Hair Loss Problem: వాతావరణ కాలుష్యం.. నాణ్యమైన ఆహారం లేకపోవడం వల్ల ప్రస్తుత కాలంలో చాలా మంది ఏదో ఒక ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారు. వీటిలో జుట్టు రాలడం ఒకటి. వయసు పైబడిన తరువాత ఎవరికైనా పోషకాలు కరువై జుట్టు రాలుతుంది. కానీ నేటి కాలంలో చిన్న పిల్లలకు కూడా జుట్టు ఊడిపోతుంది. ఈ సమస్య నివారణకు ఎన్ని మెడిసిన్స్ తీసుకున్నా.. కొందరికి ఫలితం ఉండడం లేదు. అయితే జుట్టు రాలకుండా ఉండడానికి ముందుగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేద కొన్ని విషయాలపట్ల జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే జుట్టు రాలకుండా ఉంటుంది. అయితే జుట్టు రాలకుండా ఉండాలంటే మాత్రం ఈ పనులు కచ్చితంగా చేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే?
మానవ శరీరంలో ప్రతి ఒక్క అవయం ఆరోగ్యంగా ఉండాలంటే సరైన పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి. దేహంలో విటమిన్లు, ఐరన్ లోపంతో జుట్టు రాలే సమస్య ఏర్పడుతుంది. ప్రధానంగా రక్తంలో సరైన యాక్సిడెంట్లు ఉంటేనే వెంట్రుకలు బలంగా ఉంటాయి. అంతేకాకుండా ఐరన్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోవడంల్ల ఈ సమస్య రాకుండా ఉంటుంది. అందువల్ల పౌష్టికాహారం ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. అయితే ఎలాంటి ఆహారం తీసుకుంటే జుట్టు రాలకుండా ఉంటుంది?
శరీరంలో రక్త ప్రసరణ మెరుగ్గా ఉండాలంటే ఐరన్ అవసరం. ఐరన్ ఎక్కువగా ఉన్న గుడ్లు, గింజలు వంటివి తీసుకోవాలి. విటమిన్ డి, జింక్ లభించే వాటిని తింటూ ఉండాలి. వీటితో పాటు విటమిన్ ఇ, ఓమెగా 3 ప్యాటీ యాసిడ్ష్ లోపం వంటి కారణంగా జుట్టు రాలే సమస్య ఎక్కువగా ఉంటుంది. విటమిన్ బి 3 లోపం వల్ల కూడా జుట్టు రాలుతూ ఉంటుంది. శరీరంలో పోషకాలు తగ్గడం వల్లే సమస్య కాకుండా జుట్టుకు కొన్ని రసాయనాలు పట్టించడమూ జుట్టు రాలడానికి కారణమవుతుంది.
రసాయనాలు ఎక్కువగా ఉండే షాంపులు, ఎయిర్ కండిషనర్లు, స్టైలింగ్ ఉత్పత్తులు ఎక్కువగా వినియోగించడం వల్ల జుట్టు బలహీనంగా మారుతుంది. స్టైయిట్ నెర్ లు, కర్లింగ్ హైరన్ వంటి హీట్ స్టైలింగ్ సాధనాలు వినియోచడం వల్ల తలకు అధిక వేడిని ఇస్తాయి. దీంతో జుట్టు బలహీనంగా మారి ఊడిపోతుంది.
అయితే జుట్టు రాలకుండా ఉండాలంటే కొబ్బరి లేదా ఆలివ్ నూనెను సాధారణంగా కాకుండా కొద్దిగా వేడి చేసి అంటించాలి. ఇలా తలకు నూనెను రాసిన 30 నిమిషాల తరువాత షాంపూతో స్నానం చేయాలి. ఇలా చేస్తే సమస్య తగ్గిపోవచ్చు. అలాగే కలబంద జెల్ ను నేరుగా తలపై అప్లై చేసి 45 నిమిషాల పాటు వెయిట్ చేయాలి. ఆ తరువాత తలస్నానం చేయడం వల్ల జుట్టు రాలకుండా ఆపవచ్చు.