Health Benefits: మసాలా దినుసుల్లో ఆరోగ్యానికి మేలు చేసేవి ఎన్నో ఉన్నాయి. అందులోనూ సుగంధ ద్రవ్యాల రాణిగి పిలిచే యాలకులు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో బాగా సాయపడతాయి. ఈ యాలకులను వంటల్లో ఎక్కువగా వాడుతుంటారు. ముఖ్యంగా తీపి పదార్థాలకు వాడుతుంటారు. యాలకులు వాడటం వల్ల వంటలు చాలా టేస్టీగా ఉంటాయి. రోజూ టీ తాగేవారు అయితే తప్పకుండా వీటిని వాడుతుంటారు. వీటిని టీలో వేయడం వల్ల శరీరానికి ఆరోగ్య ప్రయోజనాలు ఉండటంతో పాటు టేస్టీగా ఉంటుందని వాడుతుంటారు. ఈ యాలకులు మంచి సువాసనతో ఉంటాయి. ఇందులోని పోషకాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో బాగా సహాయపడతాయి. అయితే కొందరు ఈ యాలకలను కేవలం వంటల్లో మాత్రమే వాడకుండా నములుతుంటారు. ముఖ్యంగా చదువుకునే వారు మధ్యలో నిద్ర రాకుండా ఉండేందుకు వీటిని వాడుతుంటారు. యాలకులను నమలడం వల్ల నిద్ర రాకుండా ఉండటంతో పాటు ఆరోగ్యంగా ఉంటారని భావిస్తారు. మరి యాలకులను నమలడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
యాలకుల్లో ఎక్కువగా పోషకాలు, ఔషధ గుణాలు ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో బాగా సహాయపడతాయి. ఇందులో నూనె మెంథాన్ ఉంటుంది. ఇది అసిడిటీ, అపానవాయువు వంటి సమస్యలను తగ్గించడంతో పాటు జీర్ణ సమస్యల నుంచి విముక్తి కలిగేలా చేస్తుంది. అలాగే కడుపులో ఉండే మంటను కూడా తగ్గిస్తుంది. చాక్లెట్ కంటే యాలకులను నమలడం వల్ల దంతాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఖనిజాలు దంతక్షయం వంటివి రాకుండా కాపాడతాయి. కొందరు నోటి దుర్వాసన సమస్యతో ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు యాలకులను నమలడం వల్ల దుర్వాసన అంతా పోతుంది. అలాగే నోటి ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.
యాలకుల్లో ఎక్కువగా యాంటీ ఇన్‌ఫ్లమటేరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి వాపును తగ్గించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. అలాగే రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తాయి. ఇందులో పోషకాలు రక్తపోటును అదుపులో ఉంచుతాయి. దీంతో గుండె పోటు వచ్చే ప్రమాదాలు తగ్గుతాయి. కొందరు బరువు ఎక్కువగా ఉంటారు. అలాంటి వారు ఈ యాలకులను తినడం వల్ల శరీరంలో ఉండే కొవ్వు పూర్తిగా కరిగిపోతుంది. బాడీలో ఉండే చెడు కొలెస్ట్రాల్ కరిగి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. వీటిని నమలడం వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యలు తగ్గడంతో పాటు శరీర నొప్పులు కూడా క్లియర్ అవుతాయి. దీన్ని నమలడం లేదా వంటల్లో వాడటం వల్ల శరీరంలో ఉండే టాక్సిన్స్‌ను బయటకు పంపిస్తాయి. అలాగే ఇందులో క్యాన్సర్‌ను నిరోధించే పోషకాలు ఉంటాయి. వీటిని డైలీ నమలడం వల్ల క్యాన్సర్‌ను నిరోధించవచ్చని నిపుణులు చెబుతున్నారు. యాలకుల్లో ఉండే పోషకాలు మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వీటిని డైలీ తినడం వల్ల మెదడు పనితీరు కూడా మెరుగుపడుతుందట. అలాగే ఇవి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా ముఖ్యపాత్ర పోషిస్తాయని నిపుణులు అంటున్నారు. కాబట్టి డైలీ ఒకటి లేదా రెండు యాలకులను అయిన తినడం అలవాటు చేసుకోవడం ఉత్తమం.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.