https://oktelugu.com/

Health Benefits: మీరు ఈ పని చేయడం లేదా? అయితే మీ జీవిత కాలం తగ్గినట్లే!

శారీరక శ్రమ లేని వాళ్లు, వ్యాయామం చేయకపోతే అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వారి జీవిత కాలం కాస్త తగ్గడంతో పాటు ప్రమాదకర వ్యాధుల బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 4, 2024 / 01:56 AM IST

    Exercise

    Follow us on

    Health Benefits: వ్యాయామం చేయడం ఆరోగ్యానికి చాలా మంచిది. డైలీ వ్యాయామం చేయడం వల్ల బాడీ ఫిట్‌గా ఉండటంతో పాటు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు. అయితే చాలామంది వాళ్ల బిజీ లైఫ్ వల్ల అసలు వ్యాయామం చేయడం లేదు. నిజం చెప్పాలంటే కనీసం శారీరక శ్రమ కూడా బాడీకి లేదు. డైలీ వ్యాయామం చేయడం వల్ల కండరాలు బలంగా తయారవుతాయి. అలాగే శరీరంలో ఉన్న కొవ్వు తగ్గుతుంది. అలాగే ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి విముక్తి చెందుతారు. ఈ రోజుల్లో అందరూ కూడా సుఖానికి అలవాటు పడి కనీసం శారీరకంగా వ్యాయామం కూడా చేయడం లేదు. ఎక్కువగా కూర్చోని ఉండటానికే ఇష్టపడుతున్నారు. ఇలా గంటల తరబడి కూర్చోవడం వల్ల లేని పోని అనారోగ్య సమస్యలను కోరి తెచ్చుకుంటున్నారు. అసలు శారీరక శ్రమ లేని వాళ్లు, వ్యాయామం చేయకపోతే అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వారి జీవిత కాలం కాస్త తగ్గడంతో పాటు ప్రమాదకర వ్యాధుల బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

     

    ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతీ ఒక్కరికి వ్యాయామం చాలా ముఖ్యం. మిగతా వాళ్లతో పోలిస్తే ఆటగాళ్లు చాలా ఫిట్‌గా ఉంటారు. ఎందుకంటే వీరు రోజులో చాలా సమయం పాటు వ్యాయామం చేస్తుంటారు. దీనివల్ల ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారు. రోజూ వ్యాయామం చేయడం వల్ల 31 శాతం జీవిత కాలాన్ని ఈజీగా పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఏదైనా వ్యాధి బారిన పడితే లక్షలు ఖర్చు అవుతాయి. అదే రోజూ కాస్త సమయం వ్యాయామానికి కేటాయిస్తే ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా దరిచేరవు. వారానికి రెండున్నర నుంచి ఐదు గంటల పాటు వ్యాయామం చేస్తే 22 శాతం గుండె ప్రమాదాలు తగ్గుతాయట. శరీరానికి శారీరక వ్యాయామం చాలా ముఖ్యమైనది. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా తప్పనిసరిగా వ్యాయామం చేయాలి.

     

    డైలీ వ్యాయామం చేయడం వల్ల జీవిత కాలం పెరుగుతుంది. లేకపోతే అధిక రక్తపోటు, గుండె సమస్యలు, మధుమేహం, ఊబకాయం, థైరాయిడ్, ఆర్థరైటిస్ వంటి సమస్యల బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా వారానికి కనీసం 5 గంటలు అయిన వ్యాయామం చేయాలి. దీనివల్ల 21 శాతం మరణం నుంచి బయటపడవచ్చు. ఎప్పుడో వ్యాయమం చేసేవారితో పోలిస్తే రోజూ వ్యాయామం చేసేవారి జీవిత కాలం దాదాపుగా 31 శాతం పెరుగుతుంది. అలాగే దీర్ఘకాలిక అనారోగ్య బారిన పడే అవకాశాలు కూడా తగ్గుతాయి. అయితే వ్యాయామంతో పాటు పోషకాలు ఉండే ఆహారాన్ని అధికంగా తీసుకోవాలి. వీటివల్ల శరీర ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. కాబట్టి డైలీ వ్యాయామం చేయడం అలవాటు చేసుకోండి. దీనివల్ల మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు.

     

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.