https://oktelugu.com/

Health Benefits: రాత్రి 8గంటల్లోగా భోజనం చేస్తే.. ఇక ఆరోగ్యమే మీ సొంతం

ముఖ్యంగా రాత్రి 7 లేదా 8 గంటలకి డిన్నర్ పూర్తి చేసి 10 గంటలకు నిద్రపోవడం ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు అంటున్నారు. మరి రాత్రి తొందరగా భోజనం చేయడం వల్ల కలిగే లాభాలేంటో ఈ స్టోరీలో చూద్దాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 7, 2025 / 11:57 PM IST
    Follow us on

    Health Benefits: ప్రస్తుతం మారిన జీవనశైలి వల్ల చాలా మంది ఆలస్యంగా భోజనం చేస్తున్నారు. ఆలస్యంగా నిద్రపోవాలని రాత్రి 11 గంటల వరకు కూడా తినడం లేదు. దీనికి తోడు సోషల్ మీడియా రావడంతో ప్రతీ ఒక్కరూ కూడా రాత్రి భోజనం చేసే సరికి అర్థరాత్రి అవుతుంది. అయితే ఆలస్యంగా కంటే తొందరగా రాత్రి భోజనం చేయడం వల్ల బోలెడన్నీ ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

    ముఖ్యంగా రాత్రి 7 లేదా 8 గంటలకి డిన్నర్ పూర్తి చేసి 10 గంటలకు నిద్రపోవడం ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు అంటున్నారు. మరి రాత్రి తొందరగా భోజనం చేయడం వల్ల కలిగే లాభాలేంటో ఈ స్టోరీలో చూద్దాం.

    మెరుగైన జీర్ణక్రియ

    రాత్రి పూట తొందరగా భోజనం చేయడం వల్ల తిన్న ఫుడ్ జీర్ణం అవుతుంది. చాలా మంది నిద్రపోవడానికి ముందు భోజనం చేస్తారు. తిన్న వెంటనే పడుకోవడం వల్ల ఫుడ్ జీర్ణం కాదు. దీంతో జీర్ణ సమస్యలు వస్తాయి. అలాగే నిద్ర కూడా భంగం కలుగుతుంది. అదే తొందరగా తింటే మీరు నిద్రపోయే సమయానికి ఫుడ్ అంతా కూడా జీర్ణం అవుతుందని నిపుణులు అంటున్నారు. దీనివల్ల కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.

    మెరుగైన నిద్ర
    తిన్న వెంటనే నిద్రపోతే కడుపు నిండుగా ఉంటుంది. దీనివల్ల నిద్ర కూడా సరిగ్గా పట్టదు. అదే నిద్రపోవడానికి రెండు మూడు గంటల ముందు తినడం వల్ల నిద్రకు ఎలాంటి అంతరాయం ఏర్పడదు. మీరు 8 గంటల్లోగా తినడం వల్ల ఫుడ్ అంతా కూడా జీర్ణం అవుతుంది. దీంతో హ్యాపీగా నిద్రపోగలరు.

    బరువు నియంత్రణ
    రాత్రిపూట తొందరగా భోజనం చేయడం వల్ల మీ క్యాలరీలు బర్న్ అవుతాయి. అదే తిన్న వెంటనే బెడ్ ఎక్కితే క్యాలరీలు బర్న్ కావు. దీంతో బాడీలో కొలెస్ట్రాల్ పెరిగి ఎక్కువగా బరువు పెరుగుతారు. కొన్నిసార్లు ఇది ఊబకాయానికి కూడా దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి తొందరగా తినడం అలవాటు చేసుకోవడం ఉత్తమం.

    రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో
    రాత్రి భోజనం త్వరగా చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఎందుకంటే శరీరానికి విశ్రాంతి తీసుకునే ముందు కార్బోహైడ్రేట్‌లను ప్రాసెస్ చేయడానికి సమయం ఉంటుంది. దీంతో మీకు మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుంది.

    గుండె జబ్బులు
    రాత్రి తొందరగా తినడం వల్ల గుండె జబ్బుల సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. నిద్రకు రెండు నుంచి మూడు గంటల ముందు తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. దీంతో మీకు గుండె పోటు వచ్చే ప్రమాదాలు చాలా తక్కువగా ఉంటాయి. అలాగే ఒత్తిడి నుంచి కూడా విముక్తి కలుగుతుంది. రక్తపోటు ఎప్పుడూ కూడా అదుపులో ఉంటేనే ఆరోగ్యంగా ఉంటారు.

    మెరుగైన జీవక్రియ
    తొందరగా తినడం వల్ల సిర్కాడియన్ రిథమ్‌లు నియంత్రణలో ఉంటాయి. దీంతో జీవక్రియను ఆప్టిమైజ్ చేయడంలో ఇవి బాగా సహాయపడతాయి. జీవక్రియ ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. రాత్రిపూట భోజనం తర్వాత పడుకోవడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్ లక్షణాలు ఎక్కువ అవుతాయి. అదే ముందుగా చేస్తే ఇలాంటి సమస్యలు ఉండవు.

    హార్మోన్ల సమతుల్యత
    రాత్రి భోజనం తొందరగా చేయడం వల్ల ఆకలి, సంతృప్తి, ఒత్తిడి హోర్మోన్లు అదుపులో ఉంటాయి. అదే ఆలస్యంగా చేస్తే మానసిక ఒత్తిడిగా అనిపిస్తుంది.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.