Maruthi XL6.: ఫీచర్లతో అదరగొడుతున్న Maruthi XL6.. ఎలా ఉందో చూడండి..

ఇందులో బాడీ టైప్ ఎం యూవీని పోలీ ఉంటుంది. దీనిని షెడ్డులో ఉంచినప్పుడు ఏదైనా కారు అడ్డం వచ్చినప్పుడు దీనికి ఉండే ఫెడల్ ఉపయోగపడే విధంగా అమర్చారు.

Written By: Chai Muchhata, Updated On : March 6, 2024 4:59 pm

Maruthi Xl6

Follow us on

Maruthi XL6.: కారు కొనాలనుకునేవారు ముందుగా మారుతి సుజుకీ గురించి ఎంక్వైరీ చేస్తారు. ఎందుకంటే అన్ని వర్గాల వారికి అనుగుణంగా.. అనువైన బడ్జెట్ లో ఈ కారు లభిస్తుంది. అలాగే లేటేస్ట్ ఫీచర్స్ తో ఎప్పటికప్పుడు కొత్త కారు అందుబాటులోకి వస్తుంది. తాజాగా మారుతి సుజుకీ నుంచి ఓ కొత్త కారు మార్కెట్లోకి రావడానికి సిద్ధంగా ఉంది. దీని గురించి తెలిసి ఇంప్రెస్ అవుతున్నారు. ఇప్పటి వరకు వచ్చిన కార్ల కంటే భిన్నంగా ఉండడంతో పాటు ప్రయాణికుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. మరి దీని వివరాల్లోకి వెళితే..

మారుతి నుంచి మార్కెట్లోకి రావడానికి సిద్ధంగా ఉన్న కారు XL6. ఈ కారును చూడగానే కొనాలనే ఆసక్తి పుడుతుంది. ఇందులో పప1462 సీసీ ఇంజిన్ తో పాటు 86 నుంచి 101 బీహెచ్ పీ పవర్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. 121 నుంచి 136 వరకు ఎన్ ఎం ఉత్పత్తి చేస్తుంది. ఇక ఇప్పటి వరకు మారుతి కార్లలో ఇలాంటి మోడల్ లో 5 సీట్లు మాత్రమే చూశాం. కానీ ఇందులో 6 గురు సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. ఇందులో పెట్రోల్ ఇంజిన్ తో పాటు సీఎన్ జీ వెర్షన్ కూడా అందుబాటులో ఉంది.

45 లీటర్ల ఫ్యూయెల్ సామర్థ్యం ఉన్న ఇందులో బాడీ టైప్ ఎం యూవీని పోలీ ఉంటుంది. దీనిని షెడ్డులో ఉంచినప్పుడు ఏదైనా కారు అడ్డం వచ్చినప్పుడు దీనికి ఉండే ఫెడల్ ఉపయోగపడే విధంగా అమర్చారు. 360 డిగ్రీ కెమెరాతోపాటు బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవడానికి అనుగుణంగా ఉండే ఇందులో కొత్త యాప్ లు ఇన్ స్టాల్ చేసుకొని పాటు వినొచ్చు. ఇక ఇందులో బూట్ స్పేస్ 209 లీటర్ల సామర్థ్యం ఉండడంతో వినియోగదారులు విపరీతంగా ఆకర్షిస్తోంది.