Guava leaves: మారుతున్న జీవనశైలి వల్ల చాలా మంది ఈరోజుల్లో ఎక్కువగా ఊబకాయం సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. బయట దొరికే అనారోగ్యమైన ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో హానికరమైన కొవ్వు పెరుగుతుంది. ఎక్కువ రోజులు నిల్వ ఉంచిన ప్రాసెస్ చేసిన ఫుడ్ చాలా మంది ఇష్టంగా తింటారు. ఇది ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసిన కూడా వీటినే తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఇలాంటి అనారోగ్యమైన ఆహారాలు తినడం వల్ల పొట్ట చుట్టూ కొవ్వు పెరిగి, బరువు అవుతున్నారు. దీనివల్ల లేనిపోని సమస్యలను కోరి తెచ్చుకుంటున్నారు. ఎక్కువగా బరువు పెరిగిన తర్వాత మళ్లీ వర్క్‌వుట్‌లు, జిమ్‌లు అంటూ వాటి చుట్టూ తిరుగుతున్నారు. అనారోగ్యమైన కొవ్వు వల్ల బరువు పెరిగిన వారు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్న కూడా తగ్గడంలేదు. దీంతో అనారోగ్య సమస్యల బారిన కూడా పడుతున్నారు. మరి శరీరంలో ఉన్న హానికరమైన కొవ్వులను కరిగించాలంటే కొన్ని సహజ చిట్కాలు పాటించాలి. ఇంటి పెరట్లో ఉండే ఈ ఆకులతో బాడీలోని అనారోగ్యమైన కొవ్వును ఇట్టే కరిగించవచ్చు. మరి కొవ్వును కరిగించే ఆ ఆకులేంటో ఈ స్టోరీలో చూద్దాం.
ఊబకాయం సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ రెమిడీని ఉపయోగించాలి. ఈ ఆకులు కూడా ఈజీగా దొరుకుతాయి. ఆరోగ్యానికి మేలు చేసే జామ కాయ ఆకులతో చిన్న చిట్కాలు పాటిస్తే ఒంట్లో ఉండే కొవ్వును తగ్గించవచ్చు. పోషకాలు ఎక్కువగా ఉంటే జామ కాయలు ప్రతీ సీజన్‌లో దొరుకుతాయి. వీటిని తినడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారు. కేవలం ఈ కాయలతో కాకుండా ఆకులను కూడా తింటే ఈజీగా బరువు తగ్గుతారట. కొత్తలో తినడానికి జామ ఆకులు నచ్చకపోవచ్చు. కానీ తినేకొలది అలవాటు అవుతారు. అయితే ఎంత తిన్న ఈ ఆకులు నచ్చడం లేకపోతే జామ ఆకులతో టీ చేసుకుని అయిన తాగవచ్చు. ఉదయం పరగడుపున జామ ఆకులు టీని తాగడం వల్ల తొందరగా బరువు తగ్గుతారు. ఈ టీ పొట్ట చుట్టూ ఉండే కొవ్వును కరిగించడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. అయితే ఈ టీ చేసేటప్పుడు తాజా జామ ఆకులను మాత్రమే ఉపయోగించాలి. ఒక నాలుగు లేదా ఐదు జామ ఆకులను తీసుకుని శుభ్రం చేసుకోవాలి. వీటిని ఒక పాత్రలో వేసి అందులో నీరు వేసి బాగా మరిగించాలి. ఆ తర్వాత గోరువెచ్చగా చేసి తాగితే ఊబకాయ సమస్య నుంచి విముక్తి పొందుతారు.
జామ కాయల్లోనే కాకుండా ఆకుల్లో కూడా పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులోని యాంటీ బాక్టీరియల్, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఈ జామ ఆకుల టీ లేదా తిన్నా గ్యాస్ట్రిక్, అజీర్ణం, కడుపు నొప్పి, అల్సర్లు వంటి సమస్యలను కూడా నివారిస్తుంది. దీర్ఘకాలికంగా దగ్గు, దురద వంటి సమస్యలతో బాధపడుతున్నా వారు జామ ఆకులతో చెక్ పెట్టవచ్చు. ఈ ఆకులతో రక్తప్రసరణ మెరుగుపడటంతో పాటు ఆరోగ్యంగా ఉంటారు. అలాగే గుండె ప్రమాద సమస్యలు రాకుండా ఉండటంతో పాటు మధుమేహాన్ని కూడా తగ్గించడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. కాబట్టి ఏదో విధంగా జామ ఆకులను తీసుకోవడం అలవాటు చేసుకోవడం ఉత్తమం.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.