Kitchen Tips: గసగసాలు అంటే ఏదో వంటింట్లో ఉండే ఐటమ్స్ లో ఒక చిన్న ఐటమ్ లాగేమ్ మనం చూస్తాం. కానీ, ఆ గసగసాలు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అవేమిటో చూద్దాం.

వీర్య స్తంభనకు పది గ్రాముల గసగసాలను కొంచెం నీళ్ళతో మెత్తగా నూరి, అర కప్పు పాలల్లో కలిపి అందులో 20 gm పటిక బెల్లం పొడి కలిపి రోజు 2 పూటలా తాగుతూ వుంటే వీర్య స్థంభన కలుగుతుంది. శరీరంలో చలువ చేయడానికి 10gm గసగసాలు కొంచెం నీళ్ళతో నూరి, తగినంత పటిక బెల్లం కలిపి రోజు తింటూ వుంటే అధిక వేడి తగ్గి, దేహం చలువ చేస్తుంది .

అలాగే, చుండ్రుకు-వెంట్రుకలు పెరుగుటకు కూడా ఈ గసగసాలు బాగా ఉపయోగపడతాయి. వీటిని నీటిలో లేదా పాలలో నానబెట్టి మేతగా రుబ్బి తలకు పెట్టుకుని ఆరిన తర్వాత కుంకుడు రసంతో తలస్నానం చేస్తూ వుంటే తలలో కురుపులు చుండ్రు తగ్గి పోయి వెంట్రుకలు ఆరోగ్యంగా పెరుగుతాయి.
Also Read: బడ్జెట్ పై కేసీఆర్ రచ్చ రచ్చ.. జగన్ మౌనం.. బాబు మొహమాటం.. పవన్ స్పందన ఘోరం
ఇక శిరో వాతము నకు కూడా గసగసాలు 10gm, యాలకులు 10gm, సోంపు గింజలు 10gm .. ఈ పదార్ధాలను కొంచెం నీళ్ళతో మెత్తగా నూరి అందులో 60 gm ఆవు నెయ్యి కలిపి నీరు ఇరిగే నెయ్యి మిగిలే వరకు చిన్న మంట మీద మరగబెట్టి దించి వడపోసి నిలువ ఉంచుకుని.. దీనిని రోజు తలకు రాసుకుంటూ వుంటే తల దిమ్ము, తల నొప్పి, పార్శ్వపు నొప్పి వెంటనే తగ్గిపోతాయి.
అలాగే గర్బిణీల రక్త జిగట విరేచనాలను కూడా ఈ గసగసాలు తగ్గిస్తాయి. గసగసాలు 10gm లు, పటిక బెల్లం 20gm కలిపి మెత్తగా నూరి నిలువ ఉంచుకుని, పూటకు 5gm పొడిని 20 gm వెన్నలో కలుపుకుని రోజు 2 లేదా 3 పూటలు తింటూ వుంటే గర్బిణీలకు కలిగే రక్త జిగట విరేచనాలు తగ్గిపోతాయి.
Also Read: బీజేపీపై కేసీఆర్ ఎందుకు బరెస్ట్ అయ్యాడు?