Health Benefits: ఈ గింజల లడ్డూ తింటే.. దీర్ఘకాలిక సమస్యలన్నీ మటుమాయం

ప్రమాదకరమైన వ్యాధుల నుంచి విముక్తి చెందాలంటే ఈ గుమ్మడి గింజలు బాగా ఉపయోగపడతాయి. అయితే ఈ గింజలను డైరెక్ట్‌గా తినలేని వారు వీటితో లడ్డూ కూడా తయారు చేసుకోవచ్చు.

Written By: Kusuma Aggunna, Updated On : November 10, 2024 4:24 pm

seeds laddu

Follow us on

Health Benefits: ఆరోగ్యంగా ఉండాలని చాలా మంది డ్రైఫ్రూట్స్ తింటారు. వీటిని డైలీ తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడరని భావిస్తారు. అయితే ఈ డ్రైఫ్రూట్స్‌లో గుమ్మడి గింజలు ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలను చేకూరుస్తుంది. గుమ్మడి కాయ నుంచి వచ్చే ఈ గింజల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి దీర్ఘకాలికంగా ఉన్న అన్ని అనారోగ్య సమస్యలను నయం చేస్తాయి. ఇందులో విటమిన్లు, పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని ఇవ్వడంతో కండరాలు, జుట్టు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. అయితే వీటిని తినడానికి కొందరు ఇష్టపెట్టుకోరు. ఎందుకంటే వీటి టేస్ట్ వేరేగా ఉందని, పెద్దగా తినరు. కానీ వీటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం శరీరానికి అందాలని భావిస్తారు. రోజూ గుప్పెడు గుమ్మడి గింజలను తినడం వల్ల రక్తపోటు సమస్య తగ్గడంతో పాటు గుండె సంబంధిత సమస్యలు అన్ని తగ్గుతాయి. అలాగే జ్ఞాపకశక్తిని పెంచడంతో పాటు మానసిక స్థితిని కూడా మెరుగుపరుస్తాయి. ఇందులో జింక్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి బాగా ఉపయోగపడతాయి. ఈ గుమ్మడి గింజల్లో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. ఇవి మలబద్ధకాన్ని నివారించడంలో బాగా సాయపడతాయి. ఈ రోజుల్లో చాలా మంది పురుషులు ప్రొస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఇలాంటి ప్రమాదకరమైన వ్యాధుల నుంచి విముక్తి చెందాలంటే ఈ గుమ్మడి గింజలు బాగా ఉపయోగపడతాయి. అయితే ఈ గింజలను డైరెక్ట్‌గా తినలేని వారు వీటితో లడ్డూ కూడా తయారు చేసుకోవచ్చు.

గుమ్మడి లడ్డూ తయారు చేయడం ఎలా అంటే?

గుమ్మడి లడ్డూ తయారు చేయాలంటే ముందుగా గింజలను బాగా రోస్ట్ చేసుకోవాలి. కాస్త చల్లారిన తర్వాత వీటిని పౌడర్‌గా తయారు చేసుకోవాలి. ఇందులో కాస్త షుగర్, నెయ్యి వేసి లడ్డూలా చుట్టుకోవాలి. పంచదార వద్దు అనుకునే వారు బెల్లం కూడా ఇందులో వేసుకోవచ్చు. ఈ లడ్డూలు కనీసం పది రోజుల పాటు నిల్వ ఉంటాయి. అయితే వీటిని ఏదో ఒక సమయంలో రోజూ తినడం వల్ల దీర్ఘాకాలిక సమస్యలన్నీ తగ్గిపోతాయి. అలాగే జుట్టు, చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటాయి. కండరాలు బలంగా పెరిగి బరువు కూడా పెరుగుతారు. అయితే ఈ గుమ్మడి గింజలతో లడ్డూ అనే కాకుండా ప్రొటీన్ పౌడర్ లేదా వీటిని రాత్రి పూట నానెబట్టి ఉదయాన్నే తిన్నా కూడా శరీరానికి ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. ఏదో విధంగా వీటిని బాడీలోకి చేర్చడం వల్ల నిద్రలేమి సమస్య నుంచి తొందరగా విముక్తి చెందుతారు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో బాగా సాయపడతాయి. ఆరోగ్యానికి మేలు చేసే కొవ్వులు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఇందులోని పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. సీజనల్‌గా వచ్చే వ్యాధుల బారి నుంచి ఈ గింజలు కాపాడుతాయి. ఇవి ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.

 

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. సూచనల కోసం వైద్య నిపుణులను సంప్రదించడం మేలు.