https://oktelugu.com/

Hair Fall: అతిగా దువ్వితే జట్టు రాలిపోతుందా? దీనికి పరిష్కారం ఏంటి?

జుట్టు అతిగా దువ్వితే రాలిపోతుందని కొందరు అంటుంటారు. సాధారణంగా జుట్టు ఒక్కసారి దువ్వితే ఎక్కువగా రాలిపోతుంది. అయితే ఎక్కువగా దువ్వితే నిజంగానే జుట్టు రాలిపోతుందా? దీనికి పరిష్కారం ఏంటి? తెలియాలంటే ఈ ఆర్టికల్‌పై ఓ లుక్కేయండి.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 19, 2024 / 08:32 PM IST

    Hair Fall Reduce Tips

    Follow us on

    Hair Fall: అమ్మాయిలకి ఫుడ్‌కి ఎంత ఇంపార్టెంట్ ఇస్తారో.. అందంగా కనిపించడం కూడా అంతే ముఖ్యం. చాలా మంది అమ్మాయిలు జుట్టు అందంగా, దృఢంగా ఉండాలని కోరుకుంటారు. జుట్టు ఎంత అందంగా ఉంటే అందరిలో బాగా కనిపిస్తారని భావిస్తారు. కొందరు సిల్క్ హెయిర్ ఇష్టపడితే.. ఎక్కువ మంది ఉంగరాల జుట్టుని ఇష్టపడతారు. ఒకప్పటి రోజుల్లో అమ్మాయిల జుట్టు నడుము వరకు దట్టంగా ఉండేవి. కానీ మారిన జీవనశైలి, వాయు కాలుష్యం, రసాయనాలు ఉండే ప్రొడక్ట్స్ వాడటం వల్ల చాలామంది జుట్టు రాలిపోతుంది. అయితే వీటి వల్లే కాకుండా జుట్టు అతిగా దువ్విన కూడా రాలిపోతుందని కొందరు అంటుంటారు. ఎందుకంటే సాధారణంగా జుట్టు ఒక్కసారి దువ్వితే ఎక్కువగా రాలిపోతుంది. అయితే ఎక్కువగా దువ్వితే నిజంగానే జుట్టు రాలిపోతుందా? దీనికి పరిష్కారం ఏంటి? తెలియాలంటే ఈ ఆర్టికల్‌పై ఓ లుక్కేయండి.

     

    జుట్టు విషయంలో జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. లేకపోతే జుట్టు అతిగా రాలిపోతుంది. కొందరు జుట్టుకి నూనె రాయకుండా ఎక్కువగా దువ్వుతారు. దీనివల్ల జుట్టు రాలిపోతుందని నిపుణులు అంటున్నారు. జుట్టుకి సరైన సంరక్షణ లేకపోతే కురులు చివర్లు పగుళ్లు వస్తాయి. దీంతో దువ్వుతుంటే జుట్టు రాలిపోతుందట. కాబట్టి జుట్టు పగుళ్ల రాకుండా చూసుకోవాలి. కొందరు జుట్టు తడిగా ఉన్నప్పుడు దువ్వుతారు. తడిగా ఉన్నప్పుడు జుట్టు కాస్త బలహీనంగా ఉంటుంది. దీంతో కుదుళ్ల నుంచి రాలిపోతుంది. కాబట్టి జుట్టు తడిగా ఉన్నప్పుడు ఎక్కువగా దువ్వకండి. జుట్టు దృఢంగా కంటే సన్నగా ఉన్నవారు ఎక్కువగా దువ్వకపోవడమే మంచిదని నిపుణులు అంటున్నారు. అతిగా దువ్వడం వల్ల జుట్టు క్యూటికల్స్ దెబ్బతింటాయి. ఇవి జుట్టుకు రక్షణ కవచంలా పనిచేస్తాయి. అధికంగా దువ్వితే జుట్టు బలహీనంగా మారి రాలిపోతుంది. పెద్ద పళ్లు ఉన్న దువ్వెనతో నెమ్మదిగా మాత్రమే చేయాలి. ఇలా చేస్తే జుట్టు రాలిపోకుండా ఉంటుంది.

     

    జుట్టు ఎక్కువగా పగుళ్లు వచ్చి రాలిపోతుంటే.. కొన్ని చిట్కాలు పాటించాలి. దీనికోసం రసాయనాలు ఉండే ప్రొడక్ట్స్‌ను వాడక్కర్లేదు. వంటింట్లో దొరికే వాటితో జుట్టు చిట్లిపోయే సమస్యను తగ్గించుకోవచ్చు. జట్టు పగుళ్లు తగ్గాలంటే పెరుగు బాగా ఉపయోగపడుతుంది. పెరుగులో నిమ్మరసం కలిపి కురులకు పట్టిస్తే జుట్టు పగుళ్లు తగ్గుతాయి. అవసరమైతే ఇందులో మందార ఆకు, మెంతులు కలిపి పేస్ట్ తయారు చేసి కురులకు అప్లై చేయాలి. ఒక రెండు గంటల తర్వాత షాంపూ లేకుండా తలస్నానం చేయాలి. మరుసటి రోజు షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా కనీసం వారానికొకసారి అయిన చేయడం వల్ల జుట్టు రాలిపోయే సమస్య తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్‌లో రసాయనాలు ఎక్కువగా ఉంటాయి. వీటి వల్ల జుట్టు తొందరగా రాలిపోయి పలుచగా తయారవుతుంది. వీటిని వాడకుండా ఇంట్లోనే ఉండే పదార్థాలతో జుట్టు రాలే సమస్యలకు చెక్ పెట్టవచ్చు. దీనివల్ల ఖర్చు తక్కువ కావడంతో పాటు జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

     

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.