Nandivardhanam flowers: ప్రకృతిలో ఉండే మొక్కలు మనకు ఎన్నో ఔషధాలను ఇస్తాయనే విషయం తెలిసిందే. వేర్వేరు మొక్కలు వేర్వేరు ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ఔషధ గుణాలను కలిగిన చెట్లలో నందివర్ధనం మొక్క కూడా ఒకటి కాగా ఈ మొక్క యొక్క పూల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయనే సంగతి తెలిసిందే. ఆసియా దేశాలలో ఎక్కువగా నందివర్ధనం మొక్కలను చూడవచ్చు. ఈ మొక్క పూలు, ఆకులు, వేర్లు ఔషధ గుణాలను కలిగి ఉంటాయి.

నందివర్ధనం చెట్టు ఆకు కషాయంతో రక్తపోటుకు సులభంగా చెక్ పెట్టడం సాధ్యమవుతుంది. క్యాన్సర్ చికిత్సలో నందివర్ధనం పువ్వులను ఎక్కువగా వినియోగించడం జరుగుతుంది. లైంగిక కోరికను పెంచడంతో పాటు మత్తుమందుగా కూడా ఈ చెట్టు పూలు ఎంతగానో ఉపయోగపడతాయి. కడుపునొప్పి, తీవ్రమైన విరేచనాలకు చెక్ పెట్టడంలో నందివర్ధనం పువ్వులు ఉపయోగపడతాయి.
హెపటైటిస్ వల్ల వచ్చే కాలేయనొప్పికికూడా నందివర్ధనం పూలను ఉపయోగించవచ్చు. ఈ మొక్క యొక్క వేర్లు చేదుగా ఉంటాయి. ఎన్నో ఔషధ గుణాలు ఉన్న ఈ మొక్కను దేవుని పూజకు కూడా వినియోగిస్తారు. ఈ మొక్క యొక్క వేర్లను నమలడం వల్ల పంటినొప్పికి చెక్ పెట్టడం సాధ్యమవుతుంది. ఎన్నో ఔషధ గుణాలు ఉన్న ఈ మొక్కను పెంచుకుంటే ఎంతో మంచిదని చెప్పవచ్చు.
నందివర్ధనం మొక్క పూలు కంటి అలసటను తగ్గించడంలో తోడ్పడతాయి. ఈ మొక్క ఆకుల నుంచి వచ్చే పాలను గాయాలు, పుండ్లపై రాస్తే గాయాలు, పుండ్లు తగ్గే అవకాశం అయితే ఉంటుంది. శివునికి ఈ మొక్క పూలు అంటే ప్రీతి కావడం గమనార్హం. ఈ మొక్కల సహాయంతో ఆయుర్వేద ఔషధాలను కూడా తయారు చేస్తారు. వేర్వేరు వ్యాధుల చికిత్సలో ఈ మొక్కతో చేసిన ఔషధాలను వినియోగిస్తారు.