https://oktelugu.com/

Health Benefits: డైలీ డైట్‌లో ఈ పండు చేర్చుకుంటే.. గుండె సమస్యలన్నింటికి చెక్

హిమాలయన్ రెడ్ బెర్రీ పండును రోజూ డైట్‌లో చేర్చుకోవడం వల్ల బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో మరి ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 1, 2024 6:18 pm
    Himalayan red berry

    Himalayan red berry

    Follow us on

    Health Benefits: మార్కెట్లో ఎన్నో రకాల పండ్లు రోజూ మనకి కనిపిస్తూనే ఉంటాయి. కానీ చాలామందికి కొన్ని రకాల పండ్లు గురించి మాత్రమే తెలుసు. పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని తెలుసు. రోజూ వీటిని డైట్‌లో చేర్చుకోవడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. అయితే మనకి తెలియని చాలా పండ్ల వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. కానీ వీటిని అంతగా ఎవరూ తినడానికి ఇష్టపెట్టుకోరు. అందరూ ఎక్కువగా యాపిల్, దానిమ్మ, ద్రాక్ష వంటి పండ్లను తినడానికే ఇష్టపడతారు. కానీ అరుదుగా దొరికే పండ్లను తినడానికి అంత ఇంట్రెస్ట్ చూపించరు. అయితే చాలామందికి హిమాలయన్ రెడ్ బెర్రీ గురించి పెద్దగా తెలియదు. దీనివల్ల శరీరానికి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో విటమిన్లు, మినరల్స్ అధిక మొత్తంలో ఉన్నాయి. ఇవి శరీర ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో బాగా ఉపయోగపడతాయి. అలాగే చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు బాడీ ఫిట్‌గా ఉండేలా కూడా చేయడంలో ప్రధానపాత్ర పోషిస్తుంది. ఈ పండును రోజూ డైట్‌లో చేర్చుకోవడం వల్ల బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో మరి ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

     

    ఉత్తరాఖండ్‌లోని కొండ ప్రాంతాల్లో ఈ హిమాలయన్ రెడ్ బెర్రీ ఎక్కువగా లభ్యమవుతుంది. ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలను చేకూరుస్తుంది. దీన్ని ఘిఘారు పండు అని కూడా అంటారు. యాపిల్ జాతికి చెందిన ఈ పండులో ఎన్నో పోషకాలు ఉన్నాయి. అలాగే ఇందులోని పోషక గుణాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో బాగా ఉపయోగపడతాయి. ఈ పండును డైలీ తినడం వల్ల గుండె సమస్యల నుంచి విముక్తి పొందుతారు. ఇందులోని ఔషధ గుణాలు గుండె ప్రమాదాలు రాకుండా చేయడంలో సాయపడుతుంది. అలాగే అధిక రక్తపోటుతో ఇబ్బంది పడుతున్నవారు ఈ పండును తింటే సమస్యలన్నీ మాయం అయిపోతాయి. ఈ పండును డైలీ తినడం వల్ల మధుమేహం కూడా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ పండును నేరుగా తిన్నా ఆరోగ్యానికి మంచిదే. లేకపోతే పొడి రూపంలో అయిన కూడా తీసుకోవచ్చని నిపుణులు అంటున్నారు.

     

    ఈ పండు ఎక్కువగా హిమాలయన్ అడవుల్లో దొరకడంతో దీన్ని హిమాలయాన్ ఫిగ్ లేదా కొండ అత్తి పండ్లు అని కూడా అంటారు. కొండ ప్రాంతాల్లో దొరికే ఈ పండు అనేక అనారోగ్య సమస్యలను నయం చేస్తుంది. ఇది చూడటానికి యాపిల్‌లా ఉంటుంది. కేవలం ఈ పండు మాత్రమే కాకుండా దీని ఆకులు, పువ్వులు కూడా ఆరోగ్య ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది. అయితే ఈ పండు కేవలం సీజన్‌లో మాత్రమే దొరుకుతుంది. ఆ సమయాల్లోనే కొని తినడం బెటర్. ఎందుకంటే కొన్ని పండ్లు సీజనల్‌గా దొరికిన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. దీనివల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఈ పండు తినడం అలవాటు చేసుకోవడం ఉత్తమం.

     

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.