WhatsApp : వాట్సాప్‌ యూజర్లకు గుడ్‌ న్యూస్‌.. అందుబాటులోకి సరికొత్త ఫీచర్‌!

మెటా యాజమాన్యం భారత యూజర్ల కోసం ఎప్పటికప్పుడ కొత్తకొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తుంది. త్వరలో మరికొన్ని ఫీచర్లు కూఆ రానున్నట్లు మెటా యాజమాన్యం వెల్లడించింది.

Written By: NARESH, Updated On : February 20, 2024 12:55 pm

Whatsapp new feature

Follow us on

WhatsApp : వినియోగదారులకు సురక్షితమైన మెస్సేజింగ్‌ సౌకర్యం కల్పించేందుకు ఇన్‌స్టంట్‌ మెస్సేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తుంది. వినియోగదారుల సూచలు, సలహాలు, అభిరుచి, అభ్యంతరాలకు తగినట్లుగా మార్పులు చేస్తోంది. బెటర్‌ యూజర్‌ ఇంటర్‌ ఫేస్‌ కోసం వాట్సాప్‌.. చాలా రోజులుగా పలు రకాల అప్‌ డేట్స్‌పై పరిశోధన చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా యూటర్లకు వాట్సాప్‌ ఒక గుడ్‌న్యూస్‌ చెప్పింది. అందరికీ అవసరమయ్యే ‘స్క్రీన్‌షాట్‌ బ్లాకింగ్‌’ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్‌తో వినియోగదారుల ఫొటోలు, వీడియోలను ఇతరులు స్క్రీన్‌షాట్‌ తీసుకోవడానికి వీలు ఉండదు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ WEBetalnfo ఫీచర్‌ కు సంబంధించి స్క్రీన్‌షాట్‌ను షేర్‌ చేసింది. అయితే ఈ ఫీచర్‌ను మొదట కొంతమంది iso బీటా వర్షన్‌ వినియోగదారుకు మాత్రమే అందించింది.

ఇప్పుడు అందరికీ అందుబాటులో..
ఇక స్క్రీన్‌షాట్‌ బ్లాకింగ్‌ ఫీచర్‌ ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఫొటోలు, వీడియోలు డీఫాల్ట్‌గా బ్లాక్‌ చేసిన తర్వాత ఎవరూ స్క్రీన్‌షాట్‌ తీయడం కుదరదు. మెటా సీఈవో మార్క్‌ జూకర్‌బర్గ్‌ ఇటీవలే వాట్సాప్‌లో మూడు కొత్త ప్రైవసీ ఫీచర్‌లను అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. అందులో భాంగంగానే ఈ స్క్రీన్‌షాట్‌ బ్లాకింగ్‌ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఈ ఫీచర్‌తో వినియోగదారులు చాట్‌ చర్యలతో ఒక ఎంత్రీపాయింట్‌ చూడగలరు. గరిష్టంగా 12 ఆప్షన్స్‌ పెట్టుకునే అవకాశం ఉంది.

భారత్‌లో భారీగా వినియోగదారులు..
ఇదిలా ఉంటే.. భారత్‌తో ఇన్‌స్టంట్‌ వాట్సాప్‌ మెస్సేజింగ్‌ యాప్‌ ఉపయోగించేవారు భారీగా ఉన్నారు. దేవవ్యాప్తంగా 500 మిలియన్లకుపైగా యూజర్లు ఉన్నట్లు సమాచారం. ప్రపంచంలో అత్యధిక యూజర్లు ఉన్నది భారత్‌లోనే. అందుకే మెటా యాజమాన్యం భారత యూజర్ల కోసం ఎప్పటికప్పుడ కొత్తకొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తుంది. త్వరలో మరికొన్ని ఫీచర్లు కూఆ రానున్నట్లు మెటా యాజమాన్యం వెల్లడించింది.