Health Benefits: దుంపలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇందులోని పోషకాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి బాగా సహాయపడతాయి. అయితే దుంపలు తినడం వల్ల కాళ్లు నొప్పులు వస్తాయని కొందరు తినరు. ముఖ్యంగా బంగాళదుంపలు అయితే చాలా మంది తినడానికి ఇష్టపెట్టుకోరు. దుంపల్లో చాలా రకాలు ఉన్నాయి. అందులో చిలగడ దుంప చాలా ముఖ్యమైనది. ఇందులోని పోషకాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి బాగా సహాయపడతాయి. వీటిని ఊడికించి లేదా కాల్చి తినడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి విముక్తి చెందవచ్చు. ముఖ్యంగా చలికాలంలో చిలగడ దుంప ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఈ దుంపను కాల్చి తినడం వల్ల జలుబు, దగ్గు సమస్యలతో పాటు కీళ్ల సమస్యల నుంచి కూడా విముక్తి పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని పోషకాలు రక్తపోటను కూడా అదుపులో ఉంచుతాయి. దీంతో గుండె పోటు వచ్చే సమస్యలు కూడా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో మెగ్నీషియం, కాల్షియం, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ వంటి సమస్యలను కూడా తగ్గించడంలో ముఖ్యపాత్ర వహిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం
చిలగడ దుంపల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కీళ్ల నొప్పులు సమస్యల నుంచి విముక్తి కలిగేలా చేస్తాయి. అలాగే ఇందులోని పోషకాలు కండరాలు, ఎముకలు ఆరోగ్యంగా ఉండేలా చేయడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. అయితే డయాబెటిక్ రోగులు అయితే వీటిని తినే ముందు వైద్యుడిని సంప్రదించాలి. ఎందుకంటే ఇందులోని తీపి వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఈజీగా పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.
పేగు ఆరోగ్యానికి మేలు చేస్తుంది
చిలగడదుంపలో ఉండే పోషకాల వల్ల పేగు ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే ఇవి బరువును నియంత్రణలో ఉంచడంలో మేలు చేస్తాయి. వీటిని రోజూ తినడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే జీర్ణ సమస్యలు, అసిడిటీ, కడుపు సంబంధిత సమస్యలు అన్నింటి నుంచి కూడా విముక్తి కలిగేలా చేస్తుంది.
కంటి చూపు పెరుగుదల
చిలగడ దుంపలు తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. ఇందులోని పోషకాలు కంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది. ఈ రోజుల్లో చాలా మంది మొబైల్, ల్యాప్‌టాప్ వంటివి ఎక్కువగా చూస్తున్నారు. వీటిని చూడటం వల్ల కంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారు డైలీ చిలగడ దుంపలను డైట్‌లో చేర్చుకుంటే కళ్లతో పాటు శారీరకంగా కూడా ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.
ఒత్తిడి నుంచి విముక్తి
చిలగడ దుంపలను డైలీ తినడం వల్ల ఒత్తిడి నుంచి విముక్తి పొందుతారని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని పోషకాలు ఆందోళనను తగ్గిస్తాయి. కొందరు చిన్న విషయాలకు ఎక్కువగా ఆందోళన చెందుతారు. అలాంటి వారు చిలగడ దుంపలను కాల్చి తినడం వల్ల తొందరగా సమస్య నుంచి బయటపడతారని నిపుణులు చెబుతున్నారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.