https://oktelugu.com/

Hair Health: ఈ నూనెలో ఉల్లిపాయ కలిపి రాస్తే.. దృఢమైన జుట్టు మీ సొంతం

ఉల్లిపాయ జుట్టు పెరగడానికి బాగా సహాయపడుతుంది. ఈ ఉల్లిపాయను ఆవనూనెలో కలిపి తలకు అప్లై చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. మరి ఈ రెండింటి మిశ్రమం వల్ల జుట్టుకి కలిగే ప్రయోజనాలు ఏంటో మరి ఈ స్టోరీలో చూద్దాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 19, 2024 / 10:39 PM IST

    Hair Health

    Follow us on

    Hair Health: అమ్మాయిలకి అందాన్నిచ్చే వాటిలో జుట్టు చాలా ముఖ్యమైనది. కురులు అందంగా ఉంటేనే మహిళలు ఎక్కువ అందంగా కనిపిస్తారు. అయితే కాలుష్యం, వ్యక్తిగత సమస్యలు, ఆందోళన వల్ల చాలా మంది జుట్టు ఈ రోజుల్లో రాలిపోతుంది. వీటికి ముఖ్య కారణం మనం తినే ఫుడ్, రసాయనాలు ఉండే ప్రొడక్ట్స్, షాంపూ, ఆయిల్స్ వంటివి కారణం అవుతున్నాయి. అయితే ఈ సమస్య నుంచి బయట పడాలని కొందరు ఎన్నో నియమాలు పాటిస్తుంటారు. ముఖ్యంగా మార్కెట్లో దొరికే ఎన్నో ప్రొడక్ట్స్ కూడా వాడుతుంటారు. అయిన కూడా జుట్టు రాలిపోయే సమస్య మాత్రం తగ్గకుండా ఇంకా పెరుగుతుంది. ఇంతకు ముందు జనరేషన్‌లో ఒక్కోరి జుట్టు పొడవుగా ఉండేది. కానీ ప్రస్తుతం ఎవరి జుట్టు చూస్తున్న కూడా చిన్నగానే ఉంటుంది. అందులో జుట్టు ఇంకా రాలిపోవడం ఒకటి.

    జుట్టు ఆరోగ్యంగా ఉంటూ బలంగా పెరగాలంటే కేవలం మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ వాడితే సరిపోదు. వీటిని వాడటం వల్ల జుట్టు పెరగడం ఏమో కానీ ఇంకా రాలిపోతుంది. ఈ విషయం తెలియక చాలా మంది డబ్బులు ఖర్చు పెట్టి మరి జుట్టు రాలే సమస్యను ఇంకా పెంచుకుంటున్నారు. జుట్టు ఒత్తుగా పెరగాలంటే వాడే మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ కంటే సహజ నూనెలను వాడటం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఉల్లిపాయ జుట్టు పెరగడానికి బాగా సహాయపడుతుంది. ఈ ఉల్లిపాయను ఆవనూనెలో కలిపి తలకు అప్లై చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. మరి ఈ రెండింటి మిశ్రమం వల్ల జుట్టుకి కలిగే ప్రయోజనాలు ఏంటో మరి ఈ స్టోరీలో చూద్దాం.

    ఆవాలతో ఈ ఆవనూనెను తయారు చేస్తారు. ఇది మార్కెట్లో లభ్యమవుతుంది. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే ఉల్లిపాయలో కూడా జుట్టును పెంచే పోషకాలు ఉన్నాయి. ఈ రెండింటి మిశ్రమం జుట్టు సమస్యలు అన్నింటిని నుంచి విముక్తి కలిగేలా చేస్తుంది. ఆవాల నూనెలో విటమిన్ ఎ, ఇ, కె ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలకు బాగా తోడ్పడతాయి. అలాగే వీటితో పాటు ఐరన్, మెగ్నీషియం, కొవ్వు ఆమ్లాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్ల నుంచి బలంగా పెరిగేలా చేస్తాయి. రోజూ ఈ రెండింటి మిశ్రమాన్ని కలిపి తలకు రాయడం వల్ల జుట్టు నల్లగా ఉంటుంది. అయితే ఈ ఆవనూనెలో కేవలం ఉల్లిపాయ అనే కాకుండా మెంతి గింజలు కలిపి కూడా రాయవచ్చు. ఇందులోని పోషకాలు కూడా జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

    ఉల్లిపాయలో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది. ఇవి కొల్లాజెన్‌ను ఉత్పత్తి చేసి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. జుట్టు బాగా రాలుతున్న సమస్య ఉన్నవారు ఆవాల నూనెలో ఉల్లిపాయ రసం, మెంతులు వేసి తలకు అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అయితే ఈ ఆయిల్ అప్లై చేసిన తర్వాత జుట్టును మసాజ్ చేసి తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వల్ల జుట్టు బలంగా తయారవుతుంది. అయితే ఈ ఆవనూనెలో అలోవెరా జెల్, కరివేపాకు వంటివి కూడా కలిపి రాయవచ్చు. వీటిలో ఉండే పోషకాలు జుట్టు పెరుగుదలకు బాగా సాయపడతాయి. అయితే ఆయిల్‌లోనే కాకుండా వీటిని పేస్ట్ చేసి కూడా తలకు అప్లై చేయవచ్చు. దీనివల్ల జుట్టు ఆరోగ్యంగా, బలంగా పెరుగుతుంది. అలాగే రాలిపోయే సమస్య కూడా తగ్గుతుంది.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.