Health Benefits: పల్లీలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇందులోని పోషకాలు శరీర ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. ముఖ్యంగా వీటిని వేయించి లేదా చట్నీ చేసి తింటుంటారు. ఇవే కాకుండా ఉడికించి తినడం, రకరకాలుగా చేయడం వంటివి చేస్తుంటారు. ఇందులోని పోషకాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి బాగా సాయపడుతుంది. కొందరు చాలా సన్నగా ఉంటారు. అలాంటి వారు డైలీ వీటిని తినడం వల్ల ఈజీగా బరువు కూడా పెరుగుతారు. అయితే ఇవి ఆరోగ్యానికి ఎంత మేలు చేసిన కూడా.. వీటిని తిన్న తర్వాత కొన్ని పదార్థాలను తీసుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పొరపాటున అయిన కూడా వేరుశనగ తిన్న తర్వాత వేరే ఇతర పదార్థాలు తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఆ సమస్యలేంటో ఈ స్టోరీలో చూద్దాం.
నీరు
సాధారణంగా ఏ పదార్థం తిన్న తర్వాత అయిన కూడా నీరు తాగుతారు. అయితే వేరుశనగ తిన్న తర్వాత నీరు తాగడం చాలా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తిన్న వెంటనే నీరు తాగితే.. వాటికి జీర్ణ సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేరుశనగ తిన్న 30 నిమిషాల వరకు నీరు తాగకూడదని నిపుణులు చెబుతున్నారు.
చిక్కుళ్లు
వేరుశనగలు తిన్న వెంటనే చిక్కుళ్లు అసలు తినకూడదు. వీటిని తినడం వలల్ అలర్జీ సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతుంటారు. వేరుశనగ తిన్న రెండు నుంచి మూడు గంటల తర్వాత మాత్రమే చిక్కుళ్లు తినాలని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా చిక్కుళ్లు ఆరోగ్యానికి మంచివే. ఇందులోని పోషకాలు, ఫైబర్ శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి బాగా సాయపడతాయి. డైలీ వీటిని తినడం ఆరోగ్యానికి మంచివే. కానీ వేరుశనగ తిన్న తర్వాత తినడం మాత్రం ఆరోగ్యానికి మంచివి కావని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా తినవద్దు.
నువ్వులు
వేరుశనగలు తిన్న తర్వాత నువ్వులతో చేసిన పదార్థాలు తీసుకోకూడదని నిపుణులు అంటున్నారు. ఈ రెండు కలవడం వల్ల శరీరంలో అలర్జీ సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా నువ్వులు ఆరోగ్యానికి మంచివే. వేరుశనగ కూడా ఆరోగ్యానికి కూడా మంచిదే. కాబట్టి వీటిని వేర్వేరుగా తీసుకోవడం ఉత్తమం.
చాక్లెట్లు
వేరుశనగలు తిన్న తర్వాత చాక్లెట్లు తినడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. వేరుశనగ తిన్న గంట తర్వాత చాక్లెట్లు తినాలని నిపుణులు చెబుతున్నారు.
సిట్రస్ పండ్లు
వేరుశనగ తిన్న తర్వాత నిమ్మ, నారింజ, కివి, సిట్రస్ ద్రాక్ష వంటి సిట్రస్ పండ్లను అసలు తినకూడదని నిపుణులు చెబుతున్నారు. వీటివల్ల అలర్జీ సమస్యలు, గొంతునొప్పి, చికాకు, దగ్గు వంటివి వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.