https://oktelugu.com/

Pithapuram: పిఠాపురంలో మారిన సీన్.. లెక్క తప్పుతోందా?

ఏపీ ఎన్నికల్లో ఈసారి పిఠాపురం స్పెషల్. గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసిన పవన్ ఓటమి చవిచూశారు. గతఐదు సంవత్సరాలుగా ఎన్నో రకాల అవమానాలు పడ్డారు. రెండు చోట్ల ఓడిపోవడంతో వైసీపీకి టార్గెట్ అయ్యారు.

Written By:
  • Dharma
  • , Updated On : May 21, 2024 / 03:50 PM IST

    who will win in pithapuram

    Follow us on

    Pithapuram: ఏపీలో పొలిటికల్ హీట్ తగ్గడం లేదు. పోలింగ్ ముగిసి వారం రోజులు దాటుతున్నా.. ఆ వేడి అలానే ఉంది. గెలుపు పై అన్ని పార్టీలు ధీమాతో ఉన్నాయి. గ్రామాల వారిగా లెక్కలు కొలిక్కి వస్తుండడంతో.. గెలుపు పై అంచనాలు అందకుండా పోతున్నాయి. అయితే ఎవరికి వారు తాము గెలుస్తామని ధీమాతో మాత్రం ఉన్నారు. ఇక పిఠాపురంలో అయితే ఒక రకమైన వాతావరణం కనిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు పవన్ కు లక్ష మెజారిటీ దాటుతుందని అంతా భావించారు. కానీ 10 నుంచి 20 వేలుఓట్ల మెజారిటీ వస్తుందని కొత్త అంచనాలు తెరపైకి రావడం చర్చకు దారితీస్తోంది.దీంతో అక్కడ బెట్టింగులు కూడా తగ్గుముఖం పట్టాయి.

    ఏపీ ఎన్నికల్లో ఈసారి పిఠాపురం స్పెషల్. గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసిన పవన్ ఓటమి చవిచూశారు. గతఐదు సంవత్సరాలుగా ఎన్నో రకాల అవమానాలు పడ్డారు. రెండు చోట్ల ఓడిపోవడంతో వైసీపీకి టార్గెట్ అయ్యారు. ఈ అవమానాలను దిగమింగుకొని ఈ ఎన్నికల్లో పొత్తులతో తెరమీదకు వచ్చారు. కాపు సామాజిక వర్గం అధికంగా ఉండే పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. పవన్ గెలుపు కోసం రాష్ట్రవ్యాప్తంగా జనసైనికులు పిఠాపురం వచ్చి ప్రచారం చేశారు. మెగా కుటుంబంతో పాటు బుల్లితెర నటులు జల్లెడ పట్టి మరి ప్రచారం చేయగలిగారు. దీంతో పవన్ కు భారీ మెజారిటీ ఖాయమని ప్రచారం జరిగింది. 60 వేల నుంచి లక్ష ఓట్ల మెజారిటీతో పవన్ గెలుపు పొందుతారని అంచనాలు వెలువడ్డాయి. దీంతో భారీగా బెట్టింగులు జరిగాయి.

    అయితే ఇప్పుడు ఉన్నఫలంగా ఒక ప్రచారం ప్రారంభమైంది. పది నుంచి 20 వేల మెజారిటీ పవన్ కు వస్తుందని స్వయంగా జనసైనికులు లెక్కలు కట్టడంతో పరిస్థితులు తారుమారయ్యాయి. ఇక్కడ వైసిపి అభ్యర్థిగా బలమైన మహిళా నేత వంగా గీత పోటీ చేశారు. ఆమె సైతం కాపు సామాజిక వర్గానికి చెందిన వారే. యువత మొత్తం పవన్ వైపు మొగ్గు చూపగా, నడివయస్కులు, వృద్ధులు వైసీపీ వైపు టర్న్ అయినట్లు తెలుస్తోంది. 90 వేలకు పైగా కాపు సామాజిక వర్గ ఓటర్లు ఉన్నారు. వీరితో పాటు బీసీ, ఎస్సీ ఓటర్లు సైతం గణనీయంగానే ఉన్నారు. అయితే నిన్నటి వరకు పవన్ కు భారీ మెజారిటీ వస్తుందని అంతా భావించారు. ఇప్పుడు ఆ సంఖ్యను తగ్గించి చెబుతుండడంతో పిఠాపురంలో ఏం జరుగుతుందోనని.. అందరూ ఆరా తీయడం ప్రారంభించారు. మరోవైపు పవన్ గెలుపు, మెజారిటీపై భారీ బెట్టింగులు కట్టారు. మారిన లెక్కల నేపథ్యంలో ఈ బెట్టింగులు సైతం తగ్గాయని టాక్ నడుస్తోంది. మొత్తానికైతే పిఠాపురంలో సీన్ మారడం హాట్ టాపిక్ అవుతోంది.