా మంది నీటిలో నానబెట్టి (Soak) తింటారు. రాత్రిపూట నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే పరగడుపున (Early Morning) తింటారు. ఇలా తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. అయితే చాలా మంది కిస్‌మిస్‌ను రాత్రిపూట నానబెట్టి ఉదయాన్నే తింటారు. వీటివల్ల ఎముకలు (Bones) బలహీనంగా మారకుండా స్ట్రాంగ్‌గా ఉంటాయి. ఇందులోని పోషకాలు కండరాలు, ఎముకలను బలంగా చేయడంలో బాగా ఉపయోగపడతాయి. అయితే ఎండు ద్రాక్షను నీటిలో కాకుండా పాలలో నానబెట్టి తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. పాలు, కిస్‌మిస్ లోని పోషకాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి బాగా సాయపడతాయి. మరి పాలలో నానబెట్టి తినడం వల్ల కలిగే ఆ ప్రయోజనాలేంటో ఈ స్టోరీలో చూద్దాం.

    ఎండుద్రాక్షలను పాలలో నానబెట్టి తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులోని పోషకాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. రక్తపోటును నియంత్రించడంతో పాటు రక్తాన్ని శుద్ధి చేయడంలో కూడా ఇవి బాగా సహాయపడతాయి. అలాగే కడుపు సంబంధిత సమస్యలను తొలగించడంలో ఇవి ముఖ్య పాత్ర పోషిస్తాయి. పాలలో నానబెట్టిన ఎండుద్రాక్ష తినడం వల్ల పేగు ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే మలబద్ధకం, అసిడిటీ వంటి కడుపు సంబంధిత సమస్యలు కూడా క్లియర్ అవుతాయి. పాలలో నానబెట్టిన ఎండుద్రాక్షను తినడం వల్ల శరీరానికి తక్షణమే శక్తి లభిస్తుంది. అలాగే పాలు, ఎండుద్రాక్ష రెండింటిలో అన్ని పోషకాలు ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా ఉంచడంలో బాగా సహాయపడతాయి. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో కొన్ని ఎండుద్రాక్షలను నానబెట్టండి. తర్వాత రోజు వాటిని తినడం వల్ల అనారోగ్య సమస్యలన్నీ కూడా పరార్ అవుతాయి. పాలలో నానబెట్టిన ఎండు ద్రాక్షను తినడం వల్ల తొందరగా బరువు పెరుగుతారు. అలాగే నీరసం, అలసట వంటి సమస్యల నుంచి కూడా వెంటనే విముక్తి పొందుతారు.

    ఇవే కాకుండా బాదం గింజలను కూడా రాత్రి నానబెట్టి తినాలి. ఇలా తినడం వల్ల శరీరానికి తక్షణమే బలం వస్తుంది. అలాగే ఇందులోని పోషకాలు ఎముకలకు మేలు చేయడంతో పాటు చర్మ ఆరోగ్యాన్ని కూడా సంరక్షిస్తాయి. మెదడు పనితీరు కూడా మెరుగుపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. తెలివితేటలు పెరుగుతాయని కూడా అంటున్నారు. వీటితో పాటు ఖర్జూరం కూడా పాలలో నానబెట్టి తినాలి. ఇందులోని పోషకాలు శరీరానికి తక్షణమే శక్తిని ఇస్తాయి. ప్రొటీన్లు, కాల్షియం కూడా ఎక్కువగా ఉండటం వల్ల ఇందులోని ఎముకలు బలంగా మారుతాయి. రోజూ ఉదయం లేదా సాయంత్రం రెండు నుంచి మూడు ఖర్జూరాలను తినడం వల్ల నీరసం ఉండదు. బరువు తక్కువగా ఉంటే వెంటనే పెరుగుతారు.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.