Haldiram: చిన్న పిల్లలు ఏడ్చినప్పుడు వారిని ఊరుకోబెట్టడానికి చిరుతిళ్లు కొనిస్తాం. కిరాణ షాపుల్లో ప్రత్యేక ప్యాకుల్లో లభించే ఈ స్నాక్స్ చిన్నారులను ఎంతో ఆకర్షిస్తాయి. వీటిలో ప్రధానంగా ‘హల్దీరామ్’కు చెందినవి ఎక్కువగా ఉంటాయి. చాలా మంది ప్రత్యేకంగా హల్దీరామ్ స్నాక్స్ ను అడుగుతూ ఉంటారు. రుచికరంగా ఉండడంతో పాటు క్వాంటిటీ ఎక్కువగా అందించే ఈ కంపెనీ ఇప్పటిదీ కాదు. స్వాతంత్ర్యం ఏర్పాటు కాకముందు నుంచే ఉంది. చిన్న భుజియా కొట్టుగా ఏర్పడిన ఇది అంచెలంచెలుగా ఎదిగి ప్రపంచ వ్యాప్తంగా 80 దేశాల్లో విస్తరించింది. వరల్డ్ వైడ్ గా ప్రఖ్యాతి గాంచిన కేఎఫ్ సీ, మెక్ డోనాల్డ్స్, డామినోస్ వంటి వాటికి గట్టి పోటీ ఇస్తున్న ఇండియన్ ‘హల్దీరామ్’ వెనుక ఓ వ్యక్తి కష్టార్జితం మాములుగా లేదు. ఎన్నో అవమానాలు, ఇబ్బందులు ఎదుర్కొని ఈ వ్యవస్థను ఏర్పాటు చేసిన ఆయన నేటి యువకులకు ఆదర్శం. మరి ఆయన గురించి తెలుసుకుందామా..
రాజస్థాన్ రాష్ట్రం.. బికనీర్ లో జన్మించి గంగా బిషన్ అగర్వాల్ చిన్నప్పటి నుంచే వ్యాపార రంగంలో ఏదో ఒకటి చేయాలనే తపన ఉండేది. వీరి కుటుంబానికి చెందిన ఓ మహిళ భుజియా తయారు చేసి కుటుంబ సభ్యులకు అందించేంది. 1937 కాలంలో వారి పరిసర ప్రాంతాల్లో బయట కూడా ఎక్కువగా భుజియా అమ్మేవారు. అయితే చాలా మంది డబ్బు ఆశతో వాటిలో నాణ్యత ఉంచేవారు కాదు. అయితే దీనిని తక్కువ లాభంతోనైనా రుచికరంగా తయారు చేయాలని బిషన్ అగర్వాల్ అనుకున్నాడు. దీంతో బికనీర్ లో ఓ చిన్న కిరాణం దుకాణం ఏర్పాటు చేసి అందులో భుజియా అమ్మడం ప్రారంభించారు. దీనిని రుచి చూసిన చాలా మంది అయన కిరాణం షాపుకు క్యూ కట్టారు.
బిషన్ అగర్వాల్ ను తన తల్లి ముద్దుగా ‘హల్దీరామ్’అని పిలిచేది. ఆ పేరుతో చిన్న చిన్న దుకణాలను విస్తరించడం ప్రారంభించారు. అయితే ఈ సమయంలో ఆయన కుటుంబ సభ్యుల నుంచి అనేక విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇంట్లో కలహాల కారణంగా ఆయన వ్యాపారం సరిగా నిర్వహించలేకపోయాడు. అయినా తన పట్టుదలతో బ్రాండ్ ను అభివృద్ది చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో హల్దీరామ్ కు మెల్లగా మంచి పేరు రావడం ప్రారంభమైంది.
అగర్వాల్ కు 70 ఏళ్ల వయసు వచ్చనా సైకిల్ పైనే తమ ఉత్పత్తులను అమ్మేవారు. ఇలా కోల్ కతా వెళ్లినప్పుడు అక్కడ కూడా బ్రాంచ్ ను ఏర్పాటు చేయాలని అనుకున్నాడు. దీంతో బికనీర్ నుంచి ఇతర రాష్ట్రాల్లో స్థాపించిన మొట్టమొదటి బ్రాంచ్ ఇదే. ఆక్కడా ఈ బ్రాండ్ ఉత్పత్తులు విరివిగా సాగడంతో ఆయన వారసులు కంపెనీని ఏర్పాటు చేసిన ఉత్పత్తులను అభివృద్ధి చేశారు. అలా దేశ వ్యాప్తంగా నాగపూర్, ఢిల్లీ ప్రాంతాల్లోనూ బ్రాంచ్ లను ఓపెన్ చేశారు.
ప్రస్తుతం 80 దేశాలకు పైగా హల్దీరామ్ బ్రాంచ్ లు ఉన్నట్లు సమాచారం. ఈ సందర్భంగా కంపెనీ చైర్మన్ మనోహర్ లాల్ అగర్వాల్ నేతృత్వంలో ప్రపంచంలోని ప్రఖ్యాతి గాంచిన ఫుడ్ కంపెనీలకు గట్టి పోటీ ఇస్తుంది. చిన్న కిరాణం షాపుల్లోనూ కనిపించి హల్దీరామ్ ప్రొడక్టును చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ ఆదరిస్తున్నారు. అయితే ఇంతటి స్థితికి రావడానికి హల్దీరామ్ కృషి చేయడంతో ఆయన పేరుమీదనే ఇప్పటికీ కంపెనీ కొనసాగుతోంది.