https://oktelugu.com/

Health Benefits: ఈ వంకాయతో ఇన్ని లాభాలా? తెలిస్తే అసలు తినకుండా ఉండలేరే?

ప్రతీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయితే మాత్రం తప్పకుండా వంకాయ కూర వండుతారు. ఈ కర్రీ తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. అందుకే దీన్ని రకరకాలుగా వండుకుని తింటారు. అయితే వంకాయల్లో కొన్ని రకాలు ఉంటాయి. అందులో సీమ వంకాయ గురించి ఎవరికీ కూడా పెద్దగా తెలియదు. సాధారణ వంకాయ కంటే సీమ వంకాయను వండుకుని తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ సీమ వంకాయ తినడం వల్ల కలిగే ఆ ఆరోగ్య ప్రయోజనాలేంటో చూద్దాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 30, 2024 / 03:42 AM IST

    Health Benefits seemavankaya

    Follow us on

    Health Benefits: మిగతా దేశాలతో పోలిస్తే ఇండియన్స్ ఎక్కువగా కూరగాయలను వండుతుంటారు. వీటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయని ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయని నమ్ముతారు. ఎన్ని ఆహార అలవాట్లు మారుతున్న కూడా తాజా కూరగాయలను తీసుకోవడం మాత్రం మానరు. ఇండియన్స్ డైలీ కొన్ని రకాల కూరగాయలను డైట్‌లో చేర్చుకుంటారు. రోజూ కాకపోయిన వారానికి ఒకసారి అయిన కూడా తినాలని అనుకుంటారు. అయితే ప్రతీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయితే మాత్రం తప్పకుండా వంకాయ కూర వండుతారు. ఈ కర్రీ తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. అందుకే దీన్ని రకరకాలుగా వండుకుని తింటారు. అయితే వంకాయల్లో కొన్ని రకాలు ఉంటాయి. అందులో సీమ వంకాయ గురించి ఎవరికీ కూడా పెద్దగా తెలియదు. సాధారణ వంకాయ కంటే సీమ వంకాయను వండుకుని తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ సీమ వంకాయ తినడం వల్ల కలిగే ఆ ఆరోగ్య ప్రయోజనాలేంటో చూద్దాం.

    సీమ వంకాయను బెంగళూరు వంకాయ అని కూడా అంటారు. ఇందులోని పోషకాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో బాగా సహాయపడతాయి. ఇందులో చాలా తక్కువ కేలరీలు ఉంటాయి. ఇవి ఈజీగా బరువు తగ్గేలా చేస్తాయి. బరువు తగ్గాలనుకునే వారికి సీమ వంకాయ బెస్ట్ అని చెప్పవచ్చు. ఈ సీమ వంకాయలో అధిక పీచు ఉండటంతో పాటు పొటాషియం కూడా అధికంగా ఉంటుంది. ఈ సీమ వంకాయను తినడం వల్ల ఎక్కువ సేపు పొట్ట నిండుగా ఉంటుంది. దీంతో తొందరగా ఆకలి కూడా వేయదు. ఇది రక్తపోటును కూడా నియంత్రిస్తుంది. దీంతో గుండె పోటు వచ్చే ప్రమాదాలు తగ్గుతాయి. సీమ వంకాయలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడతాయి. ఈ సీమ వంకాయలో విటమిన్లు, ఫోలేట్లు, మ్యాంగనీస్ వంటి ఖనిజాలు కూడా నిండుగా ఉన్నాయి. ఇవి శరీరానికి కావాల్సిన శక్తిని ఇవ్వడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇందులోని ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు మలబద్ధకం సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

    సాధారణ వంకాయతో పోల్చితే సీమ వంకాయలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరంలో ఉండే ఫ్రీ ర్యాడికల్స్‌ను తొలగిస్తాయి. దీంతో ప్రమాదకర క్యాన్సర్ వంటి వ్యాధుల నుంచి విముక్తి పొందవచ్చు.ఇందులోని యాంటీ ఏజింగ్ చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. అలాగే నాడీ వ్యవస్థను అభివృద్ధి చేయడంలో కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ఇందులోని పోషకాలు మెదడు పనితీరును మెరుగుపరచడంలో బాగా సహాయపడతాయి. అలాగే ఇవి ఒత్తిడిని తగ్గించి మానసికంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. ఇందులోని విటమిన్లు, కాల్షియం కూడా ఎముకలు బలంగా ఉండేలా చేయడంతో పాటు ఆర్థరైటిస్ వంటి సమస్యలు రాకుండా కాపాడతాయి.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.