Health Benefits: ప్రస్తుతం అందరూ కూడా ప్రాసెస్ట్ ఫుడ్‌కి ఇష్టపడుతున్నారు. సాయంత్రం అయితే చాలు బయటకు వెళ్లి అక్కడ దొరికే మసాలా ఫుడ్స్‌ను ఎక్కువగా తింటున్నారు. ఈ కాలం మనుషులకు పెద్దగా ఆరోగ్యమైన ఫుడ్స్ గురించి తెలియదు. పూర్వం సాయంత్రం స్నాక్స్ అంటే వేరుశెనగలు, వేయించిన శనగలు ఇలా ఎన్నో గుర్తు వస్తాయి. వీటినే ఎక్కువగా తినేవారు. అయితే వీటిని టైమ్‌పాస్‌కి అయిన కూడా తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి ఎక్కువగా జాతరలో కనిపిస్తాయి. వీటిని రోజూ తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా దరిచేరవు. ఇందులోని పోషకాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఈ కాల్చిన శనగల్లో ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, ఫోలేట్, మినరల్స్, ఫ్యాటీ యాసిడ్‌ల ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని కలిగిస్తాయి. వీటిని అందరూ తినవచ్చు. మధుమేహం ఉన్నవారు కూడా వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ కాల్చిన శనగలు తినడం వల్ల కలిగే ఆ ప్రయోజనాలేంటో ఈ స్టోరీలో చూద్దాం.
కాల్చిన శనగలను తినడం రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇందులోని ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇవి జీర్ణ సమస్యలను తగ్గించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. కొందరు మలబద్ధకం, అజీర్ణం, కడుపు సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడతారు. అలాంటి వారికి కాల్చిన శనగలు బాగా సహాయపడతాయని నిపుణులు అంటున్నారు. అలాగే కాల్చిన శనగలు తినడం వల్ల బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. వీటిని స్నాక్స్‌లా తింటే ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా దరిచేరవు. వీటితో పాటు ఎముకలు ఆరోగ్యంగా ఉండటంతో రక్తపోటు అదుపులో ఉంటుంది. అలాగే జీర్ణక్రియ కూడా ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు బాడీలో కొలెస్ట్రాల్ పెరగకుండా ఉంటుంది. కాల్చిన శనగల్లో కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల బోలు ఎముకల వ్యాధి నుంచి కూడా విముక్తి పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. కాల్చిన శనగల్లోని ఐరన్, కాల్షియం, ఫాస్ఫేట్, మెగ్నీషియం, జింక్, మాంగనీస్ శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తుంది.
జీర్ణ వ్యవస్థలో కొందరికి సమస్యలు ఉంటాయి. ఇలాంటి వారు డైలీ కాల్చిన శనగలను తినడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇందులోని గట్ బాక్టీరియా వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. అలాగే కాలేయ ఆరోగ్యం, వాపు వంటి సమస్యలు కూడా క్లియర్ అవుతాయని నిపుణులు చెబుతున్నారు. అతిసారం, ఉబ్బరం, గ్యాస్ట్రిక్ సమస్యలు, అధిక యూరిక్ యాసిడ్, మూత్రపిండాల్లో రాళ్లు, తీవ్రమైన అలెర్జీ సమస్యలతో బాధపడుతుంటే మాత్రం తప్పకుండా కూడా కాల్చిన శనగలను రోజూ తినడం అలవాటు చేసుకోండి. వీటివల్ల మీరు అనేక సమస్యల నుంచి విముక్తి చెందుతారని నిపుణులు అంటున్నారు. ఏదైనా చిరు తిండి తినాలనిపిస్తే వీటినే ఎంపిక చేసుకోవడం బెటర్ అని నిపుణులు అంటున్నారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.