https://oktelugu.com/

Health Benefits: వేస్ట్ అని ఈ గింజలను పడేస్తున్నారా.. అయితే ఇది మీకోసమే!

చాలామంది ఖర్జూరం తినేసి గింజలను పడేస్తుంటారు. మీరు కూడా ఇలానే చేస్తున్నట్లయితే తప్పకుండా ఈ గింజలు వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకోవాలి. మరి ఈ ఖర్జూరం గింజల వల్ల శరీర ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలేంటో ఆలస్యం లేకుండా తెలుసుకుందాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 11, 2024 8:42 pm
    Dates seeds

    Dates seeds

    Follow us on

    Health Benefits: డ్రైఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండాలని చాలా మంది రోజూ కూడా తప్పకుండా డైట్‌లో డ్రైఫూట్స్‌ను యాడ్ చేసుకుంటారు. ఈ డ్రైఫ్రూట్స్‌లో కొందరు తప్పకుండా ఖర్జూరం తింటారు. స్వీట్‌గా, టేస్టీగా ఉండే ఖర్జూరాన్ని ఎక్కువ మోతాదులోనే తింటారు. ఇందులోని పోషకాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అలాగే బరువును పెంచడంలో బాగా సాయపడుతుంది. ఉదయం పూట ఖర్జూరం తినడం వల్ల రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. ఇందులో జింక్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు చర్మ సౌందర్యాన్ని పెంచడంలో కూడా బాగా ఉపయోగపడతాయి. అయితే సాధారణంగా ఖర్జూరం గింజలతో ఉంటుంది. ఈ మధ్య కాలంలో కొన్ని సీడ్ లెస్ ఖర్జూరం గింజలు లభ్యమవుతున్నాయి. అయితే కేవలం ఖర్జూరం వల్ల మాత్రమే కాకుండా ఇందులోని గింజల వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. చాలామంది ఖర్జూరం తినేసి గింజలను పడేస్తుంటారు. మీరు కూడా ఇలానే చేస్తున్నట్లయితే తప్పకుండా ఈ గింజలు వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకోవాలి. మరి ఈ ఖర్జూరం గింజల వల్ల శరీర ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలేంటో ఆలస్యం లేకుండా తెలుసుకుందాం.

     

    ఖర్జూరంలోనే కాకుండా ఆ గింజల్లో కూడా పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి కావాల్సిన ప్రయోజనాలను అన్నింటిని అందిస్తాయి. సాధారణంగా అందరూ కాఫీ పౌడర్‌తో టీ చేసుకుంటారు. ఆరోగ్యంగా ఉండాంటే ఈ ఖర్జూరం గింజలతో కూడా కాఫీ తయారు చేసుకోవచ్చు. సాధారణంగా కాఫీ పౌడర్‌లో కెఫిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కానీ ఈ ఖర్జూరం గింజల్లో కెఫిన్ అంతగా ఉండదు. దీంతో కాఫీ చేసి తాగడం వల్ల ఆరోగ్యానికి మంచి ఫలితాలు ఉంటాయి. ఈ ఖర్జూరం గింజలతో తయారు చేసిన కాఫీ తాగడం వల్ల ఆరోగ్యంగా బరువు తగ్గడం, డయాబెటిస్ సమస్య తగ్గడం, లైంగిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని నిపుణులు అంటున్నారు. ఈ గింజల్లో విటమిన్లు, మినరల్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణ సమస్యలను తగ్గించడంలో కూడా బాగా సాయపడతాయి.

     

    ఖర్జూరం గింజలతో కాఫీ పౌడర్ చేసుకోవాలంటే ముందుగా గింజలను తీసుకోవాలి. వీటిని బాగా శుభ్రం చేసి ఆరబెట్టాలి. ఎలాంటి తేమ లేకుండా గింజలు పొడిగా ఉండాలి. ఈ గింజలు కాస్త రంగు మారే వరకు వేయించాలి. ఆ తర్వాత వీటిని మొత్తగా పౌడర్‌లా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పౌడర్‌ను గాజు సీసాలో నిల్వ చేసుకుంటే దాదాపుగా నెల నుంచి రెండు నెలల వరకు నిల్వ ఉంటుంది. ఎలాంటి తేమ తగలకుండా ఈ గింజల పౌడర్‌ను ఉంచుకోవాలి. సాధారణంగా కాఫీ పౌడర్‌తో కాకుండా ఈ పౌడర్‌ వేసి కాఫీ చేసుకుంటే చాలు. తీపి కావాలంటే తేనె కూడా కలుపుకోవచ్చు. ఈ కాఫీని డైలీ తాగడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. మొదట్లో మీకు ఈ కాఫీ నచ్చకపోవచ్చు. కానీ అలవాటు అయ్యే కొలది ఈ కాఫీ తప్పకుండా నచ్చుతుంది.

     

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.