https://oktelugu.com/

Health Benefits: చలికాలంలో ఈ లడ్డూలు తినడం మరిచిపోవద్దు.. ఆరోగ్యానికి బలం ఇవే!

ప్రస్తుతం ఉన్నవారు అయితే కనీసం 50 ఏళ్లు కూడా జీవించలేకపోతున్నారు. అయితే చలికాలంలో కొన్ని రకాల ఆహార పదార్థాలను తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు శరీరానికి శక్తి లభిస్తుంది. ఎలాంటి అనారోగ్య సమస్యలు దరి చేరకుండా ఆరోగ్యంగా ఉంటారు. ఈ కాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని పదార్థాలతో తయారు చేసిన లడ్డూలు తినాలని నిపుణులు సూచిస్తున్నారు. మరి ఆ లడ్డూలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 1, 2025 / 01:19 AM IST

    winter season

    Follow us on

    Health Benefits: చలికాలంలో రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. దీంతో తొందరగా జలుబు, దగ్గు వస్తాయి. శీతాకాలంలో వాతావరణంలో మార్పులు రావడం వల్ల ఎక్కువగా అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా జలుబు, దగ్గుతోపాటు నీరసం, అలసట, ఎక్కువ చలి వేయడం జరుగుతుంది. చలి కాలంలో శరీరం వెచ్చగా ఉండాలంటే కేవలం స్వెటర్లు మాత్రమే ధరించకుండా ఫుడ్ కూడా సరైనది తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. చలికాలంలో పోషకాలు ఉండే కొన్ని రకాలు పదార్థాలు తీసుకోవాలి. భారతీయులు పూర్వం కాలంలో కొన్ని రకాల లడ్డూలను తయారు చేసుకుని తినేవారు. అందుకేనేమో పూర్వ కాలం మనుషులు ఇప్పటికీ కూడా ఆరోగ్యంగా జీవిస్తున్నారు. ప్రస్తుతం ఉన్నవారు అయితే కనీసం 50 ఏళ్లు కూడా జీవించలేకపోతున్నారు. అయితే చలికాలంలో కొన్ని రకాల ఆహార పదార్థాలను తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు శరీరానికి శక్తి లభిస్తుంది. ఎలాంటి అనారోగ్య సమస్యలు దరి చేరకుండా ఆరోగ్యంగా ఉంటారు. ఈ కాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని పదార్థాలతో తయారు చేసిన లడ్డూలు తినాలని నిపుణులు సూచిస్తున్నారు. మరి ఆ లడ్డూలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

    నెయ్యిల లడ్డు(మరమరాలు)
    నెయ్యిలు గురించి అందరికీ తెలిసిందే. వీటిని బెల్లం లేదా పంచదారతో కలిపి లడ్డూలు చేయాలి. వీటిని డైలీ తింటే శరీరానికి బలం చేకూరుతుంది. ఇందులోని యాంటీ బ్యాక్టీరియాల్ లక్షణాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. అలాగే రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. జలుబు, దగ్గు, కీళ్ల సమస్యలు, నీరసం, అలసట వంటివి రాకుండా ఉంటాయి. పంచదార కంటే నెయ్యిలతో చేసిన లడ్డూ తినడం వల్ల ఆరోగ్యానికి బోలెడన్నీ ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

    నువ్వులతో చేసిన లడ్డు
    నువ్వులు ఆరోగ్యానికి చాలా మంచివి. ఇందులోని పోషకాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. బెల్లం పాకం తీసి నువ్వులతో లడ్డు చేసుకుని తింటే పోషకాలు అందుతాయి. ఇందులో ఐరన్, ప్రొటీన్, విటమిన్ బి, విటమిన్ ఇ వంటివి ఉన్నాయి. ఇవి రక్తప్రసరణను కూడా మెరుగుపరుస్తాయి. అలాగే శరీరాన్ని వెచ్చగా చేయడంతో పాటు ఒత్తిడిని తగ్గిస్తాయి.

    మెంతి లడ్డు
    మెంతి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. మెంతులు లేదా మెంతికూరతో లడ్డు చేసుకుని చలికాలంలో తింటే అనారోగ్య సమస్యలన్నీ పరార్. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు ఫ్లూ, జలుబు వంటి సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది. మెంతి పౌడర్‌తో బెల్లం, నెయ్యి కలిపి చేసుకోవచ్చు. పౌడర్ చేయకుండా కూడా మెంతి లడ్డును తయారు చేసుకుంటే.. శరీరం వెచ్చగా ఉంటుంది. అలాగే కీళ్ల నొప్పుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.

    నట్స్ లడ్డులు
    ఖర్జూరం, గుమ్మడి గింజలు, పుచ్చకాయ గింజలు, బాదం, జీడిపప్పు, అంజీర్ ఇలా అన్ని డ్రైఫ్రూట్స్ కలిపి లడ్డులు తయారు చేసుకోవాలి. వీటిని డైలీ తినడం వల్ల మధుమేహం, కొలెస్ట్రాల్ వంటి సమస్యల నుంచి విముక్తి చెందుతారు. శరీరానికి తక్షణమే శక్తి కూడా లభిస్తుంది. ఇందులోని పోషకాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. తప్పకుండా డైలీ ఒకటి అయి ఈ లడ్డు తినడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.