google Photos : ఇంపార్టెంట్ ఫొటోలు డెలీట్ అయ్యాయా..? ఇలా చేసి తిరిగి తెచ్చుకోండి..

ఇప్పడు ఫొటో రెక్, డిస్క్ డ్రిల్, ఫ్రీ అన్ డెలీట్ వంటి థర్డ్ పార్టీ ప్రోగ్రామ్ లను ఉపయోగించి డెలీటెడ్ ఫొటోలను రీస్టోర్ చేయడానికి ప్రయత్నించవచ్చు.

Written By: Srinivas, Updated On : March 6, 2024 4:56 pm

Photos delete from mobile

Follow us on

google Photos : చేతిలో మొబైల్ లేని వాళ్లు ఈరోజుల్లో కనిపించరు. కేవలం కాలక్షేపానికోసమే కాకుండా వివిధ విధుల నిమిత్తం స్మార్ట్ ఫోన్ ను ఎక్కువగా వాడుతున్నారు. మొబైల్ కేవలం కమ్యూనికేషన్ కోసమే కాకుండా మంచి మంచి ఫొటోలను తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. కొత్తగా వచ్చేస్మార్ట్ ఫోన్లు ఎక్కువ పిక్సెల్ తో అందిస్తున్నాయి. దీంతో చాలా మంది కెమెరా ఫీచర్ ను బేస్ చేసుకొని మొబైల్ కొనుగోలు చేస్తున్నారు. అయితే వివిధ ప్రదేశాలకు వెళ్లి అందమైన ఫొటోలు తీసుకున్న తరువాత అవి అటోమేటిక్ గా డెలీట్ అయితే ఎంతో బాధేస్తుంది. అయితే గూగుల్ అందిస్తున్న ఈ సదుపాయం ద్వారా అలా డెలీట్ అయిన ఫొటోలను తిరిగి తెప్పించుకోవచ్చు. అదెలాగంటే?

సాధారణంగా ఫొటో గ్యాలరీ నుంచి ఫొటోలు డెలీట్ చేస్తే నెల వరకు ట్రాష్ ఫోల్డర్ లో స్టోర్ అయి ఉంటాయి. వీటిని తిరిగి తీసుకోవాలంటే రిస్టోర్ కొడితె సరిపోతుంది. కానీ నెల తరువాత ఆ ఫొటోలు కావాలంటే మాత్రం దొరకవు. ఇన్ని రోజులు ఈ సదుపాయం లేకపోవడంతో ఫొటోలను చాల జాగ్రత్తగా ఉంచుకునేవారు. కానీ ఒక్కోసారి ఫోన్ మాట్లాడేటప్పడు ఇవి ఆటోమేటిక్ గా డెలీట్ అవుతాయి. అయితే ఈ ఫొటోలు నెల తరువాత.. అంటే 2 సంవత్సరాల వరకు డెలీట్ అయినవి తిరిగి తెప్పించుకోవచ్చు.

ఇందు కోసం ముందుగా గూగుల్ ఫొటోస్ లోని ట్రాష్ ఫోల్డర్ ఓపెన్ చేయాలి. ఆ తరువాత స్టోరేజ్ చేయాలనుకున్న ఫొటోను సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తరువాత రిస్టోర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి ఆ ఫొటోను గ్యాలరీకి లేదా గూగుల్ ఫొటోస్ లోని లైబ్రరీకి తీసుకురండి. ఈ ఫొటోలు గూగుల్ డ్రైవ్ లో స్టోర్ అయితే వీటిని ఎందుకు స్టోరేజ్ చేయాలనుకుంటున్నారో వివరిస్తూ హెల్ప్ పేజీ ద్వారా రిక్వెస్ట్ పంపాల్సి ఉంటుంది. ఆ తరువాత మిస్సింగ్ ఆర్ డిలీటెడ్ ఫైల్స్ అనే ఆప్షన్ పై క్లి చేసి.. పాప్ అప్ బాక్ష్ లోని రిక్వెస్ట్ చాట్, ఈమెయిల్ సపోర్ట్ అనే రెండింటిలో ఏదో ఒకదానిని సెలెక్ట్ చేసుకోవాలి.

ఇప్పడు ఫొటో రెక్, డిస్క్ డ్రిల్, ఫ్రీ అన్ డెలీట్ వంటి థర్డ్ పార్టీ ప్రోగ్రామ్ లను ఉపయోగించి డెలీటెడ్ ఫొటోలను రీస్టోర్ చేయడానికి ప్రయత్నించవచ్చు. వీటిని ఉపయోగించడం ద్వారా ఎటువంటి మాల్స్ కు గురి కాకుండా ఉంటాయి. ఇతర టూల్స్ ను ఉపయోగిస్తే వైరస్ బారిన పడే ప్రమాదం ఉంది. అందువల్ల పైన చెప్పిన విధంగా ఫాలో అయి డెలీట్ అయిన ఫొటోలను తిరిగి తెచ్చుకోండి.