https://oktelugu.com/

Health Benefits: ఈ ఆకు కూరను తినకపోతే.. బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు మిస్ చేసుకున్నట్లే!

మార్కెట్లో లభ్యమయ్యే మెంతి కూరను చాలా మంది తక్కువగా తింటారు. అసలు దీన్ని డైట్‌లో యాడ్ చేసుకోరు. మెంతికూరలో పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. వారానికి ఒకసారి అయిన మెంతికూర తినడం వల్ల శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో చూద్దాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 20, 2024 / 02:58 AM IST

    fenugreek leaves

    Follow us on

    Health Benefits: ఆకు కూరలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటిని డైలీ తినడం వల్ల సగం అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. ఇందులోని పోషకాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఈ ఆకు కూరల్లో ఫైబర్, పొటాషియం, కాల్షియం, ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, జింక్, విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఎలాంటి అనారోగ్య సమస్యలు దరి చేరనివ్వకుండా కాపాడతాయి. అయితే ఈ రోజుల్లో చాలా మంది పెద్దగా ఆకు కూరలు తినడం లేదు. బయట దొరికే ఫాస్ట్‌ఫుడ్ తినడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఆరోగ్యానికి మేలు చేసే ఫుడ్ కంటే అనారోగ్యానికి మేలు చేసే ఫుడ్‌ తింటున్నారు. దీనివల్ల దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. అయితే ఏ సీజన్‌లో అయిన మార్కెట్లో లభ్యమయ్యే మెంతి కూరను చాలా మంది తక్కువగా తింటారు. అసలు దీన్ని డైట్‌లో యాడ్ చేసుకోరు. మెంతికూరలో పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. వారానికి ఒకసారి అయిన మెంతికూర తినడం వల్ల శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో చూద్దాం.

    మెంతి కూర అనేది మార్కెట్లో ఈజీగా లభిస్తుంది. దీనిని పప్పు లేదా కూరలో వండుకుని తినడం వల్ల అందులోని ప్రయోజనాలు శరీరానికి అందుతాయి. మెంతి కూరలో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. దీనివల్ల కడుపు నిండినట్లుగా అనిపించడంతో పాటు మలబద్ధకం, జీర్ణ సమస్యలు, కడుపు ఉబ్బరం, కడుపులో మంట, అజీర్ణం వంటి సమస్యలు తగ్గుతాయి. ఈ మెంతి కూరను తినడం వల్ల ఆరోగ్యంగా బరువు కూడా తగ్గుతారు. ఈ మెంతి కూర మధుమేహం ఉన్నవారికి బాగా సాయపడుతుంది. ఇందులోని పోషకాలు టైప్ 2 డయాబెటిస్ నుంచి విముక్తి చేస్తుంది. అలాగే శరీరంలో ఉండే విష పదార్ధాలను బయటకు పంపించే విధంగా మెంతి కూర పనిచేస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని మెరుగుపరచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. చర్మంపై ముడతల రాకుండా యంగ్ లుక్‌లో ఉండేలా చేస్తుంది. ముఖ్యంగా మహిళలకు బాగా ఉపయోగపడుతుంది. పీరియడ్స్ నొప్పితో బాధపడుతున్న వారికి మంచి ఔషధం. మెంతి కూరను తినడం వల్ల నెలసరి నొప్పులు, కడుపు తిమ్మిరి వంటి సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది.

    ఇందులోని పోషక గుణాలు గుండె పోటు, రక్తపోటు వంటి సమస్యల నుంచి కూడా విముక్తి కలిగించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అయితే మార్కెట్లో ఆకు కూరల్లో రసాయనాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి అంత మంచివి కాదు. కాబట్టి ఈ మెంతి కూరను ఇంట్లోనే పెంచుకోండి. మెంతి గింజలను ఇంటి పెరట్లో నాటితే దాదాపుగా ఒక 20 రోజుల్లో మెంతి కూర అవుతుంది. వీటిని ఎక్కువగా తిన్నా కూడా ఆరోగ్యానికి మంచిదే. అయితే కేవలం మెంతి కూరనే కాకుండా మెంతి గింజలతో పౌడర్ చేసుకుని ఆ వాటర్ తాగిన కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. పక్షవాతం, కాలేయ ఆరోగ్యం, పిత్తాశయం వంటి సమస్యల నుంచి కూడా విముక్తి చెందుతారు. కనీసం వారానికి ఒకసారి అయిన తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.