Health Benefits: సీజనల్‌గా దొరికే జామ పండ్లు ఆరోగ్యానికి ప్రయోజనాలను చేకూరుస్తాయి. వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందుతాయి. ముఖ్యంగా ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల చర్మం, జుట్టు, రోగనిరోధక శక్తిని పెంచడంలో బాగా ఉపయోగపడుతుంది. డైలీ ఈ జామ పండ్లను తినడం వల్ల మలబద్ధకం సమస్య నుంచి కూడా విముక్తి చెందుతారు. అయితే ఇందులోని విటమిన్ ఏ కళ్ల ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. అయితే చలికాలంలో జామ పండును తినడం వల్ల జలుబు, దగ్గు సమస్యలు వస్తాయని కొందరు భావిస్తారు. కానీ చలికాలంలో జామ పండు తినడం వల్ల ఇంకా జలుబు తగ్గుతుందని, కానీ పెరగదని నిపుణులు చెబుతున్నారు. ఏ సీజన్‌లో అయిన జామ కాయలను తినడం వల్ల శరీరానికి ప్రయోజనాలే కానీ, నష్టాలు లేవని తెలిపారు. మిగతా పండ్లతో పోలిస్తే జామ కాయలు తక్కువ రేటుకే లభిస్తాయి. ఇందులోని పోషకాలు శరీర ఆరోగ్యానికి బాగా ఉపయోగపడతాయి. అయితే కేవలం జామ కాయలతోనే కాకుండా జామ ఆకులతో కూడా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఇందులోని పోషకాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో బాగా ఉపయోగపడతాయి. మరి జామ ఆకులతో కలిగే ప్రయోజనాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మధుమేహం నియంత్రణలో..
జామ ఆకులను తినడం వల్ల మధుమేహం నియంత్రణలో ఉంటుంది. ఇందులోని ఫినోలిక్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ఈ ఆకులను జ్యూస్ చేసి కూడా తాగవచ్చు. ఇందులోని పోషకాలు, విటమిన్లు మధుమేహాన్ని నియంత్రించడానికి బాగా సహాయపడుతుంది. జామ ఆకులు మధుమేహం ఉన్నవారికి చక్కటి ఔషధంగా చెప్పుకోవచ్చు.
జీర్ణక్రియ ఆరోగ్యం
రోజూ ఉదయం పరగడుపున జామ ఆకులను తినడం వల్ల జీర్ణక్రియ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ ఆకుల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది. ఈ ఆకులు నమలడం వల్ల అజీర్ణం, మలబద్ధకం, గ్యాస్, ఎసిడిటీ వంటి కడుపు సమస్యల నుంచి కూడా విముక్తి పొందవచ్చు.
బరువు తగ్గడం
జామ ఆకులను డైలీ నమలడం వల్ల ఆరోగ్యంగా బరువు తగ్గుతారు. ఇందులోని పోషకాలు శరీర బరువును తగ్గిస్తాయి. ఈ ఆకుల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. దీనివల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. డైలీ ఈ ఆకులను తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేర నివ్వకుండా ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకునే వారు డైలీ జామ ఆకులను తింటే సరిపోతుంది.
రక్తపోటు నియంత్రణలో
జామ ఆకుల్లో ఎక్కువగా పొటాషియం, ఫైబర్ ఉంటాయి. ఇవి రక్తపోటును అదుపులో ఉంచుతాయి. వీటిని డైలీ తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉండి గుండె పోటు వచ్చే ప్రమాదాలను తగ్గిస్తుంది. అయితే కొందరు ఈ జామ ఆకులను తింటారు. మరికొందరు ఈ జామ ఆకులతో వాటర్ తయారు చేసుకుని తాగుతారు. ఏ విధంగా ఈ ఆకులను తీసుకున్న కూడా ఆరోగ్యానికి మేలే జరుగుతుంది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.