https://oktelugu.com/

Health Benefits: బ్రెజిలియన్ నట్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో మీకు తెలుసా?

బ్రెజిలియన్ నట్ లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని డైలీ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మరి వీటిని తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 2, 2024 / 02:49 AM IST

    Brajilian nut

    Follow us on

    Health Benefits: ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాలు ఉండే ఫుడ్ తప్పకుండా తీసుకోవాలి. ముఖ్యంగా నట్స్‌ను డైలీ డైట్‌లో చేర్చుకోవాలి. అయితే రోజూ నట్స్‌ తినడం వల్ల కండరాలు బలంగా తయారవుతాయి. శరీరంలో నీరసం, అలసట పోయి యాక్టివ్‌గా మారుతారు. ఈరోజుల్లో చాలామంది ఎముకల నొప్పితో బాధ పడుతున్నారు. పోషకాలు, కాల్షియం, మెగ్నీషియం ఉండే పదార్థాలను తీసుకోకపోవడం వల్ల ఎముకలు తొందరగా బలహీనంగా మారుతాయి. దీనివల్ల బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. ఇలాంటి ప్రమాదకరమైన వ్యాధులు రాకుండా ఉండాలని డైలీ కొందరు తప్పకుండా నట్స్‌ తింటారు. అయితే కొందరు వీటిలో బాదం, ఎండు ద్రాక్ష, వాల్‌నట్స్‌ను రాత్రిపూట నానబెట్టి ఉదయం తింటారు. ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాలు ఉండే ఫుడ్ తప్పకుండా తీసుకోవాలి. ముఖ్యంగా నట్స్‌‌ను డైలీ డైట్‌లో చేర్చుకోవాలి. అయితే రోజూ వీటిని తినడం వల్ల కండరాలు బలంగా తయారవుతాయి. శరీరంలో నీరసం, అలసట పోయి యాక్టివ్‌గా మారుతారు. అయితే వీటిలో చాలా రకాల నట్స్ ఉన్నాయి. మనలో చాలామందికి కొన్ని రకాల నట్స్ గురించి పూర్తిగా తెలియదు. అలాంటి వాటిలో బ్రెజిలియన్ నట్ ఒకటి. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని డైలీ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మరి వీటిని తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

     

    ఆరోగ్యంగా ఉండాలంటే డైట్‌లో కొన్ని రకాల గింజలను యాడ్ చేసుకోవాలి. అప్పుడే ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. అయితే ఈ బ్రెజిలియన్ నట్‌లో ఆరోగ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఉపయోగపడతాయి. ఇవి చూడటానికి బాదం గింజలుగా ఉంటాయి. కానీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఎక్కువగా అమెరికాలో దొరికే ఈ గింజల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ గింజల్లో 3% నీరు, 12% కార్బోహైడ్రేట్, 14% ప్రోటీన్, 66% ఆరోగ్యమైన కొవ్వులు ఉన్నాయి. ఇవి శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో బాగా సాయపడతాయి. ఈ గింజల్లో ఉండే సెలీనియం థైరాయిడ్‌ సమస్యను తగ్గిస్తుంది. అలాగే ఈ గింజల్లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో బాగా ఉపయోగపడతాయి. బ్రెజిల్ నట్స్ తినడం వల్ల శరీరానికి పుష్కలమైన శక్తి లభిస్తుంది మరియు ఇతర పోషకాల లోపాన్ని తీరుస్తుంది. అలాగే వాపు, చిరాకును కూడా తగ్గిస్తాయి.

     

    బ్రెజిలియన్ నట్‌లోని పోషకాలు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇందులో ఉండే ఖనిజాలు ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మాన్ని రక్షిస్తాయి. అలాగే ఇందులో కొవ్వు ఆమ్లాలు కూడా ఆరోగ్యమైనవి ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. డైలీ ఈ గింజలను తీసుకోవడం వల్ల గుండె సమస్యల నుంచి కూడా బయటపడతారు. అలాగే మెదడు పనితీరును మెరుగుపరచడంలో కూడా ఈ గింజలు ముఖ్యపాత్ర పోషిస్తాయి. అయితే ఈ గింజలు చాలా అరుదుగా దొరుకుతాయి. అమెరికాలో ఎక్కువగా లభ్యమవుతాయి.

     

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.