Health Benefits: నీరు అనేది ఈ ప్రపంచంలో ఉన్న ప్రతీ జీవికి ముఖ్యమే. నీరు లేకపోతే మనిషి అసలు జీవించలేడు. డైలీ నీరు తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. నీరు తాగడం వల్ల బాడీ హైడ్రేట్ కాకుండా ఉంటుంది. అయితే చాలా మంది దాహం వేసినప్పుడు నీరు తాగుతుంటారు. మరికొందరు ఆరోగ్యానికి మంచిదని తాగుతుంటారు. అయితే సాధారణంగా నీరు ఎక్కువ మంది నిలబడి తాగుతారు. భోజనం చేసే సమయంలో మాత్రమే కూర్చోని తాగుతారు. కానీ రోజులో ఎక్కువ శాతం నిలబడి మాత్రమే తాగుతుంటారు. అయితే నిలబడి నీళ్లు తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నీళ్లు నిలబడి తాగడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుందని నిపుణులు అంటున్నారు. అసలు నిలబడి తాగడం వల్ల వచ్చే సమస్యలు ఏంటి? దీని నుంచి విముక్తి చెందడం ఎలాగో మరి ఈ స్టోరీలో తెలుసుకుందాం.
నీరు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అయితే నీరు కూర్చోని మాత్రమే తాగాలిని నిపుణులు సూచిస్తున్నారు. చాలా మంది నిలబడి నీరు తాగుతుంటారు. ఇలా తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుందని నిపుణులు అంటున్నారు. నిలబడి నీళ్లు తాగడం వల్ల ఎసిడిటీ, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే కిడ్నీ సమస్యలు కూడా వస్తాయని నిపుణులు అంటున్నారు. కాబట్టి నీళ్లు ఎప్పుడూ కూడా నిల్చోని తాగవద్దు. కూర్చోని మాత్రమే నీళ్లు తాగడం అలవాటు చేసుకోండి. ఇలా తాగడం వల్లే ఆరోగ్యానికి ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. నిలబడి నీళ్లు తాగడం వల్ల శరీరంలో ఆమ్లాలు ఉత్పత్తి అవుతాయి. ఇవి ఆరోగ్యానికి అంత మంచివి కావు. వీటి వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడతారు. కాబట్టి ఎప్పుడూ కూడా నిలబడి కాకుండా కూర్చోని మాత్రమే నీళ్లు తాగడం అలవాటు చేసుకోండి.
బాడీ హైడ్రేట్‌గా, ఆరోగ్యంగా ఉండాలంటే వాటర్ ఎక్కువగా తాగాలి. నీరు తాగడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. నీరు తాగడం వల్ల చర్మం కూడా కాంతివంతంగా ఉంటుంది. రోజుకి కనీసం 4 లీటర్లు నీరు అయిన తీసుకోవాలి. అప్పుడే ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటారు. బాడీకి సరిపడా నీరు తాగకపోతే మలబద్ధకం, కిడ్నీలు రాళ్లు వంటివి ఏర్పడుతాయి. అలాగే జుట్టు కూడా అధికంగా రాలిపోతుంది. వీటితో ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులు వంటి సమస్యల బారిన కూడా పడుతుంటారు. దీర్ఘకాలికంగా ఉన్న సమస్యల బారి నుంచి విముక్తి చెందాలంటే నీరు తప్పకుండా తాగాలి. డైలీ నీరు తాగడం వల్ల బాడీ డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది. బాడీ ఒకవేళ డీహైడ్రేట్ అయిపోతే మాత్రం కొన్ని ప్రమాదకర వ్యాధుల బారిన పడక తప్పదు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.