https://oktelugu.com/

Hair Tips: ఈ ఆయిల్ తయారు చేసుకుంటే.. జుట్టు సమస్యలన్నీ పరార్

అమ్మాయిలకు అందాన్నిచ్చే వాటిలో జుట్టు (Hair) చాలా ముఖ్యమైనది. కురులు అందంగా ఉంటేనే మహిళలు (womens) అంత కంటే ఎక్కువ అందంగా కనిపిస్తారు. అయితే కాలుష్యం, వ్యక్తిగత సమస్యలు, ఆందోళన (Tension) వల్ల చాలా మంది జుట్టు ఈ రోజుల్లో రాలిపోతుంది. జుట్టు రాలిపోకుండా ఒత్తుగా పెరగాలంటే మాత్రం కొన్ని సహజ చిట్కాలు పాటించాలి. ముఖ్యంగా ఇంట్లోనే తయారు చేసిన ఆయిల్ రాయడం వల్ల జుట్టు రాలిపోకుండా ఉంటుంది. మరి ఆ ఆయిల్‌ను ఇంట్లోనే తయారు చేసుకోవడం ఎలాగో ఈ స్టోరీలో చూద్దాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 16, 2025 / 12:42 PM IST

    Hair Health

    Follow us on

    Hair Tips: అమ్మాయిలకు అందాన్నిచ్చే వాటిలో జుట్టు (Hair) చాలా ముఖ్యమైనది. కురులు అందంగా ఉంటేనే మహిళలు (womens) అంత కంటే ఎక్కువ అందంగా కనిపిస్తారు. అయితే కాలుష్యం, వ్యక్తిగత సమస్యలు, ఆందోళన (Tension) వల్ల చాలా మంది జుట్టు ఈ రోజుల్లో రాలిపోతుంది. వీటికి ముఖ్య కారణం మనం తినే ఫుడ్, రసాయనాలు (Chemicals) ఉండే ప్రొడక్ట్స్, షాంపూ, ఆయిల్స్ (Oils) వంటివి కారణం అవుతున్నాయి. అయితే ఈ సమస్య నుంచి బయట పడాలని కొందరు ఎన్నో నియమాలు పాటిస్తుంటారు. ముఖ్యంగా మార్కెట్లో దొరికే ఎన్నో ప్రొడక్ట్స్ (Products) కూడా వాడుతుంటారు. అయిన కూడా జుట్టు (Hair Fall) రాలిపోయే సమస్య మాత్రం తగ్గకుండా ఇంకా పెరుగుతుంది. ఇంతకు ముందు జనరేషన్‌లో ఒక్కోరి జుట్టు పొడవుగా ఉండేది. కానీ ప్రస్తుతం ఎవరి జుట్టు చూస్తున్న కూడా చిన్నగానే ఉంటుంది. ఫ్యాషన్‌కి అలవాటు పడి జుట్టుకి ఆయిల్ పెట్టడం లేదు. ఒకవేళ పెట్టిన కూడా అందులో రసాయనాలు ఉండే వాటిని వాడుతున్నారు. వీటి వల్ల చాలా మంది జుట్టు అధికంగా రాలిపోతుంది. జుట్టు రాలిపోకుండా ఒత్తుగా పెరగాలంటే మాత్రం కొన్ని సహజ చిట్కాలు పాటించాలి. ముఖ్యంగా ఇంట్లోనే తయారు చేసిన ఆయిల్ రాయడం వల్ల జుట్టు రాలిపోకుండా ఉంటుంది. మరి ఆ ఆయిల్‌ను ఇంట్లోనే తయారు చేసుకోవడం ఎలాగో ఈ స్టోరీలో చూద్దాం.

    జట్టు బలంగా, ఆరోగ్యంగా పెరగాలంటే తలకు వేప నూనె అప్లై చేయాలి. ఈ నూనె మార్కెట్‌లో లభ్యమవుతుంది. కానీ వీటిని రసాయనాలు కలిపి తయారు చేస్తారు. ఇది జుట్టు ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి వేప నూనెను ఇంట్లోనే తయారు చేసుకోండి. తాజాగా ఉన్న వేపాకులను తీసుకోవాలి. వీటిని బాగా శుభ్రం చేసుకుని, మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్‌లో కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్ వేసి డబుల్ బాయిల్ చేయాలి. నూనె రంగు మారినంత వరకు చేస్తే వేపాకు ఆయిల్ రెడీ. ఈ ఆయిల్‌ను వడ గట్టుకుని, గాజు పాత్రలో నిల్వ చేసుకోవాలి. ఇలా చేసి తలకు అప్లై చేస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. కురులు రాలిపోకుండా ఒత్తుగా పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ ఆయిల్‌ను తలకు అప్లై చేసి కాసేపు మసాజ్ చేయాలి. ఆ తర్వాత రోజు తలస్నానం చేస్తే జుట్టు రాలిపోకుండా ఆరోగ్యంగా పెరుగుతుంది.

    వేపాకు ఆయిల్‌ను వారానికి కనీసం రెండు లేదా మూడు రోజులు అయిన కూడా తలకు అప్లై చేయడం వల్ల జుట్టు బలంగా ఉంటుంది. లేకపోతే అంతా కూడా బలహీనంగా మారుతుంది. మార్కెట్‌లో దొరికే నూనె కంటే ఈ వేపాకు నూనె తలకు రాయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి ఇంట్లోనే సహజంగా వేపాకు నూనెను ఇలా తయారు చేసుకుని తలకు అప్లై చేసుకోవడం ఉత్తమం.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.