Health Benefits: శనగల్లో చాలా రకాలు ఉన్నాయి. వీటిని డైలీ ఏదో ఒక సమయంలో తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. అయితే చాలా మంది టైమ్ పాస్‌కి కాల్చిన శనగలను ఎక్కువగా తింటుంటారు. నిజం చెప్పాలంటే వారికి ఆ కాల్చిన శనగల వల్ల ప్రయోజనాలు ఉంటాయని అసలు తెలీదు. కానీ ఏదో నిద్ర వస్తుందని, టైమ్ పాస్‌కి తింటుంటారు. ఈ కాల్చిన శనగల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వీటిని డైలీ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులోని ఫైబర్ జీవక్రియ రేటును పెంచడంతో పాటు జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. ఇందులో ప్రొటీన్లు, కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి అధిక కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో బాగా ఉపయోగపడతాయి. బరువు తగ్గాలని ప్లాన్ చేస్తున్న వారు ఈ కాల్చిన శనగలను తినడం వల్ల ఈజీగా తగ్గుతారు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆరోగ్యంగా బరువు తగ్గుతారు. అలాగే కొందరు మలబద్ధకం సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి వారికి ఈ శనగలు బాగా ఉపయోగపడతాయి. వీటిని తినడం వల్ల జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుంది. దీంతో ఈ సమస్య నుంచి విముక్తి కలిగిస్తుంది. అయితే కొందరు ఈ కాల్చిన శనగలను తొక్కలు తీసి తింటారు. ఇలా తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఆ తొక్కలతోనే తినడం వల్ల శరీరానికి ఎక్కువ మొత్తంలో పోషకాలు అందుతాయి.
మధుమేహంతో బాధపడుతున్నవారికి కూడా కాల్చిన శనగలు బాగా ఉపయోగపడతాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ప్రొటీన్స్, కార్బోహైడ్రేట్స్, తేమ, కాల్షియం, ఫైబర్, ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలు ఆరోగ్యంగా ఉండటానికి బాగా సహాయపడతాయి. కొందరు ఎక్కువగా కడుపు సంబంధిత సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటి వారు రోజూ ఈ శనగలను తినడం వల్ల గ్యాస్ట్రిక్, అజీర్ణం, కడుపు నొప్పి, ఉబ్బరం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఈ కాల్చిన శనగల్లో మోనోశాచురేటెడ్, పాలీ అన్‌సాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇవి రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఈ కాల్చిన శనగలలో ఫైబర్, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తపోటును తగ్గించడంలో బాగా సహాయపడతాయి. దీంతో గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. డైలీ కనీసం గుప్పెడు శనగలను తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు. ఈ శనగల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని ఉదయం పూట తినడం వల్ల రోజంతా ఎలాంటి నీరసం లేకుండా యాక్టివ్‌గా ఉంటారు. కొందరు ఉదయం లేచినప్పటి నుంచి నీరసంగా ఉంటారు. అలాంటి వారు ఉదయం పూట వీటిని తినడం వల్ల ఎనర్జీటిక్‌గా ఉంటారు. తప్పకుండా వీటిని తినడం డైలీ డైట్‌లో యాడ్ చేసుకోవడం మంచిది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.