Health Benefits: వంట్లింట్లో ఉండే మసాలా దినుసులతో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వంటల్లో మసాలాకు వాడే మిరియాలను ఎక్కువగా వాడరు. జలుబు చేసినప్పుడు పాలలో కలిపి తాగడానికి కొన్నిసార్లు టీలో వేస్తుంటారు. ఘాటుగా ఉండే ఈ మిరియాలను తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలోని పోషకాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ఉపయోగపడతాయి. కేవలం జలుబు చేసినప్పుడే కాకుండా అప్పుడప్పుడు కూడా మిరియాలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ మిరియాల్లో నెయ్యిని కలిపి తినడం వల్ల అనారోగ్య సమస్యలు దరిచేరవని నిపుణులు అంటున్నారు. నెయ్యిలోని పోషకాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి బాగా సహాయపడతాయి. మిరియాలు, నెయ్యి కలిపి డైలీ తినడం వల్ల అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందుతారని నిపుణులు చెబుతున్నారు. ఎన్నో శతాబ్దాల నుంచి దీన్ని సూపర్ ఫుడ్‌గా భావిస్తారు. ఈ రెండింటిలోని కెరోటిన్, విటమిన్ ఎ, సి, ఫ్లేవనాయిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యానికి ప్రయోజనాలను చేకూరుస్తాయి. మరి ఆ ప్రయోజనాలేంటో ఈ తెలుసుకోవాలంటే ఈ స్టోరీలో చూద్దాం.
కంటి ఆరోగ్యం
నెయ్యి, మిరియాలు కలుపుకుని తినడం వల్ల కళ్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ రెండింటిలో విటమిన్ ఎ, డి, ఇ, కె పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి సమస్యలు రాకుండా కాపాడుతుందని నిపుణులు అంటున్నారు. రోజూ కూడా టేబుల్ స్పూన్ నెయ్యిలో మిరియాలు వేసుకుని తింటే కంటి చూపు మెరుగుపడుతుంది.
జలుబు, దగ్గు నుంచి విముక్తి
రోజూ ఉదయం పూట ఇలా తినడం వల్ల దగ్గు, జలుబు, ఉబ్బసం, ఛాతీ నొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి. దీర్ఘకాలికంగా దగ్గుతో బాధపడుతున్నట్లయితే నల్ల మిరియాలు, నెయ్యిని కలిపి తింటే వెంటనే సమస్య తగ్గిపోతుందని నిపుణులు అంటున్నారు. సాధారణంగా మిరియాలను పౌడర్ చేసి పాలలో వేసుకుని తాగినా కూడా మంచి దగ్గు, జలుబు తగ్గుతాయి. రోగనిరోధక శక్తి మెరుగుపడి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడుతుంది.
జీర్ణక్రియ ఆరోగ్యం
నల్ల మిరియాలు, నెయ్యి తీసుకోవడం వల్ల జీర్ణక్రియ ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు అంటున్నారు. జీర్ణ, కడుపు సంబంధిత సమస్యలు, ఉబ్బరం, గ్యాస్, ఎసిడిటీ వంటివి సమస్యలు కూడా తగ్గుతాయి. కొందరికి తినే ఫుడ్ జీర్ణం కాక మలబద్ధకం తో కూడా ఇబ్బంది పడుతుంటారు. అలాంటివారికి ఈ మిరియాలు, నెయ్యి బెస్ట్ అని చెప్పవచ్చు.
ఎలా తినాలంటే?
ఒక టేబుల్ స్పూన్ నెయ్యిలో నల్ల మిరియాలు వేసి బాగా కలపాలి. వీటిని ఉదయం ఖాళీ కడుపుతో తిని.. గ్లాసు వేడి నీరు తాగాలి. ఇలా దాదాపుగా నెల రోజుల పాటు చేయడం వల్ల అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందుతారని నిపుణులు చెబుతున్నారు. మీరు ఇలా తిన్న పది రోజుల నుంచే ఫలితాలను చూస్తారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.