https://oktelugu.com/

Health Benefits: ఈ పదం జపిస్తూ మెడిటేషన్ చేస్తే.. సర్వోరోగాలు నివారణ

ఏదైనా పూజ ప్రారంభించే ముందు తప్పకుండా ఓం అనే మంత్రాన్ని జపిస్తారు. అయితే మెడిటేషన్ చేసేటప్పుడు ఓం అనే పదాన్ని జయించి చేస్తే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని, సర్వరోగాలు నుంచి విముక్తి పొందవచ్చని చెబుతున్నారు. మరి ఆ ప్రయోజనాలేంటో ఆలస్యం చేయకుండా తెలుసుకుందాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 5, 2024 / 04:16 AM IST

    Meditation

    Follow us on

    Health Benefits: ఆరోగ్యంగా ఉండటంతో పాటు ఫిట్‌గా ఉండాలంటే యోగా, మెడిటేషన్, వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. కొందరు ఉదయం లేచిన వెంటనే వ్యాయామం, యోగా వంటివి చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. అయితే చాలా మందికి వ్యాయామం చేయడం ఇష్టం లేక మెడిటేషన్ చేస్తుంటారు. మెడిటేషన్ చేయడం వల్ల మనస్సు నిర్మలంగా ఉంటుందని ఎలాంటి సమస్యలను అయిన కూడా అధిగమించవచ్చని నిపుణులు చెబుతుంటారు. మెడిటేషన్ చేయడం వల్ల చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. యంగ్ లుక్‌లో కనిపిస్తారు. ఎలాంటి ఒత్తిడికి లోనవుకుండా మానసికంగా హాయిగా ఉంటారు. అయితే కొందరు మెడిటేషన్ చేసేటప్పుడు ఓం మంత్రాన్ని జపిస్తారు. అధ్యాత్మికంగా ఉన్నవారు ఓం అని జపిస్తారు. మిగతావారు శ్వాస తీసుకుంటూ మెడిటేషన్ చేస్తారు. అయితే హిందూ మతంలో ఓం అనే పదం చాలా పవిత్రమైనది. ఏదైనా పూజ ప్రారంభించే ముందు తప్పకుండా ఓం అనే మంత్రాన్ని జపిస్తారు. అయితే మెడిటేషన్ చేసేటప్పుడు ఓం అనే పదాన్ని జయించి చేస్తే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని, సర్వరోగాలు నుంచి విముక్తి పొందవచ్చని చెబుతున్నారు. మరి ఆ ప్రయోజనాలేంటో ఆలస్యం చేయకుండా తెలుసుకుందాం.

     

    అత్యంత విలువనిచ్చే ఓం అనే పదాన్ని జపిస్తూ మెడిటేషన్ చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే రక్తపోటును నియంత్రణలో ఉంటుంది. గుండెకు ఆక్సిజన్ సరఫరా కూడా సక్రమంగా ఉంటుంది. ఓం అనడం వల్ల థైరాయిడ్ గ్రంధి కూడా ఆరోగ్యంగా ఉంటుంది. గొంతులో కంపనం ఏర్పడటం వల్ల థైరాయిడ్ గ్రంధి సమస్యలు రావు. దీనివల్ల జీవక్రియ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. థైరాయిడ్ గ్రంధి సమస్య వస్తే చాలా డేంజర్. ఎందుకంటే ఇది కొన్నిసార్లు థైరాయిడ్ క్యాన్సర్‌కు దారితీస్తుంది. దీనివల్ల కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంది. ఓం అని జపించడం వల్ల గొంతు దగ్గర కంపనాలు ఏర్పడి ఆరోగ్యంగా ఉంటుంది. లేకపోతే శరీరంలో వచ్చే హార్మోన్ల వల్ల కొన్ని మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ మధ్యకాలంలో అమ్మాయిలు ఎక్కువగా థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు. దీనివల్ల సంతాన సమస్యలతో కూడా ఇబ్బంది పడుతున్నారు. థైరాయిడ్ ఉంటే గర్భం దాల్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.

     

    థైరాయిడ్ ఉన్నవారు వెంటనే డాక్టర్‌ను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. దీంతో పాటు ఓం అని జపిస్తూ మెడిటేషన్ చేస్తే కొంతవరకు అదుపులోకి వస్తుంది. థైరాయిడ్ సమస్య నుంచి బయటపడాలంటే యోగా, మెడిటేషన్, వ్యాయామం చేయాలి. అలాగే సరైన ఆహారం తీసుకుంటూ, బాడీకి సరిపడా నిద్రపోవాలి. ఈ థైరాయిడ్ సమస్య అధికమైతే గుండె జబ్బులు రావడం, కీళ్ల నొప్పులు రావడం, మధుమేహం, క్యాన్సర్, ఊబకాయం, ఆస్తమా వంటివి కూడా వస్తాయి. థైరాయిడ్ ఉన్నవారిలో కొందరు బరువు తగ్గితే, మరికొందరు బరువు పెరుగుతారు. ఈ సమస్యను తగ్గించాలంటే ఎప్పటికప్పుడు వైద్యుని సంప్రదించి సూచనలు తీసుకోవాలి. లేకపోతే సమస్య తీవ్రం అవుతుంది. బాడీలో ఏ చిన్న లక్షణాలు ఉన్నా కూడా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.

     

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.