Thyroid: థైరాయిడ్ ఉందా? ఈ జ్యూస్ లు తాగండి

ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇక ఈ పానీయాలు థైరాయిడ్‌ బాధితులకు గొప్ప ఉపశమనం కలిగిస్తాయి. ఇంతకీ అవేంటి అంటే..

Written By: Swathi, Updated On : May 21, 2024 3:36 pm

Best Juices for Thyroid Patients

Follow us on

Thyroid: థైరాయిడ్ సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య స్త్రీ, పురుష బేధం లేకుండా బాధ పెడుతుంది. థైరాయిడ్ హార్మోన్ అసమతుల్యత వల్ల ఏర్పడే ఆరోగ్య సమస్య అని తెలిసిందే. దీంతో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. అయితే ముందులు మాత్రమే కాదు కొన్ని హోం రెమిడీస్‌ పాటిస్తే అద్భుత ప్రయోజనం ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వీటిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇక ఈ పానీయాలు థైరాయిడ్‌ బాధితులకు గొప్ప ఉపశమనం కలిగిస్తాయి. ఇంతకీ అవేంటి అంటే..

మజ్జిగ..
మీ డైట్ లో మజ్జిగ ఉంటే థైరాయిడ్ కు చెక్ పెట్టవచ్చు. దీని వల్ల మీ ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. మజ్జిగ గట్ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. హైపోథైరాయిడిజంలో మంటను తగ్గిస్తుంది. ఎందుకంటే మజ్జిగలో ప్రోబయోటిక్స్ ఉంటాయి.

క్యారెట్, బీట్‌రూట్ జ్యూస్
థైరాయిడ్ బాధితులకు క్యారెట్, బీట్‌రూట్ జ్యూస్ చాలా ప్రయోజనాలను చేకూరుస్తాయి. మజ్జిగలో ఫైటోన్యూట్రియెంట్స్, లైకోపీన్ లు ఉంటాయి. ఇది శరీరంలో యాంటీఆక్సిడెంట్‌గా పని చేస్తుంటాయి. అలాగే ఈ డ్రింక్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి.. థైరాయిడ్ చికిత్స కోసం తాజా క్యారెట్, బీట్‌రూట్ జ్యూస్ క్రమం తప్పకుండా చేసుకుని తాగడం మర్చిపోకండి.

బాదం పాలు..
బాదం పాలు శరీరంలో మంటను తగ్గించడంలో నెంబర్ వన్ గా పని చేస్తాయి. పాలు లేదా పాల ఉత్పత్తులకు అలెర్జీ ఉన్నవారు బాదం పాలు తాగడం వల్ల మంచి ఉపశమనం పొందవచ్చు. స్మూతీస్ కు మాత్రమే ప్రిఫరెన్స్ ఇవ్వకుండా, మీరు టీ, కాఫీ, బాదం పాలను తాగితే కూడా చాలా మంచిది.

యాపిల్‌ సైడర్‌ వెనిగర్..
ఒక గ్లాసు నీటిలో 1 టీస్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ ను వేసి కలపండి. ఆల్కలీన్ స్వభావం కలిగిన ఈ పానీయం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఉపయోగపడుతుంది. దీని వల్ల కడుపు నిండిన ఫీల్ ఉంటుంది సో బరువు కూడా పెరగరు.

పసుపు పాలు..
పాలు, పసుపు కలిపి తాగటం వల్ల థైరాయిడ్‌ బాధితులకు ఉపశమనం కలుగుతుంది. వేడి పాలలో చిటికెడు పసుపు కలుపుకుని తాగడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. ఈ మిశ్రమంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇదెలా ఉంటే పసుపులో కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఈ డ్రింక్‌ పోషక విలువలను పెంచడంలో ప్రభావవంతంగా పని చేస్తుంది. థైరాయిడ్ సమస్యలకు పసుపు పాలు చాలా ఉపయోగకరం.