Health Benefits: తేనె, వెల్లుల్లి రెండు కూడా ఆరోగ్యానికి మంచివే. రోజూ వీటిని తినడం వల్ల శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఎక్కువగా వాకింగ్, రన్నింగ్‌కి వెళ్లేవారు వాటర్‌తో కలిపి తేనేను తీసుకుంటారు. వెల్లు్ల్లిని వంటల్లో ఎక్కువగా వాడుతుంటారు. ఈ వెల్లుల్లి లేకపోతే కొన్ని వంటల్లో టేస్ట్ కూడా రావు. ఈ రెండింటిలో కూడా పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో యాంటీ బాక్టీరియల్, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉంటాయి. ఇవి గాయాలను తగ్గించడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. అయితే వీటిని వేర్వేరుగా తినడం వల్ల శరీరానికి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మరి ఈ రెండింటిని కలిపి తింటే శరీరానికి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా? లేకపోతే అనారోగ్య సమస్యల బారిన పడతారా? అనే విషయాలు చాలా మందికి సందేహం ఉంది. ఇంతకీ తేనె, వెల్లుల్లి కలిపి తినవచ్చా? తింటే ఏమవుతుంది? దీనివల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలు ఏంటో పూర్తి వివరాల్లో తెలుసుకుందాం.
రోగనిరోధక శక్తిని పెరుగుతుంది
రాత్రిపూట తేనెలో నానబెట్టిన వెల్లుల్లిని ఉదయం తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీన్ని డైలీ తినడం వల్ల తక్షణమే శరీరానికి శక్తి లభిస్తుంది. శరీరానికి ఇది యాంటీబయాటిక్‌లా పనిచేస్తుంది. అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలిగించడంలో బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఏవైనా ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్నట్లయితే డైలీ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదే.
జలుబు, దగ్గు నుంచి విముక్తి
సీజనల్‌గా వచ్చే దగ్గు, జలుబు వంటి సమస్యల నుంచి విముక్తి చెందడానికి తేనె, వెల్లుల్లి బాగా ఉపయోగపడుతాయి. దీర్ఘకాలికంగా దగ్గుతో ఇబ్బంది పడుతున్నట్లయితే వీటిని తింటే తొందరగా ఉపశమనం పొందుతారు. ఈ రెండింటిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు గొంతు నొప్పి, మంటను తగ్గించడంలో బాగా సహాయపడతాయి.
గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది
వెల్లుల్లి, తేనె గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో బాగా సహాయపడతాయి. బాడీలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే ఇవి రక్తప్రసరణను మెరుగుపరచడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. శరీరానికి రక్తప్రసరణ సరిగ్గా కావడం వల్ల గుండెకు ఎలాంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది.
జీర్ణవ్యవస్థ ఆరోగ్యం
వెల్లుల్లి, తేనె కలిపి తినడం వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా మలబద్ధకం, విరేచనాలు, ఎసిడిటీ, కడుపునొప్పి వంటి సమస్యల నుంచి కూడా ఈజీగా విముక్తి చెందవచ్చు. ఇందులోని పోషకాలు జీర్ణ సమస్యలను క్లియర్ చేస్తాయి.
రోజుకి ఎన్ని తినాలంటే?
తేనె, వెల్లుల్లిని రోజుకి తక్కువ మోతాదులో మాత్రమే తీసుకోవాలి. ఉదయం లేచిన తర్వాత కేవలం రెండు లేదా మూడు వెల్లుల్లి రెబ్బలను మాత్రమే తినాలి. రాత్రి సమయాల్లో కూడా వెల్లుల్లి రెబ్బలను తీసుకోవచ్చు. అయితే రోజుకి ఎక్కువ మోతాదులో మాత్రం తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధికంగా తింటే అనారోగ్య సమస్యల బారిన పడతారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.