Hair Health: నేటి కాలంలో ప్రతి ఒక్కరూ బిజీ వాతావరణంలో గడుపుతున్నారు. దీంతో ఒత్తిడి గురై అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. వీటిలో జుట్టు రాలడం ఒకటి. నీటి కాలుష్యంతో పాటు శరీరంలో జరిగే మార్పులతో జుట్టు రాలిపోతుంది. ఈ సమస్య మగవారిలోనే కాకుండా ఆడవారిలో ఉంటుంది. జుట్టు క్రమంగా రాలిపోయి చిన్న వయసులోనే బట్టతల వస్తుంది. జుట్టు పెరగడానికి చాలా మంది ఎన్నో మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. మరికొందరు రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. అయితే ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలను క్రమ పద్ధతిలో ఉపయోగించడం వల్ల బట్టతల సమస్యను నివారించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆ టిప్స్ గురించి వివరాల్లోకి వెళితే..
బట్టతల రాకముందు చాలా మంది తల స్నానం చేయడానికి ఇష్టపడరు. మరికొందరు మాత్రం ప్రతిరోజూ తలస్నానం చేస్తారు. అయితే ప్రతీరోజూ కాకుండా వారంలో రెండు లేదా మూడు రోజుల పాటు తలస్నానం చేయడం మంచిది. ఈ క్రమంలో తలకు నాణ్యమైన షాంపు వాడడం మంచిది. అంతేకాకుండా తల జుట్టు పూర్తిగా ఆరిన తరువాతే దూసుకోవాలి. తడిగా ఉన్నప్పుుడు దూసుకోవడం వల్ల హెయిర్స్ బలహీనంగా మారుతాయి. దీంతో ఎక్కువగా జుట్టు రాలిపోతూ ఉంటాయి. అలాగని జుట్టును ఆరబెట్టే క్రమంలో ఎలక్ట్రానిక్ హెయిర్ డ్రైని వాడడం అంతమంచిది కాదంటున్నారు.
తలపై మసాజ్ చేసుకోవడం వల్ల ఎంతో రిలీఫ్ గా ఉంటుంది. చాలా మంది ఇలా చేసుకోవడం ఇష్టముండదు. కానీ తల మసాజ్ చేసుకోవడం ద్వారా రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటుంది. దీంతో హెయిర్స్ బలంగా మారి అధికంగా పెరుగుతాయి. మసాజ్ నార్మల్ గా కాకుండా ఆముదం, కొబ్బరి నూనె, గుమ్మడి గింజల నూనె వంటివి వాడుతూ మసాజ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బట్టతల ప్రారంభమైన వారిలో కూడా జుట్టు పెరిగే అవకాశాలు ఉంటాయి.
రోజూవారీ ఆహారంలో భాగంగా చాలా మంది ప్రోటీన్లు తీసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తుంటారు. ముఖ్యంగా బట్టతల సమస్యతో బాధపడేవారు ఆకు కూరలు, బ్రోకలి, స్ట్రాబ్రెర్రీ, నానబెట్టివన శెనగలు, చికెన్ చేపలు ఎక్కువగా తినాలి. ఇవి శరీరానికి అధిక ప్రోటీన్లు ఇవ్వడంతో పాటు జుట్టు పెరగడానికి సహాయపడుతుంది. అయితే జంక్ ఫుడ్ ను మాత్రం దూరంగా పెట్టాలి.
విటమిన్స్ ఎక్కువగా ఉండే ప్రూట్స్ తీసుకోవాలి. ముఖ్యంగా సీ విటమిన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల జుట్టు పెరుగుదలకు సహాయపడినట్లు అవుతుంది. అలాగే విటమిన్ ఏ, ఈ లు ఉండే ఫ్రూట్స్ తీసుకుంటే ఆరోగ్యంగా ఉండగలుగుతారు. శరీరం ఆరోగ్యంగా ఉండడం వల్ల రక్తప్రసరణ మెరుగ్గా ఉండి జుట్టు రాలకుండా కాపాడుతుంది. ఇదే సమయంలో బట్టతల ప్రారంభమయ్యే వారిలో జుట్టు పెరుగుదల ఉంటుంది.