Health Benefits: తినేటప్పుడు కొందరికి అన్నం, కూర, పప్పు, పచ్చడి ఇలా ఎన్ని ఉన్నా కూడా అప్పడం కూడా తప్పనిసరిగా ఉండాలి. కొందరు అయితే ఇవేవి లేకపోయిన ఒక్క అప్పడం ఉంటే చాలు భోజనం చేసేస్తారు. తప్పనిసరిగా అన్ని ఉండాలని అనుకోరు. ముఖ్యంగా సంబార్, పప్పు చేసినప్పుడు అయితే కూర కంటే అప్పడాలకే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అయితే పూర్వం రోజుల్లో ఎక్కువగా అప్పడాలు చేసుకునేవారు. పొరపాటున కూరలు లేకపోతే అప్పడాలతో తినేయవచ్చని భావించి చేసేవారు. కానీ ఈ రోజుల్లో కొనుక్కుని కూడా తినరు. అప్పటి వాళ్లు బలంగా ఉండటానికి ఇలాంటి వంటలు కూడా ఓ కారణమని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం అప్పడాల తయారీలో కూడా రసాయనాలు కలపడం వల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు ఉండవు. అదే ఇంట్లో తయారు చేసిన అప్పడాలు తింటే ఆరోగ్యానికి బోలెడన్నీ ప్రయోజనాలు ఉన్నాయి. ఈ అప్పడాల్లో చాలా రకాలు ఉన్నాయి. మినప పిండి, సగ్గుబియ్యం రకరకాలతో అప్పడాలు చేస్తారు. ఎక్కువ మంది వీటిని టేస్ట్ కోసం తింటారు. కానీ వీటిని డైలీ తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. మరి అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మినప పిండితో చేసే అప్పడాలు తినడం వల్ల ఆకలి పెరుగుతుందట. అలాగే ఏమీ తినలేనప్పుడు అప్పడాలు తింటే ఫుడ్ ఇంకా తినాలనిపిస్తుంది. కొందరికి జ్వరం వస్తే కనీసం ఏం తినరు. నోరు చేదుగా ఉందని, ఆకలి లేదని అంటుంటారు. ఇలాంటి వాళ్లు మీకు నచ్చిన విధంగా అప్పడాలు తింటే తినాలని ఇంట్రెస్ట్ పెరుగుతుంది. భోజనం చేసిన తర్వాత అప్పడాలు తినడం వల్ల నోరు, గొంతులో ఉండే కొవ్వు తగ్గుతుందట. ఎందుకంటే అప్పడాల్లో పెసరపప్పు, నువ్వులు, ఇంగువ, వాము ఉండటం వల్ల ఇవి కొవ్వును తగ్గిస్తాయి. అలాగే అప్పడాలు జీర్ణం చేయడంలో ముఖ్య పాత్ర వహిస్తాయి. ఎక్కువగా మసాలాలు ఉన్న వంటలు, బిర్యానీలు తిన్న తర్వాత అప్పడాలను తింటే తినే ఫుడ్ తొందరగా జీర్ణం అవుతుంది. అలాగే చర్మ వ్యాధులు రాకుండా చేయడంతో పాటు కంటి సమస్యలను తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది.
అప్పడాలు ఆరోగ్యానికి ప్రయోజనాలను ఇస్తుంది. కానీ కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు అసలు అప్పడాలను తినకూడదు. ముఖ్యంగా రక్తపోటు అధికంగా ఉన్నవారు తక్కువగా తినాలి. అవసరమైతే వీటికి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇందులో సోడియం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల రక్తపోటు ఇంకా పెరిగే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే ఇందులోని సోడియం వల్ల ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ వంటివి వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. అయితే చాలా మంది అప్పడాలను నూనెలో వేయించి తింటారు. కానీ అప్పడాలను కాల్చి తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు అందుతాయని నిపుణులు అంటున్నారు. నూనెలో అప్పడాలను వేయించడం వల్ల అందులోని పోషకాలు తగ్గిపోతాయి. ఇలా వేపిన అప్పడాలను తింటే వాటి ప్రయోజనాలు మీ శరీరానికి అందవు. కాబట్టి అప్పడాలను కాల్చి తినడం ఆరోగ్యానికి మేలు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.