Electric vehicle ownership tips: రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ కార్లదే హవా అని చాలామంది నిపుణులు తెలుపుతున్నారు. దీంతో చాలామంది ఇప్పటికే విద్యుత్ కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. పెట్రోల్ కార్ల కంటే విద్యుత్ కార్ల నుంచి వెలువడే కర్బన ఉద్గారాలు తక్కువగా ఉండడంతోపాటు.. ఇందన ఖర్చు తక్కువగా ఉండడంతో చాలామంది వీటిని కొనుగోలు చేయాలని ఆసక్తి చూపుతున్నారు. కంపెనీలు సైతం విద్యుత్ కార్ల ఉత్పత్తిపై దృష్టి పెట్టాయి. అయితే ఇప్పటికే విద్యుత్ కార్లను కొనుగోలు చేసిన వారు ఆందోళన చెందుతున్నారు. వీటితో అనేక సమస్యలు ఉండడంతోపాటు మధ్యతరగతి ప్రజలకు ఇవి అనుకూలంగా లేవని కొందరు నిపుణులు తెలుపుతున్నారు. బ్యాటరీ నిర్వహణ, విద్యుత్ పరికరాల ధరలు భారీగా ఉండడంతో వీటిని కొనుగోలు చేసే ముందు ఆలోచించాలని అంటున్నారు. అసలు విద్యుత్ కార్లతో ఉన్న సమస్యలు ఏంటంటే?
విద్యుత్ కారు ప్రధానంగా నడిచేది బ్యాటరీ తోనే. బ్యాటరీ బాగుంటేనే విద్యుత్ వాహనానికి అందం. అందుకే విద్యుత్ వాహనం కొనుగోలులో 40 నుంచి 50 శాతం ధరలు బ్యాటరీ ఖర్చుకి వెళ్తాయి. అయితే ఈ బ్యాటరీ సామర్థ్యం తగ్గిన తర్వాత వాటిని రీప్లేస్మెంట్ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్న వాహనాల ఈవీల బ్యాటరీలు నాలుగు నుంచి ఐదు లక్షల వరకు ఖర్చవుతుంది. పెద్ద వాహనాల బ్యాటరీ ఖర్చు 15 లక్షల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్సాన్ వంటి కార్ల బ్యాటరీ ధరలు ఏడు నుంచి తొమ్మిది లక్షల వరకు ఉంటుంది. ఒక కారులో సగం వరకు బ్యాటరీ ఖర్చు ఉండడంతో.. బ్యాటరీ లో సమస్యలు వస్తే చాలా వరకు నష్టపోయే అవకాశం ఉంటుంది.
అయితే ఇవి పది నుంచి 20 సంవత్సరాల వరకు లేదా రెండు నుంచి మూడు లక్షల కిలోమీటర్ల వరకు పనిచేస్తాయి. ప్రతిరోజు బ్యాటరీ ఒకటి నుంచి రెండు శాతం వరకు క్షీణత తగ్గుతుంది. భారతదేశంలో ఉన్న వాతావరణానికి.. ఇది మరింతగా పెరిగే అవకాశం ఉంది. అంటే ప్రతిరోజు 10 నుంచి 20% వరకు క్షీణత పెరిగే అవకాశం ఉంది. దీంతో దీర్ఘకాలికంగా బ్యాటరీలు మన్నికగా ఉంటాయన్న గ్యారెంటీ లేదు. ఇది మిడిల్ క్లాస్ పీపుల్స్ కు చాలా వరకు నష్టం అయ్యే అవకాశం ఉంటుంది.
విద్యుత్ కార్లు కొన్న సమయంలో బాగానే ఉంటుంది. కానీ వీటిలో సమస్యలు వస్తే మరమ్మతులు చేసుకోవడానికి అనువైన షోరూమ్స్ అందుబాటులో ఉండవు. ముఖ్యంగా ఇంజన్ ఆయిల్, క్లచ్ రీప్లేస్మెంట్ వంటివి అందుబాటులో దొరకవు. ఒక విద్యుత్ కారు సాధారణంగా మూడు నుంచి ఐదువేల వరకు నిర్వాహన ఖర్చయ్య అవకాశం ఉంటుంది. అలాగే ఇందులో ఐ వోల్టేజ్ సమస్యలు, సాఫ్ట్వేర్ అప్డేట్స్ వంటివి కొత్తగా ఉండడంతో వీటిని మరమ్మతులు చేయడానికి పెద్ద పెద్ద నగరాలకు ప్రత్యేకంగా వెళ్లాల్సిందే. మిగతా సర్వీసులను కంపెనీల షోరూమ్స్ తక్కువగా ఉండటం వల్ల వీటి రెస్పాన్సిబిలిటీ తక్కువగా ఉంటుంది. అందువల్ల విద్యుత్ కార్ల కొనుగోలు విషయంలో ఆలోచించాలి అని నిపుణులు తెలుపుతున్నారు.