Homeలైఫ్ స్టైల్Largest Teen Boy : 14 ఏళ్లకే అసాధారణ రీతిలో పెరిగాడు.. బూట్ల సైజు దొరకడం...

Largest Teen Boy : 14 ఏళ్లకే అసాధారణ రీతిలో పెరిగాడు.. బూట్ల సైజు దొరకడం లేదు

Largest Teen Boy : జన్యు లోపంతో కొంతమంది అసాధరణంగా పెరగడం చూస్తుంటాం. మరికొంతమంది అదే జన్యు లోపంతో మరగుజ్జులుగా కూడా ఉండిపోతుంటారు. ఈ రెండూ అసాధారణమే. వాటి ప్రభావంతో అలాంటి వారు ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇలా అసాధారణంగా పెరిగిన ఓ బాలుడి కోసం అమెరికాకు చెందిన ఓ మహిళ బూట్లుల కొనలేకపోతోంది. తన 14 ఏళ్ల కుమారుడికి బూట్లు కొనడం కోసం ప్రపంచమంతా వెతికినా ఫలితం దక్కలేదు. అతడికి కావాల్సిన షూస్‌ సైజు నంబర్‌ 23. చివరకు తయారీ సంస్థలను సంప్రదించినా ఆ సైజు తయారు చేయలేమంటున్నాయి.

అసాధరణంగా పెరుగుతున్న బాలుడు..
అమెరికాలోని మిషిగాన్‌కు చెందిన ఎరిక్‌ జూనియర్‌ అనే కుర్రాడి తల్లికి ఎదురైన పరిస్థితి ఇది. ఎరిక్‌ 14 ఏళ్ల వయసులోనే ఆరు అడుగుల పది అంగుళాల ఎత్తు పెరిగాడు. పుట్టినప్పుడే అతడి పాదాలు కాస్త పెద్దగా ఉండేవి. అవి అసాధారణ రీతిలో పెరుగుతూ వస్తున్నాయి. ఏడో తరగతికి వచ్చేసరికి అతడి బూట్ల సైజు 17కు చేరింది. అప్పట్నుంచి అతడి పాదాలకు సరిపోయే బూట్లు దొరక్క తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యేవి. సరిపోని బూట్లు ధరించడం వల్ల ఎరిక్‌ కాళ్లకు బొబ్బలు రావడంతోపాటు అందరు పిల్లల్లా ఆటలు ఆడలేకపోయేవాడు. అతడి పాదాలకు సరిపోయే సైజు షూస్‌ కోసం ఎరిక్‌ తల్లి ఎన్ని షాపులు తిరిగినా నిరాశే ఎదురైంది.

సైజు 22 దాటింది..
ప్రస్తుతం ఎరిక్‌ 22 సైజ్‌ షూస్‌నే కష్టంగా వాడుతున్నాడు. అవి కూడా అతని కుటుంబ స్నేహితురాలికి నైకీ సంస్థకు చెందిన ఓ షాపులో కనిపించాయి. నైకీ సంస్థ గరిష్టంగా 18 సైజ్‌ వరకే బూట్లను తయారు చేస్తుంది. అయితే ఓ అథ్లెట్‌ కోసం 22 సైజ్‌ ఉన్న ఓ బూట్ల జతను ప్రత్యేకంగా తయారు చేసింది. ఎరిక్‌ పాదాలు ఇంకా పెరుగుతూ ఉన్నందున 23 సైజ్‌ బూట్లు కూడా సరిపోవని అతడి తల్లి చెబుతోంది.

సోషల్‌ మీడియాలో వైరల్‌..
ఎరిక్‌ పరిస్థితిపై అమెరికా మీడియా కథనం ప్రసారం చేసింది. అతడి తల్లి ఆవేదనను కళ్లకు కట్టింది. ఈ న్యూస్‌ యూఎస్‌తోపాటు ప్రపంచ వ్యాప్తంగా వైరల్‌గా మారింది. బాలుడు ఎరిక్‌ పరిస్థితి, తల్లి ఆవేదనను గుర్తించిన ప్యూమా, అండర్‌ ఆర్మర్‌ సంస్థలు ఎరిక్‌కు సరిపోయే బూట్లను ప్రత్యేకంగా తయారు చేస్తామని ముందుకొచ్చాయి. దీంతో బాలుడి కష్టాలు తీరుతాయని ఎరిక్‌ తల్లి సంతోషం వ్యక్తం చేస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version